వీధి కుక్కల సమస్య, చిన్నారి మృతి ఘటన నేపథ్యంలో తనపై వచ్చిన ట్రోలింగ్‌కు యాంకర్ రష్మీ గౌతమ్ ఘాటుగా స్పందించారు. తనను విమర్శించడం కంటే జంతు సంక్షేమం, ప్రజల భద్రతకు సంబంధించిన వ్యవస్థను ప్రశ్నించాలని ఆమె కోరారు.
Rashmi Gautam: చిన్నారి మృతి ఘటన నేపథ్యంలో రష్మీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దీనిపై స్పందించిన ఆమె.. జంతు సంక్షేమ నిధులు, టీకాలు, సంతాన నియంత్రణ, సంరక్షణ కేంద్రాలపై కీలక ప్రశ్నలు లేవనెత్తారు.
1/5
జంతు సంరక్షణ
టాలీవుడ్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. జంతు సంక్షేమం, ముఖ్యంగా వీధి కుక్కలు, పిల్లుల సంరక్షణపై రష్మీ తరచూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా కుక్క కాటు కారణంగా ఓ చిన్నారి మృతి చెందిన ఘటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొందరు నెటిజన్లు ఆమెను ట్యాగ్ చేసి ప్రశ్నించారు. వీధి కుక్కలకు మద్దతుగా మాట్లాడే ఆమె.. ఈ ఘటనపై ఏం చెబుతారని నిలదీశారు. కొందరు ఆమెపై ట్రోలింగ్, మీమ్స్ కూడా చేశారు.
2/5
రష్మీ కామెంట్స్
ఈ విమర్శలకు రష్మీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనను వ్యక్తిగతంగా దూషించడం, అవమానించడం వల్ల అసలు సమస్యకు పరిష్కారం లభించదని ఆమె స్పష్టం చేశారు. తనను ఎంతగా విమర్శించినా పెద్దగా పట్టించుకోనని, అయితే ప్రజలు అసలు బాధ్యత వహించాల్సిన వ్యవస్థను ప్రశ్నించాలని సూచించారు.
3/5
టాలీవుడ్ న్యూస్
జంతు సంక్షేమం కోసం కేటాయిస్తున్న నిధులు ఎలా వినియోగిస్తున్నారనే విషయంపై ఆమె ప్రశ్నలు సంధించారు. జంతు సంరక్షణ కేంద్రాల్లో సరైన సదుపాయాలు ఎందుకు లేవని, ప్రభుత్వ పశువైద్య ఆసుపత్రుల్లో అవసరమైన వసతులు ఎందుకు అందుబాటులో లేవని ఆమె ప్రస్తావించారు. వీధి కుక్కలు, పిల్లులకు సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు, టీకాలు సక్రమంగా నిర్వహించాల్సిన అవసరాన్ని కూడా రష్మీ పేర్కొన్నారు. జంతువుల సంఖ్యను నియంత్రించడంతో పాటు వ్యాధుల వ్యాప్తిని అడ్డుకోవడంలో టీకాలు కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే ఆవులు, గేదెల యజమానులకు జంతువుల సంరక్షణపై తగిన అవగాహన, మార్గదర్శకాలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
4/5
తెలుగు సినిమా వార్తలు
అంతేకాకుండా వన్యప్రాణులు మానవ నివాస ప్రాంతాల్లోకి ఎందుకు వస్తున్నాయనే అంశాన్ని కూడా రష్మీ ప్రస్తావించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని కోరారు. సోషల్ మీడియాలో తనతో వాదించడంపై సమయం వెచ్చించడం కంటే సమస్యలకు బాధ్యత వహించే అధికారులను ప్రశ్నించాలని ఆమె సూచించారు.
5/5
సోషల్ మీడియా వైరల్
ఇదిలా ఉంటే, వీధి కుక్కల అంశంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జంతువుల పట్ల హింసను అరికట్టాలని కొందరు కోరుతుండగా, చిన్నారులు, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో జంతు సంరక్షణ, టీకాలు, సంతాన నియంత్రణ, ప్రజా భద్రత, అవగాహన వంటి అంశాలు మరోసారి చర్చకు వచ్చాయి.
తెలుగు సినిమా వార్తలు
అంతేకాకుండా వన్యప్రాణులు మానవ నివాస ప్రాంతాల్లోకి ఎందుకు వస్తున్నాయనే అంశాన్ని కూడా రష్మీ ప్రస్తావించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని కోరారు. సోషల్ మీడియాలో తనతో వాదించడంపై సమయం వెచ్చించడం కంటే సమస్యలకు బాధ్యత వహించే అధికారులను ప్రశ్నించాలని ఆమె సూచించారు.