• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /పండుగ రద్దీకి రైల్వే గుడ్‌న్యూస్.. నేటి నుంచే 34 బతుకమ్మ స్పెషల్ ట్రైన్స్.. రూట్, టైమింగ్స్ ఇవే!

పండుగ రద్దీకి రైల్వే గుడ్‌న్యూస్.. నేటి నుంచే 34 బతుకమ్మ స్పెషల్ ట్రైన్స్.. రూట్, టైమింగ్స్ ఇవే!

Written ByRenuka Godugu
Published: Oct 09, 2026, 10:43 AM IST|Updated: Oct 09, 2026, 10:49 AM IST
joinshare

పండుగ రద్దీవేళ ఇప్పటికే పలు రైళ్లను ప్రకటించింది భారతీయ రైల్వే. ప్రధానంగా దక్షిణ భారత దేశం నుంచి కూడా ఉత్తరాదికి దసరా, దీపావళి, ఛత్‌పూజ సందర్భంగా ప్రత్యేక రైళ్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా బతుకమ్మ సందర్భంగా కూడా 34 ప్రత్యేక రైళ్లను సికింద్రాబాద్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌- హైదరాబాద్‌కు ఈరోజు నుంచి అక్టోబర్‌ 25వ తేదీ వరకు బతుకమ్మ డైలీ స్పెషల్‌ రైళ్లను ప్రకటించింది. ఇది ఏ రూట్‌లలో వెళ్తాయి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

Bathukamma Trains1/5

బతుకమ్మ రైళ్లు

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మను అత్యంత విశేషంగా జరుపుకొంటారు. ఈ నేపథ్యంలో ఆడబిడ్డలంతా సొంతూళ్లకు కూడా వెళ్తుంటారు. అయితే, భారతీయ రైల్వే బంపర్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. పండుగ రద్దీ నేపథ్యలో ప్రతిరోజూ బతుకమ్మ స్పెషల్‌ ట్రైన్‌లను ప్రకటించింది.
34 Daily Bathukamma Special Trains2/5

34 బతుకమ్మ డైలీ రైళ్లు

ప్రతిరోజు అక్టోబర్‌ 9వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మొత్తం 34 బతుకమ్మ డైలీ రైళ్లు నడవనున్నాయి. ఇవి సికింద్రాబాద్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ నుంచి హైదరాబాద్‌కు నడుస్తాయి. ప్రధానంగా బతుకమ్మ, నవరాత్రి, దసరా పండుగల నేపథ్యంలో సౌత్‌ సెంట్రల్‌ ఈ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
Secunderabad to Sirpur Kaghaznagar3/5

సికింద్రాబాద్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌

ట్రైన్‌ నెంబర్‌ 07711 సికింద్రాబాద్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ ఉదయం 12.10 గంటలకు బయలుదేరుతుంది. ఇది అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు చేరుకుంటుంది మొత్తం 17 సర్వీసులను అందిస్తుంది.
Sirpur Kaghaznagar to hyderabad4/5

కాగజ్‌నగర్ నుంచి హైదరాబాద్

ఇక ట్రైన్‌ నెంబర్‌ 07712 సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌కు సాయంత్రం 6 గంటలకు బయలు దేరుతుంది. ఈ రైలు అదే రోజు రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. ఇది కూడా 17 సర్వీసులను అందిస్తుంది. ఈ రెండు రూట్‌లలో అక్టోబర్‌ 25వ తేదీ వరకు 34 సర్వీసులు.
Bathukamma Special Trains5/5

బతుకమ్మ స్పెషల్‌ రైలు

ఈ బతుకమ్మ స్పెషల్‌ రైలు చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, అసిఫాబాద్‌ రోడ్డు రెండు డైరెక్షన్‌లలో రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలులో ఏసీ చైర్‌ కార్‌, సెకండ్‌ సిట్టింగ్‌ క్లాస్‌ కోచ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.
TAGS:
Indian Railways
Telangana News
Festivals

Trending

  • News
  • Photos
  • Videos
సూర్యుడి అనుగ్రహంతో 4 రాశులకు బంపర్ లాభాలు.. అక్టోబర్ 11 నుంచి కీలక మార్పులు!

సూర్యుడి అనుగ్రహంతో 4 రాశులకు బంపర్ లాభాలు.. అక్టోబర్ 11 నుంచి కీలక మార్పులు!

2

టీచర్లకు బిగ్ షాక్..FRS హాజరు వేయకపోతే జీతం కట్.. ఒక్కరోజే 68 మందికి నోటీసులు..!!

3

Sarva pitru Amavasya 2026: మహాలయ అమావాస్య.. రేపు ఈ ఒక్కపనిచేస్తే పితృశాపాలు పోయి గొప్ప శుభయోగాలు.!.

4

వీపుపై బిడ్డ, చేతిలో పని.. ఈ వర్కింగ్ మదర్ స్టోరీ చూస్తే కన్నీళ్లు ఆగవు.. వీడియో వైరల్!

5

Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కూతుర్ని విసిరేసిన తల్లి.. ప్రాణాలకు తెగించి హీరోలా కాపాడిన ఆటోడ్రైవర్.!. అసలు విషయం ఇదే.!.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.