‘లస్ట్ స్టోరీస్’లో కియారా అద్వానీ నటించిన వివాదాస్పద సీన్‌పై రాధిక మదన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో విమర్శలు వచ్చినా కరణ్ జోహార్ వెనక్కి తగ్గకుండా ఆ కథను చెప్పిన విధానాన్ని ఆమె ప్రశంసించారు.
Kiara Advani: ‘లస్ట్ స్టోరీస్’లో కియారా అద్వానీ బోల్డ్ సీన్‌పై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అయితే ఇప్పుడు అలాంటి విషయాలపై ప్రేక్షకుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందని రాధిక మదన్ అన్నారు. మహిళల కోరికలు, భావోద్వేగాల గురించి మాట్లాడటం సాధారణంగా మారుతోందని ఆమె పేర్కొన్నారు.
1/5
కియారా అద్వానీ లస్ట్ స్టోరీస్ సీన్
బాలీవుడ్ నటి రాధిక మదన్ ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ 3లో తన నటనకు ప్రశంసలు అందుకుంటున్నారు. శకున్ బాత్రా దర్శకత్వం వహించిన ఈ కథలో రాధిక మదన్, అలీ ఫజల్ కలిసి నటించారు. భార్యాభర్తల మధ్య దూరం, వారి భావోద్వేగాలు, కోరికలు వంటి అంశాలను ఈ కథలో చూపించినట్లు తెలుస్తోంది.
2/5
రాధిక మదన్ ఇంటర్వ్యూ
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాధిక మదన్ లస్ట్ స్టోరీస్ ఫ్రాంచైజీ గురించి, గతంలో వచ్చిన సినిమాలపై వచ్చిన విమర్శల గురించి మాట్లాడారు. ముఖ్యంగా కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన మొదటి లస్ట్ స్టోరీస్లో కియారా అద్వానీ నటించిన ఒక సన్నివేశం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.
3/5
లస్ట్ స్టోరీస్ 3 వార్తలు
ఆ సన్నివేశంలో మహిళల వ్యక్తిగత కోరికలకు సంబంధించిన అంశాన్ని చూపించారు. దాంతో సినిమాపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. కియారా అద్వానీ కూడా ఈ సన్నివేశంపై వచ్చిన స్పందన గురించి గతంలో మాట్లాడారు. ఇలాంటి విషయాలను ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై రాధిక మదన్ మాట్లాడుతూ కరణ్ జోహార్‌ను ప్రశంసించారు. అలాంటి కథను చెప్పాలనే ఆలోచనపై ఆయన వెనక్కి తగ్గకుండా తన నమ్మకాన్ని కొనసాగించారని ఆమె అన్నారు. ఆ సన్నివేశాన్ని తెరకెక్కించడంలో కరణ్ జోహార్ ధైర్యంగా వ్యవహరించారని రాధిక పేర్కొన్నారు.
4/5
బాలీవుడ్ న్యూస్
2018లో లస్ట్ స్టోరీస్ మొదటి భాగం విడుదలైనప్పుడు ఇలాంటి విషయాలను తెరపై చూపించడంపై చాలా చర్చ జరిగిందని రాధిక గుర్తు చేసుకున్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చిందని ఆమె అన్నారు. ముఖ్యంగా ప్రేమ, కోరికలు, మహిళల వ్యక్తిగత నిర్ణయాల గురించి మాట్లాడే విధానంలో మార్పు కనిపిస్తోందని చెప్పారు.
5/5
శకున్ బాత్రా
లస్ట్ స్టోరీస్ సిరీస్‌లో మహిళల భావోద్వేగాలు, వారి స్వేచ్ఛ, వ్యక్తిగత కోరికలకు ప్రాధాన్యత ఇచ్చే కథలు ఎక్కువగా కనిపిస్తాయని రాధిక తెలిపారు. ఇలాంటి కథలు హైపర్ మేల్ సెంట్రిక్ సినిమాలతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ, ప్రముఖ దర్శకులు వాటిని తెరకెక్కిస్తున్నారని ఆమె అన్నారు. తన వ్యక్తిగత ఆలోచనల్లో కూడా కాలక్రమేణా మార్పు వచ్చిందని రాధిక చెప్పారు. కోరిక అనేది మనిషిలో సహజమైన భావన అని, దానిని తప్పుగా చూడాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలపై మనకు ఏర్పడే అభిప్రాయాలను తర్వాత మనమే మార్చుకోవాల్సి వస్తుందని తెలిపారు.