• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /శని గోచారం 2026.. ఈ 5 రాశులకు తిరుగులేని అదృష్టం..!

శని గోచారం 2026.. ఈ 5 రాశులకు తిరుగులేని అదృష్టం..!

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 02, 2026, 03:18 PM IST|Updated: Nov 02, 2026, 03:25 PM IST
joinshare

Shani Nakshatra Gochar: జ్యోతిష్య శాస్త్రంలో, శని దేవుడు న్యాయానికి ధర్మానికి ప్రతీక. అంతేకాదు  కర్మలను ప్రసాదించే ఫలప్రధాత.  ఇక నవగ్రహాల్లో శనిదేవుడికి మంద గమనుడనే పేరుంది. ఈయన ఒక రాశి నుంచి మరొక రాశిలోకి నెమ్మదిగా అంటే రెండున్నరేళ్లు పడుతుంది. అంతేకాదు ఈయన ఒక్కో నక్షత్ర సంచారంతో కొన్ని రాశుల వారికి అపూర్వమైన ప్రయోజనాలు అందించబోతున్నట్టు గ్రహ గోచారం చెబుతున్న మాట. 
 

Shani Gochar 20261/7

శనిదేవుడి గోచారం 2026

Shani Gochar 2026: శనిదేవుడు నక్షత్ర సంచారం లేదా మార్పు 12 రాశులనూ ప్రభావితం చేయగలదు. శని దేవుడు అక్టోబర్ ప్రారంభంలో ఉత్తరాభాద్రా నక్షత్రంలోకి ప్రవేశించింది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ నక్షత్రంలోనే ఉండనుంది. ప్రస్తుతం శని దేవుడు వక్రగతిలో సంచరిస్తున్నారు. అందువల్ల, శని యొక్క ఈ స్థానం కొన్ని రాశులకు ప్రయోజనం చేకూర్చబోతుంది. అంతేకాదు రాబోయే 100 రోజులు ఈ రాశుల వారికి కొత్త అవకాశాలతో పాటు మీ జీవన పురోగతి మార్గాలను తెరిపించబోతున్నట్టు గ్రహగతులు చెబుతున్న మాట. ఈ కాలంలో ఏ రాశుల వారు ప్రయోజనం పొందే అవకాశం ఉందో పండిత్ నాగరాజ్ శర్మ చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం ఈ రాశులకు వారికీ బంపర్ జాక్‌పాట్ తగలపోతున్నదట.
Makara Rasi 2/7

మకర రాశి

మకర రాశి.. మకర రాశి వారికి, రాబోయే 100 రోజులు వారి కష్టానికి తగ్గ ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో ఉన్నవారు చేసిన పనికి ప్రశంసలు అందుకుంటారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదే సరైన సమయం. కొత్త క్లయింట్లు వల్ల ఆర్ధికంగా ప్రయోజనాలు అందుకుంటారు. కొత్త ఆదాయ వనరులు చేతికి అందుతాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా ఉంటుంది.
Tula Rasi 3/7

తుల రాశి

తుల రాశి.. తులా రాశి వారికి, శని యొక్క ఈ స్థానం వృత్తిలో ఉన్నతితో పాటు కొత్త మార్గాలను తెరవబోతుంది. పనిలో ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి మద్దతు అందుకుంటారు. మీ పని ప్రశంసించబడును. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇదే మంచి తరుణం. మంచి ఆఫర్ మిమ్మల్ని పలకరిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు, హోదా మార్పులకు అవకాశాలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలపడుతుంది. మీ ఆర్థిక చింతలను తగ్గుతాయి. మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
Vrushabha Rasi 4/7

వృషభ రాశి

వృషభ రాశి.. రాబోయే కాలం వృషభ రాశి వారికి వృత్తి, పని పరంగా అద్భుతంగా ఉండవచ్చు. పనిలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కొత్త అవకాశాలు లభించవచ్చు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. పనిలో మీ కష్టానికి, ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీకు కొత్త బాధ్యతలు లభిస్తాయి. వాటిని మీరు సమర్థవంతంగా నెరవేర్చగలరు. రాబోయే రోజుల్లో మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలుంటాయి. విజయానికి కొత్త మార్గాలు తెరుచుకోవచ్చు.
Kumbha Rasi 5/7

కుంభ రాశి

కుంభ రాశి.. కుంభ రాశి వారికి, రాబోయే 100 రోజుల్లో ఉపశమనంతో పాటు సానుకూల మార్పులుండనున్నాయి. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను విస్తరించడానికి కొత్త అవకాశాలను కనుగొంటారు. ఆర్థిక విషయాలలో మెరుగుదలకు కూడా సంకేతాలు ఉన్నాయి. కుంభరాశిలో ఏల్నాటి చివరి దశ కొనసాగుతోంది, కాబట్టి సహనం, అవగాహన ప్రయోజనకరంగా ఉంటాయి. కష్టపడి పనిచేయాలి. భవిష్యత్తులో మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను అందుకుంటారు.
Mithuna Rasi 6/7

మిథున రాశి

మిథున రాశి.. రాబోయే 100 రోజులు మిథున రాశి వారికి ఉపశమనంతో పాటు మీ జీవితంలో కొత్త ఆనందాన్ని తీసుకురాబోతుంది. వ్యక్తిగత జీవితంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. పూర్తికాని అనేక పనులు పూర్తి కావచ్చు. ఉద్యోగస్తులకు వృత్తిలో ఉన్నతికి కొత్త అవకాశాలు లభించవచ్చు. పనిలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ కాలంలో మీకు కొన్ని శుభవార్తలు వింటారు. ఆర్థికంగా లాభాలను అందుకుంటారు. పెట్టుబడి నిర్ణయాలను తెలివిగా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
Disclaimer 7/7

గమనిక

Disclaimer (గమనిక):ఈ వ్యాసంలోని సమాచారం పూర్తిగా నిజం లేదా ఖచ్చితమైనదని జీ మీడియా న్యూస్ చెప్పడం లేదు. ఇవి ఆయా గ్రహాల సంచారంతో పాటు ఆయా వ్యక్తుల వ్యక్తిగత జాతకం ఆధారంగా ఇది మారుతు ఉంటుంది. ఇతర వివరాల కోసం.. జ్యోతిష్య పండితులు తంజావూర్ నాగరాజ శర్మ, ఈ మెయిల్‌ ID: tanarsharma@gmail.com, ఫోన్: 9395354502 సంప్రదించండి.
TAGS:
Spirituality
Daily Horoscope
Telugu Astrology
Astrological Remedies

Trending

  • News
  • Photos
  • Videos
Amit Shah Speech: హైదరాబాద్‌లో అమిత్‌ షా సంచలన ప్రసంగం

Amit Shah Speech: హైదరాబాద్‌లో అమిత్‌ షా సంచలన ప్రసంగం

2

IND Vs NZ Kohli Record: భారత్ Vs న్యూజిలాండ్ వన్డే సిరీస్‌ రోహిత్-కోహ్లీ రెడీ..వరల్డ్ రికార్డు‌పై కన్నేసిన కింగ్ కోహ్లీ..12 రన్స్ చాలు!

3

YS Jagan: గంజాయి, బెల్టు షాపులే రాప్తాడు ఘటనకు కారణం.. కూటమి పాలనపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

4

బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు.. భవిష్యత్తులో పెరుగుతాయా..? తగ్గుతాయా..?

5

IPL Unsold Players: ఐపీఎల్ 2027 వేలంలో స్టార్ ఆటగాళ్లకు షాక్..ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లకు వేలంలో మొండిచేయి?!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.