• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల ప్రయాణికులకు పండగే.. 30 సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్, ఏయే రూట్లలో అంటే?

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల ప్రయాణికులకు పండగే.. 30 సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్, ఏయే రూట్లలో అంటే?

Written ByRenuka Godugu
Published: Nov 25, 2026, 09:20 IST|Updated: Nov 25, 2026, 09:24 IST
joinshare

30 special trains for Sankranti: సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటారు. కాబట్టి, సొంతూళ్లకు తప్పకుండా వెళతారు. అందులో ఏపీలో అయితే చాలా వైభవంగా మూడు రోజులపాటు నిర్వహిస్తారు. అయితే, హైదరాబాద్‌ నుంచి ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు వెళ్లే రూట్‌లలో దక్షిణ మధ్య రైల్వే 30 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏ రూట్‌లలో ప్రయాణిస్తాయి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

Sankranti special trains1/5

సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్

సంక్రాంతి పండుగ 2027 సందర్భంగా ప్రయాణీకులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు దక్షిణ మధ్య రైల్వే 30 ప్రత్యేక రైళ్ల‌ను ప్రకటించింది.ఇది ఏపీలోని పార్వతీపురం, నర్సాపూర్‌, శ్రీకాకుళం, హైదరాబాద్‌ గుండా ప్రయాణిస్తాయి.
South Central Railway special trains2/5

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

పండుగ సమయంలో రద్దీ అధికంగా ఉంటుందని ఈ ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఇక సంక్రాంతి పండుగకు దేశంలో ఎక్కడ ఉన్నా సొంతూళ్లకు వెళ్లేవారు చాలా మంది ఉంటారు. ఈ సమయంలో స్కూళ్లకు కూడా భారీగానే సెలవులు కూడా వస్తాయి.
Hyderabad to Srikakulam special trains3/5

హైదరాబాద్ నుండి శ్రీకాకుళం స్పెషల్ ట్రైన్

ప్రత్యేక రైళ్లు.. ట్రైన్‌ నెంబర్‌ 07013/07014 నర్సాపూర్‌ నుంచి చర్లపల్లి.. ఇది నల్గొండ, మిర్యాలగూడ, గుంటూర్‌, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్‌ స్టేషన్‌ గుండా ఆగుతూ వెళ్తుంది. ఇందులో 2 ఏసీ, 3 ఏసీ, స్లీప్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
Charlapalli to Srikakulam4/5

శ్రీకాకుళం నుంచి చర్లపల్లి..

ట్రైన్‌ నెంబర్‌: 07115/07116- శ్రీకాకుళం నుంచి చర్లపల్లి.. ఈ రైలు కూడా నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, చిపురుపల్లి రెండు డైరెక్షన్‌లలో నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయి.
Indian Railways 5/5

భారతీయ రైల్వే

ట్రైన్‌ నెంబర్‌: 07117/07118- నర్సాపూర్‌ నుంచి హైదరాబాద్‌ స్పెషల్స్‌.. ఈ స్పెషల్‌ రైలు సికింద్రాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూర్‌, అకివీడు, భీమవరం టౌన్‌, పాలకొల్లు స్టేషన్‌ రెండు డైరెక్షన్‌లలో నడుస్తుంది. ఈ స్పెషల్‌ రైలు కూడా 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయి.
TAGS:
Indian Railways
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
తెలుగు తేజం అదుర్స్.. 'స్టార్ మిస్ టీన్ ఇండియా 2026' ఫస్ట్ రన్నరప్‌గా హైదరాబాద్ అమ్మాయి!

తెలుగు తేజం అదుర్స్.. 'స్టార్ మిస్ టీన్ ఇండియా 2026' ఫస్ట్ రన్నరప్‌గా హైదరాబాద్ అమ్మాయి!

2

Delhi: ఢిల్లీలో షాకింగ్ ఘటన..కేఫ్‌లో యువతిపై సాముహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్..

3

డిసెంబర్‌లో ఈ 4 రాశులకు తిరుగులేని అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారంలో బంపర్ లాభాలు!

4

రెగ్యులర్ కథలకు నో చెబుతున్న మిడ్ రేంజ్ కథానాయికలు.. ఢిఫరెంట్ స్టోరీలతో ఇమేజ్ మేకోవర్..

5

డిసెంబర్‌లో బుధాదిత్య రాజయోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే.. ఆర్థిక కష్టాలకు చెక్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.