Tata Curvv Affordable Emi: టాటా కర్వ్ (Tata Curvv) కారు అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే, మీరు కూడా ఈ కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా EMI పద్దతిలో.. అయితే, దీనికి డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలో? EMI మొత్తం వివరాలు ఇప్పుడు మనం తెలుసకుందాం.
Tata Curvv Affordable Emi: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా కంపెనీ సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తూ.. అద్బుతమైన మోడల్స్‌లో కార్లను విడుదల చేస్తూ వస్తోంది. ఇటీవల మార్కెట్‌లోకి విడుదల కూపే స్టైలింగ్ డిజైన్ టాటా కర్వ్ కారుకు అద్భుతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఈ కారు ఉద్యోగులు అధికంగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది..
1/5
బ్యాంక్ లోన్
అయితే, ఈ బ్యాంక్ లోన్ అమౌంట్‌కి దాదాపు వడ్డీ రేటు 9.00 శాతం అనుకున్న.. 4 సంవత్సరాల పాటు EMI చూస్ చేసుకుంటే.. ప్రతి నెలా చెల్లించాల్సిన ఈఎంఐ (EMI) రూ. 15,746 అవుతుంది.. వడ్డీ కలిపి మొత్తం రూ. 7,55,808 అవుతుంది. అంటే రూ. 6.32 లక్షల రుణ మొత్తానికి 4 ఏళ్ల పాటు వడ్డీ రూ.1,23,063 మాత్రమే అవుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్, IT ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి ఈ ఫైనాన్స్ ఫ్లానింగ్ చాలా బెస్ట్..
2/5
EMI ఆప్షన్
EMI ఆప్షన్‌తో ఈ కారును కొనుగోలు చేయాలనుకునేవారికి తప్పకుండా ఈ ఫైనాన్స్ ఫ్లానింగ్ కలిసి వస్తుంది. అయితే, ఈ కారుపై రూ. 5,60,000 డౌన్‌పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. డౌన్‌పేమెంట్ పోను, మిగిలిన రూ. 6,32,745 మొత్తం బ్యాంక్ ద్వారా లోన్ పొందవచ్చు..
3/5
టాటా కర్వ్
ఇక టాటా కర్వ్ Smart X (Petrol) కారు వేరియంట్ హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర రూ. 11,92,745తో లభిస్తోంది. ఇందులో ఎక్స్‌షోరూమ్ ధరతో పాటు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్, అన్ని ఛార్జీలు కలిసి ఉంటాయి. అయితే, ఈ కారు EMI ఆప్షన్ ద్వారా కొనుగోలు చేయాలనుకునేవారికి అద్భుతమైన ఫైనాన్స్ ఫ్లానింగ్ తెలుసుకుందాం..
4/5
టాటా మోటార్స్
టాటా మోటార్స్ (Tata Motors) ఈ మోడల్‌పై పండుగల సీజన్ సందర్భంగా ప్రత్యేక దీపావళి ఆఫర్లు అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. అయితే, కొన్ని డీలర్ షిప్స్‌లో మాత్రమే లభిస్తున్నట్లు సమాచారం.. ఇక ఈ కారు మోడల్‌లో స్మార్ట్ X పెట్రోల్ వేరియంట్‌ను అత్యంత తక్కువ ధరలో లభించడంతో.. దీనినే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
5/5
స్టార్ రేటింగ్
టాటా కర్వ్ (Tata Curvv) కారు ఇప్పుడు మార్కెట్‌లో వివిధ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఇది మార్కెట్‌లో రూ. 10 లక్షల నుంచి లభిస్తోంది. అలాగే కస్టమర్లు దీనిని దాదాపు 4.7 స్టార్ రేటింగ్‌ను కూడా అందించారు. సెఫ్టీ పరంగా కూడా చాలా బాగుంది...