Sreeleela: శ్రీలీల.. ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూకుడు చూపించింది. తక్కువ సమయంలో ఎక్కువ మంది స్టార్ హీరోల సరసన నటించినా .. సరైన హిట్స్ లేక రేసులో వెనకబడింది. అయితే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో అచ్చ తెలుగు అమ్మాయి ఈ రేంజ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ఈమెనే అని చెప్పాలి. అంతేకాదు కథానాయికగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం శ్రీలీల స్పెషాలిటీ. ఇన్నేళ్ల కెరీర్‌లో విజయాలు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అయితే ఈ విషయంలో తను చేసిన తప్పు ఏంటో ఒప్పుకుంది.
1/5
Sreeleela Number one
Sreeleela Number one: శ్రీలీల తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లెట్ వేగంతో వచ్చి రాకెట్‌లా దూసుకెళ్లింది. తెలుగులో తొలి చిత్రం ‘పెళ్లి సందడి’, ఆ తర్వాత ధమాకా, భగవంత్ కేసరి మినహా ఈమె కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్స్ అనేవే లేవు. పుష్ప2లో దెబ్బలు పడతయిరో పాటతో పాపులర్ అయింది. ఈ పాట శ్రీలీలకు బాగానే ఉపయోగింది. ఇన్నేళ్ల కెరీర్ శ్రీలీల తరచి చూసుకుంటే కెరీర్‌లో ఎక్కడ తప్పు జరిగిందో స్వయంగా అంగీకరిస్తోంది ఈ బ్యూటీ. ఇకపై వచ్చిన ప్రతి సినిమాను అంగీకరించాను. అందులో కథ ఎలాంటి ఆలోచించకుండా తనకు ఆఫర్స్ రావడమే ఎక్కువ అనుకొని వచ్చిన సినిమానల్లా అంగీకరించినట్టు చెప్పుకొచ్చింది.
2/5
Sreeleela New
శ్రీలీలకు ప్రస్తుతం తత్త్వం బోధపడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తనకు నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటానంటోంది శ్రీలీ. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీలీల.. రీసెంట్‌గా ధనుష్, మమ్ముట్టి హీరోలుగా నటించిన 'ఓం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్న శ్రీలీల.. చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చానని, అప్పట్లో సినిమాల కథలను ఎంచుకునే స్థాయిలో తాను లేనని చెప్పుకొచ్చారు.వచ్చిన అవకాశాలను అంగీకరిస్తూ ముందుకు వెళ్లానని, అయితే కొంతకాలం తర్వాత తన కెరీర్‌ను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఎక్కడ తప్పులు జరిగాయో అర్థమైందని నిజాయితీగా ఒప్పుకున్నారు.
3/5
No Victory After Success
ఈమె తెలుగులో బిగ్గెస్ట్ స్టార్స్ అయిన మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’, పవన్ కళ్యాణ్‌లతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు మాత్రమే చేసింది. ఇకపై తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తానే తీసుకుంటానని, కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తానని స్పష్టం చేశారు.ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. శ్రీలీల కెరీర్‌లో కొత్త ఆలోచనలకు కారణమైన సినిమానే 'ఓం'.దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ కథను చెప్పినప్పుడు మొదటగా ఇందులో పాటలు ఉండవని చెప్పారట. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో పాటలు, డ్యాన్స్‌లకు ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఇందులో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించే అవకాశం రావడంతో శ్రీలీల ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం.
4/5
om
ఈ సినిమాలో ఆమెకు కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించే అవకాశం దక్కిందని తెలిపారు.అంతేకాదు, తనకు సరైన సమయంలో ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఇక శ్రీలీల కెరీర్‌లో మరో ప్రత్యేకత ఆమె డాక్టర్ చదవు. ముంబైలో రెండేళ్ల ఇంటర్న్‌షిప్ సమయంలో వైద్య విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో సినిమాలకు సమయం కేటాయించలేకపోయానని చెప్పుకొచ్చింది.
5/5
Continue Chances
ఇప్పుడు ఆమె తమిళంలో ధనుష్‌తో 'ఓం', అజిత్‌తో మరో ప్రాజెక్ట్‌తో పాటు రజనీకాంత్ నటిస్తున్న 'ధర్మన్' సినిమాలో నటిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే శ్రీలీల తన కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.ఇక 'ఓం' సినిమా నవంబర్ 20న (రేపు) విడుదల కానుంది. ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో ఉన్నారు.మరి శ్రీలీల తీసుకున్న ఈ కొత్త నిర్ణయాలు ఆమె కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడతాయి? 'ఓం' సినిమాతో ఆమె కోరుకున్న గుర్తింపు లభిస్తుందా లేదా అనేది చూడాలి మరి.