Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'రణబలి’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
తనపై వస్తున్న విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి విజయ్ దేవరకొండ ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది. “మీ మీద ఎందుకు అంత HATE?” అనే ప్రశ్నకు తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చిన విజయ్.. తనపై కావాలనే నెగెటివిటీని క్రియేట్ చేస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
“ఎవరో ఆర్గనైజ్డ్‌గా ఒక 50 మంది గ్రూప్‌ని పెట్టి ట్రోల్ చేయిస్తున్నారు. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బలుపు అంటే నేను తగ్గాలా? నా జర్నీ వాళ్లకి అరగకపోతే నేను ఇంట్లో కూర్చోవాలా? 1000 అకౌంట్లు క్రియేట్ చేసి మరి నెగటివ్ క్రియేట్ చేస్తున్నారు” అంటూ విజయ్ ప్రశ్నించినట్లు సమాచారం. తనపై ఎలాంటి విమర్శలు వచ్చినా వాటికి భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
#VijayDeverakonda on Trolls: "నా కలలు, నా శ్రమ వాడికి అనవసరం అనిపిస్తే నేనాగాలా? నా honesty వాడికి arrogance లా అనిపిస్తే నేను నటించాలా? నా self-confidence వాళ్లకి balupu లా అనిపిస్తే నేను తగ్గాలా? నా journey వాళ్లకి అర్థం కాకపోతే నేను ఇంట్లో కూర్చోవాలా? నేను మారను. వాళ్లు మారాలి."
— Movies4u Official (@Movies4u_Officl) October 8, 2026
“నేను మారను.. వాళ్లే మారాలి” అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వాటిని దాటుకుంటూ ముందుకు సాగుతున్నానని ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ఇక ‘రణబలి’ విషయానికి వస్తే.. 19వ శతాబ్దపు బ్రిటిష్ పాలన, అప్పటి కరువు, అణచివేత నేపథ్యంలో కథ సాగుతుంది. విజయ్ ఇందులో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే వీరుడి పాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తుండగా, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్‌గా కనిపించనున్నారు.
అక్టోబర్ 16న ‘రణబలి’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విజయ్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
Read More:‘బా బా బ్లాక్ షీప్’ మూవీపై మేఘాలయ సీఎం ప్రశంసలు.. సినిమాలో అంతగా ఏముందంటే..?
Read More: ఇదేం అరాచకం సామి.. ప్రేక్షకులపై పగపట్టిన కమల్, శంకర్‌లు ..! ‘భారతీయుడు 3’తో సాధించేదేమిటి..?