• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Tanushree Dutta: ఈవిల్ చనిపోయింది.. నానా పటేకర్ మరణంపై తనుశ్రీ దత్తా మాటలు కలకలం..!

Tanushree Dutta: ఈవిల్ చనిపోయింది.. నానా పటేకర్ మరణంపై తనుశ్రీ దత్తా మాటలు కలకలం..!

Written ByVishnu Priya
Published: Oct 08, 2026, 07:26 PM IST|Updated: Oct 08, 2026, 07:36 PM IST
joinshare

Tanushree Dutta: ప్రముఖ నటుడు నానా పటేకర్ మరణంతో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. 75 ఏళ్ల నానా పటేకర్ అక్టోబర్ 8న గోవాలోని తన నివాసంలో అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయన మరణించినట్లు ప్రకటించారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించినట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు అతని గురించి బాలకృష్ణ సినిమా వీరభద్ర తో ఫేమస్ అయిన తను శ్రీ దత్త చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
 

 Nana Patekar latest news1/5

నానా పటేకర్ తాజా వార్తలు

నానా పటేకర్ మృతికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే నటి తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనుశ్రీ దత్తా మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించారు. 2004లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. 2005లో వచ్చిన ‘ఆషిక్ బనాయా ఆప్నే’ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో బాలకృష్ణతో కలిసి ‘వీరభద్ర’ సినిమాలో కూడా నటించారు.
Nana Patekar death reaction2/5

నానా పటేకర్ మరణంపై స్పందన

అయితే కొంతకాలం తర్వాత తనుశ్రీ సినిమాలకు దూరమయ్యారు. అనంతరం ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు బాలీవుడ్‌లో పెద్ద చర్చకు కారణమయ్యాయి. ముఖ్యంగా 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించారు. నానా పటేకర్ ఈ ఆరోపణలను ఖండించారు. ఈ వివాదం తర్వాత తనుశ్రీ పేరు మీటూ ఉద్యమంతో బాగా వినిపించింది.
Tanushree Dutta Nana Patekar3/5

తనుశ్రీ దత్తా నానా పటేకర్

నానాపటేకర్ తన పరిస్ధితిని అసలు అర్ధం చేసుకోకుండా అసభ్యకరమైన డ్యాన్స్ మూవ్‌మెంట్స్ చేయాలని ఒత్తిడి చేశారని అప్పట్లో వ్యాఖ్యానించింది తనుశ్రీ దత్తా. నానాతో పాటు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపైనా ఇదే రకమైన ఆరోపణలు చేసింది. ఆమె ఈ విషయాలు మీ టు ఉద్యమంలో చెప్పిన తర్వాత.. పలువురు హీరోయిన్లు, మహిళా నటులు తమకు జరిగిన అన్యాయాలను బయటపెట్టారు. తనుశ్రీ దత్తా ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
 Nana Patekar controversy4/5

నానా పటేకర్ వివాదం

ఇప్పుడు నానా పటేకర్ మరణం తర్వాత తనుశ్రీ ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. నానా మరణ వార్త తనకు తెలిసిందని, దీనిపై వెంటనే ఎలా స్పందించాలో తనకు అర్థం కావడం లేదని ఆమె చెప్పారు. తాను లక్నోలో ఒక ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్లాల్సి ఉందని, ప్రస్తుతం తన దృష్టి ఆ కార్యక్రమంపైనే ఉందని ఆమె తెలిపారు. తాను ముందుగా లైవ్ సెషన్లు నిర్వహించాలని, కంటెంట్ పోస్ట్ చేయాలని అనుకున్నానని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని అన్నారు.
 Tanushree Dutta controversy5/5

తనుశ్రీ దత్తా వివాదం

తనుశ్రీ మాట్లాడుతూ, సాయంత్రం సమయానికి మీడియా దృష్టి మొత్తం ‘ఈవిల్ డెడ్’పైనే ఉంటుందని వ్యాఖ్యానించారు. అనంతరం నానా కుటుంబానికి సానుభూతి తెలియజేయాలని అనుకుంటున్నానని చెప్పి వీడియోను ముగించారు. ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. నానా పటేకర్ మరణం భారతీయ సినిమాకు తీరని లోటుగా పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఆయన ఐదు దశాబ్దాలకు పైగా సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
TAGS:
Bollywood

Trending

  • News
  • Photos
  • Videos
చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డ్ ఏమవుతుంది? UIDAI ట్విట్టర్‌ వేదికగా కీలక ప్రకటన.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!

చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డ్ ఏమవుతుంది? UIDAI ట్విట్టర్‌ వేదికగా కీలక ప్రకటన.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!

2

Vijay Deverakonda: నన్ను తొక్కేయడం కోసం 1000 అకౌంట్లు.. విజయ్ దేవరకొండ బయటపెట్టిన భయంకర నిజం..!

3

Ranabaali: పుట్టపర్తి దగ్గర నరుకుతా.. విజయ్ దేవరకొండ రణబాలిలో ఆ ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నారా..!

4

Instagram మ్యూజ్ ఫీచర్‌తో బోలెడు లాభాలు.. అవేంటో మీరు కూడా తెలుసుకోండి!

5

Vijayasai Reddy: టీటీడీలో రాజకీయ నాయకులకు స్థానం లేకుండా చేస్తా: విజయసాయి రెడ్డి

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.