• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /సీనియర్ ఎన్టీఆర్, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్‌లో ఎన్ని చిత్రాలు వచ్చాయో తెలుసా..!

సీనియర్ ఎన్టీఆర్, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్‌లో ఎన్ని చిత్రాలు వచ్చాయో తెలుసా..!

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 26, 2026, 05:13 AM IST|Updated: Oct 26, 2026, 05:14 AM IST
joinshare

NTR Sridevi Tollywood Blockbluster Combination: ఎన్టీఆర్, శ్రీదేవి టాలీవుడ్‌లో సక్సెస్‌పుల్ కాంబినేషన్ అని చెప్పాలి.  వీళ్లిద్దరు తొలుతా తాత మనరాళ్లుగా నటించినా అవేమి పట్టించుకోకుండా సిల్వర్ స్క్రీన్ పై వీరి జోడికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మొత్తంగా ఎన్ని చిత్రాలొచ్చాయి. అందులో బ్లాక్ బస్టర్ ఎన్ని ఉన్నాయనే విషయానికొస్తే.. 

Vetagadu 1/7

వేటగాడు

వేటగాడు: ఎన్టీఆర్, శ్రీదేవి తొలిసారి ‘బడి పంతులు’ సినిమాలో నటించారు. అందులో వీళ్లిద్దరు తాత మనవరాళ్లుగా నటించారు. తొలిసారి కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేటగాడు’ చిత్రంలో కలిసి నటించారు. 1979లో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిది. ఈ సినిమా తర్వాత కథానాయికగా శ్రీదేవి వెనుదిరిగి చూసుకోలేదు.
Aatagaadu 2/7

ఆటగాడు

ఆటగాడు: ఇది 1980లో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. తాతినేని రామారావు దర్శకత్వం వహించగా, జి. రాజేంద్ర ప్రసాద్ నిర్మించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు.
Rowdy Ramudu Konte Krishnudu 3/7

రౌడీ రాముడు కొంటె కృష్ణుడు

రౌడీ రాముడు కొంటె కృష్ణుడు: ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం 1980లో విడుదలైంది. తెలుగు యాక్షన్ చిత్రాన్ని రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌పై ఎన్టీఆర్ నిర్మించారు. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ మరో హీరోగా నటించారు. ఈ చిత్రం ఓ మోస్తరుగా విజయం సాధించింది.
Sardar 4/7

సర్దార్ పాపారాయుడు

సర్దార్ పాపారాయుడు: ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్‌లో తెరకెక్కిన నాల్గో చిత్రం ‘సర్ధార్ పాపారాయుడు’. ఈ చిత్రం తెలుగు చారిత్రక కల్పిత చిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. 1980లో విడుదలైంది. దీనిని క్రాంతి కుమార్ నిర్మించారు. ఈ చిత్రం నుంచే తండ్రి కొడుకుల ద్విపాత్రాభినయం అనే హీరోయిజం అనే ట్రెండ్ మొదలైంది.
Gaja Donga 5/7

గజ దొంగ

గజ దొంగ: కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1981లో విడుదలైంది. యాక్షన్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ీ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో జయసుధ మరో కథానాయికగా నటించింది.
Satyam shivam 6/7

సత్యం శివం

సత్యం శివం: ఈ 1981 చిత్రం K రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘సత్యం శివం’. ఈ సినిమా హిందీలో అమితాబ్, శశికపూర్ కలయికలో వచ్చిన ‘సుహాగ్’ చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో మరో హీరోగా అక్కినేని నాగేశ్వరరావు నటించారు. ఈ మహా నటులు కలయికలో తెరకెక్కిన చివరి చిత్రం ఇదే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు శ్రీదేవి జోడిగా నటించారు. అక్కినేని నాగేశ్వరరావు జోడిగా రతీ అగ్నిహోత్రి నటించారు. ఈశ్వరి క్రియేషన్స్‌ పతాకంపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్మించారు.
bobbili puli 7/7

బొబ్బిలి పులి

ఇక ఎన్టీఆర్, శ్రీదేవి కలయికలో ‘అగ్గిరవ్వ’ సినిమా వచ్చింది. కొండవీటి సింహం, అనురాగ దేవత, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి, వయ్యారి భామలు వగలమారి భర్తలు సినిమాలొచ్చాయి. ఇందులో అగ్గిరవ్వ సినిమా మాత్రమే ఫ్లాప్ అయింది. ఇక కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి సినిమాలు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. మొత్తంగా వీళ్లిద్దరు జోడిగా 12 చిత్రాలొచ్చాయి. అందులో ఆరు చిత్రాలు కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చాయి. మూడు చిత్రాలు తాతినేని రామారావు, రెండు చిత్రాలు దాసరి నారాయణ రావు, ఒక చిత్రం కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించడం విశేషం.
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
School Holiday Tomorrow: రేపు సోమవారం స్కూళ్లకు సెలవు..తెలంగాణలో ఈ స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశాలు!

School Holiday Tomorrow: రేపు సోమవారం స్కూళ్లకు సెలవు..తెలంగాణలో ఈ స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశాలు!

2

Nominations: ఏపీలో 'పరిషత్‌' ఎన్నికలకు భారీగా నామినేషన్లు.. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య హోరాహోరీ

3

అక్టోబర్ 30న రైతు ఖాతాల్లో రూ.2000 జమ.. డబ్బులు పడాలంటే ఈ పనులు వెంటనే చేయండి!

4

Anand Mahindra On Vizag Beach: "వైజాగ్‌లో ఇంతటి అందమైన బీచ్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదు?" ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!

5

Chandrababu: అర్నాబ్ తుఫానుపై సీఎం చంద్రబాబు అప్రమత్తం.. అధికారులకు కీలక ఆదేశాలు

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.