• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Sampoornesh Babu: సంపూర్ణేష్ బాబుపై జర్నలిస్ట్‌ అనుచిత వ్యాఖ్యలు.. స్పందించిన హీరో!

Sampoornesh Babu: సంపూర్ణేష్ బాబుపై జర్నలిస్ట్‌ అనుచిత వ్యాఖ్యలు.. స్పందించిన హీరో!

Written ByVishnu Priya
Published: Sep 25, 2026, 09:40 PM IST|Updated: Sep 25, 2026, 09:55 PM IST
joinshare
సంపూర్ణేష్ బాబు ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో దుమారం రేగింది. అయితే ఈ వ్యవహారంపై సంపూ ఊహించని విధంగా స్పందించారు. తమ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి చెబుతూ అభిమానులు ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు.

Sampoornesh Babu: ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సంపూర్ణేష్ బాబుతో జరిగిన ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వివాదంపై సంపూ స్పందిస్తూ, తమ మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆ వ్యాఖ్యలు వచ్చాయని వివరణ ఇచ్చారు. అనంతరం జర్నలిస్ట్ కూడా అభిమానులకు క్షమాపణలు తెలిపారు.
 

Sampoornesh Babu reaction1/5

సంపూర్ణేష్ బాబు ఇంటర్వ్యూ

సంపూర్ణేష్ బాబు పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. అయితే ఈసారి ఆయన నటించిన సినిమా కంటే ఓ ఇంటర్వ్యూలో చోటుచేసుకున్న వ్యాఖ్యలే చర్చకు కారణమయ్యాయి. ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఫిల్మ్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్‌తో సంపూర్ణేష్ బాబు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
 Tollywood news2/5

సంపూర్ణేష్ బాబు వైరల్ వీడియో

ఆ వ్యాఖ్యలు సంపూర్ణేష్ బాబును కించపరిచే విధంగా ఉన్నాయంటూ కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా బాడీ షేమింగ్‌కు సంబంధించిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరోలతో ఇలాంటి ప్రశ్నలు అడిగేవారా అంటూ కొందరు జర్నలిస్ట్‌ను ప్రశ్నించారు.
Telugu cinema news3/5

సంపూ

ఈ వివాదంపై సంపూర్ణేష్ బాబు స్వయంగా స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను తాను కూడా చూశానని చెప్పారు. అయితే జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ తనకు చాలా కాలంగా పరిచయమున్న వ్యక్తి అని, తమ మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని వివరించారు. తమ అనుబంధం కారణంగానే ఇంటర్వ్యూలో సరదాగా మాట్లాడే క్రమంలో కొన్ని మాటలు వచ్చాయని తెలిపారు.
 viral interview4/5

సంపూర్ణేష్ బాబు

తనను అభిమానించే వారు ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని సంపూర్ణేష్ బాబు కోరారు. ‘హృదయ కాలేయం’ సినిమా కాలం నుంచి నాగేంద్ర కుమార్ తనను ప్రోత్సహిస్తున్న జర్నలిస్టుల్లో ఒకరని గుర్తుచేసుకున్నారు. తనకు మద్దతుగా నిలిచిన జర్నలిస్టులపై తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని చెప్పారు.
 social media controversy5/5

సోషల్ మీడియా ట్రోలింగ్

మరోవైపు సోషల్ మీడియాలో విమర్శలు పెరగడంతో నాగేంద్ర కుమార్ కూడా వివరణ ఇచ్చారు. సంపూర్ణేష్ బాబుతో తనకు ఎన్నో ఏళ్లుగా స్నేహం ఉందని, ఆ సాన్నిహిత్యంతోనే ఇంటర్వ్యూను గంభీరంగా కాకుండా వినోదాత్మకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో అలా మాట్లాడానని తెలిపారు. సంపూని అవమానించాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఇంటర్వ్యూ వల్ల సంపూర్ణేష్ బాబు అభిమానులు, ప్రేక్షకులు బాధపడి ఉంటే వారికి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు. దీంతో ఈ వివాదంపై ఇద్దరి వివరణలు వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో చర్చ మరింత ఆసక్తికరంగా మారింది.
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.