• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /IPL Unsold Players: ఐపీఎల్ 2027 వేలంలో స్టార్ ఆటగాళ్లకు షాక్..ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లకు వేలంలో మొండిచేయి?!

IPL Unsold Players: ఐపీఎల్ 2027 వేలంలో స్టార్ ఆటగాళ్లకు షాక్..ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లకు వేలంలో మొండిచేయి?!

IPL Unsold Players 2027: భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2027 మినీ వేలం రాబోయే డిసెంబర్ 16న గోవాలో జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష అనుభవం కలిగిన పలువురు విదేశీ దిగ్గజ ఆటగాళ్లకు ఈసారి ఫ్రాంచైజీల నుంచి నిరాశే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్, ఇంగ్లాండ్ వికెట్ కీపర్ - బ్యాటర్ జానీ బెయిర్‌స్టో, న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్‌లను వేలంలో ఎవరూ కొనుగోలు చేసే అవకాశం లేదని సమాచారం.

Written ByHarish Darla
Published: Nov 02, 2026, 04:13 PM IST|Updated: Nov 02, 2026, 04:16 PM IST
joinshare
IPL Unsold Players: ఐపీఎల్ 2027 వేలంలో స్టార్ ఆటగాళ్లకు షాక్..ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లకు వేలంలో మొండిచేయి?!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Manchu Lakshmi: గొప్పమనసు చాటుకున్న మంచు లక్ష్మి.. తెలంగాణలోని 48 ప్రభుత్వ పాఠశాలల దత్తత.!.

Manchu Lakshmi: గొప్పమనసు చాటుకున్న మంచు లక్ష్మి.. తెలంగాణలోని 48 ప్రభుత్వ పాఠశాలల దత్తత.!.

2

Zee Entertainment: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏఐ, ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా తుషార్‌ వొహ్రా నియామకం

3

Rohit Bigg Boss Elimination: బిగ్‌బాస్‌ 10 హౌస్ నుంచి రోహిత్ ఎలిమినేషన్..కారణం ఇదే? ఎంత సంపాదించాడంటే?

4

IPL 2027 Retention List: రూ.14.2 కోట్ల ఆటగాడికి CSK షాక్..! యంగ్ ఆల్‌రౌండర్‌కు గుడ్‌ బై..?

5

Amit Shah Speech: హైదరాబాద్‌లో అమిత్‌ షా సంచలన ప్రసంగం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IPL Unsold Players 2027: రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ కోసం మినీ వేలాన్ని డిసెంబర్ 16న గోవాలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేలంలో విడుదలైన విదేశీ ఆటగాళ్లతో పాటు గతంలో కొనుగోలు కాని ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ప్రపంచస్థాయి ప్రతిభ ఉన్నప్పటికీ, కొందరు అంతర్జాతీయ స్టార్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు తీవ్రంగా ఆలోచిస్తున్నాయి.

1) మైకేల్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్): 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ప్రభావం
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ ఆఫ్ స్పిన్ బౌలింగ్, బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థుడు. 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడిన బ్రేస్‌వెల్, తర్వాతి సీజన్లలో అమ్ముడుపోలేదు. 

ఐపీఎల్‌లో ప్రవేశపెట్టిన 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధన వల్ల జట్లు ఆల్‌రౌండర్ల కంటే స్పెషలిస్ట్ బ్యాటర్లు లేదా బౌలర్లకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో బ్రేస్‌వెల్ వంటి ఆల్‌రౌండర్లకు తుది జట్టులో చోటు దక్కక వేలంలోనూ డిమాండ్ తగ్గింది.

2) జానీ బెయిర్‌స్టో (ఇంగ్లాండ్): టాప్ ఆర్టర్ ప్లేసులు ఫుల్
ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఆడగా, ఎస్‌ఆర్‌హెచ్ అతడిని విడుదల చేసిన అనంతరం ఇతర జట్లు ఆసక్తి చూపలేదు. గత వేలంలో రూ. 1 కోటి బేస్ ప్రైస్ ఉన్నప్పటికీ అతడు అన్‌సోల్డ్‌గా మిగిలాడు. 

ఫ్రాంచైజీలలో ఇప్పటికే నాణ్యమైన వికెట్ కీపర్లు ఉండటం, బెయిర్‌స్టోకు అనుకూలమైన ఓపెనింగ్ లేదా టాప్ ఆర్డర్ స్థానాలు ఖాళీగా లేకపోవడమే ఐపీఎల్ 2027 వేలంలోనూ అతనికి ప్రతికూలంగా మారింది.

3) డారిల్ మిచెల్ (న్యూజిలాండ్): అటాకింగ్ లేకపోవడం..
న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడినప్పటికీ, 2025 మెగా వేలంలోనూ, 2026 మినీ వేలంలోనూ అమ్ముడుపోలేదు. ప్రస్తుతం ఫ్రాంచైజీలు ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తీవ్రమైన దూకుడుతో (Aggressive Approach) ఆడే ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. మిచెల్ శైలి ఈ వేగవంతమైన వ్యూహాలకు పూర్తిగా సరిపోకపోవడంతో 2027 వేలంలోనూ అతడిని ఏ జట్టూ దక్కించుకోకపోవచ్చని విశ్లేషిస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఈ ముగ్గురు సత్తా చాటిన ఆటగాళ్లయినప్పటికీ, టీ20 లీగ్‌లో మారుతున్న వ్యూహాలు, ఫ్రాంచైజీల ప్రత్యేక అవసరాల కారణంగా ఐపీఎల్ 2027 వేలంలో ఈ ముగ్గురు దిగ్గజాలకు మొండిచేయి ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
IPL
Cricket
Sports News
Telugu News