• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /మోడల్ స్కూల్స్ ఐకాస పోరుబాట.. నేటి నుంచి దశలవారీగా నిరసనలు.. నవంబర్ 17న హైదరాబాద్‎లో ధర్నా..!!

మోడల్ స్కూల్స్ ఐకాస పోరుబాట.. నేటి నుంచి దశలవారీగా నిరసనలు.. నవంబర్ 17న హైదరాబాద్‎లో ధర్నా..!!

Telangana Model Schools: మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులు.. వొకేషనల్ ట్రైనర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. మోడల్ స్కూళ్ల ఐక్య కార్యాచరణ సమితి (MS-JAC) ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఐకాస స్టీరింగ్‌ కమిటీ గురువారం ప్రకటించింది

Written ByBhoomi
Published: Oct 30, 2026, 01:59 PM IST|Updated: Oct 30, 2026, 02:01 PM IST
joinshare
మోడల్ స్కూల్స్ ఐకాస పోరుబాట.. నేటి నుంచి దశలవారీగా నిరసనలు.. నవంబర్ 17న హైదరాబాద్‎లో ధర్నా..!!
Image Credit: Telangana Model Schools:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Uttarakhand Chopper Crash:  ఉత్తరాఖండ్‌లో కుప్పకూలీన హెలికాప్టర్.. ఆరుగురి ఆచూకీ గల్లంతు.. వీడియో వైరల్..

Uttarakhand Chopper Crash: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలీన హెలికాప్టర్.. ఆరుగురి ఆచూకీ గల్లంతు.. వీడియో వైరల్..

2

పోలీస్ యూనిఫాంలో పెంపుడు కుక్క.. వైరలవుతున్న వీడియో..

3

Rangareddy: మరీ ఇలా ఉన్నారెంట్రా.. సెల్ ఫోన్‌కు బానిసైన కూతురు.. తల్లిచేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంక్.!.

4

YS Avinash Reddy: పులివెందులలో అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ భారీ కుట్ర?

5

మోడల్ స్కూల్స్ ఐకాస పోరుబాట.. నేటి నుంచి దశలవారీగా నిరసనలు.. నవంబర్ 17న హైదరాబాద్‎లో ధర్నా..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Model Schools: మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులు.. వొకేషనల్ ట్రైనర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. మోడల్ స్కూళ్ల ఐక్య కార్యాచరణ సమితి (MS-JAC) ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఐకాస స్టీరింగ్‌ కమిటీ గురువారం ప్రకటించింది. ఉపాధ్యాయుల సమస్యలపై ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేతలు స్పష్టం చేశారు.

ఈ నిరసన కార్యాచరణలో భాగంగా.. అక్టోబర్ 30, 31 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మోడల్‌ స్కూళ్లలో ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు. అలాగే నవంబరు 2, 3 తేదీల్లో మండల స్థాయి అధికారులకు, 4, 5, 6 తేదీల్లో జిల్లాస్థాయి అధికారులకు, నవంబరు 10 నుండి 12 వరకు స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలు అందజేయనున్నారు. ఈ నిరసనల పరాకాష్టగా నవంబరు 17న హైదరాబాద్‌లో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.

మరోవైపు..  రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలలో వొకేషనల్ ట్రైనర్లుగా విధులు నిర్మిస్తున్న సుమారు 1,400 మందికి గత 8 నెలలుగా వేతనాలు రాకపోవడం పట్ల తెలంగాణ వృత్తి విద్యా బోధకుల సంఘం (TBTA) గౌరవాధ్యక్షుడు శివకుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 1,900 మంది వొకేషనల్ ట్రైనర్లు పనిచేస్తుండగా.. 10 కాంట్రాక్టు ఏజెన్సీల పరిధిలో జీతాలు పూర్తిగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. గతంలో ఒకటిరెండు నెలలు ఆలస్యమైనప్పటికీ ఇప్పుడు ఏకంగా 8 నెలలుగా జీతాలు రాకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి మరో వారం రోజుల్లోగా వేతనాలు విడుదల చేయకపోతే, నేరుగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడితో పాటు భారీ ధర్నా నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.

నిరసన కార్యక్రమాల పూర్తి షెడ్యూల్: 
 
అక్టోబర్ 29, 2026 – అధికారులకు ముందస్తు నోటీస్:
MS-JAC ఆధ్వర్యంలో నిర్వహించబోయే నిరసన కార్యాచరణకు సంబంధించిన సమగ్ర వివరాలను పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులకు అధికారికంగా అందజేయడం జరిగింది.

అక్టోబర్ 30 & 31, 2026 – పాఠశాలల్లో నల్లబ్యాడ్జీల నిరసన:
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మోడల్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తారు. ఈ నిరసనలకు సంబంధించిన సమాచారాన్ని పత్రికా ప్రకటనల ద్వారా మీడియాకు వెల్లడిస్తారు.

నవంబర్ 02 & 03, 2026 – మండల స్థాయిలో వినతిపత్రాలు:
మండలాల వారీగా తహసీల్దార్, ఎంపీడీఓ (MPDO) ఎంఈఓ (MEO)లకు MS-JAC ప్రతినిధులు స్వయంగా కలిసి వినతిపత్రాలు అందజేస్తారు. అలాగే ఈ అంశంపై స్థానిక పత్రికా ప్రకటనలు విడుదల చేస్తారు.

నవంబర్ 04, 05 & 06, 2026 – జిల్లా కలెక్టర్లు, డిఈఓలకు విజ్ఞప్తి:
జిల్లా స్థాయిలో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి (DEO) జిల్లా కలెక్టర్లను కలిసి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి.. పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పిస్తారు.

నవంబర్ 10, 11 & 12, 2026 – ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టడం:
స్థానిక శాసనసభ్యులు (MLA), శాసనమండలి సభ్యులు (MLC)  పార్లమెంట్ సభ్యులు (MP)లను కలిసి సమస్య తీవ్రతను తెలియజేస్తారు. ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను త్వరగా పరిష్కరించేలా చొరవ చూపాలని కోరుతారు.

నవంబర్ 17, 2026: హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి మహా ధర్నా / ముట్టడి:
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తలపెట్టిన భారీ ధర్నా మరియు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతి మోడల్ పాఠశాల నుంచి ఉపాధ్యాయులందరూ భాగస్వాములయ్యేలా విస్తృత సమన్వయం నిర్వహిస్తున్నారు.

Also Read: 

మోదీ దీపావళి గిఫ్ట్ రూ. 8 వేల ఆఫర్ నిజమేనా? వాట్సాప్‌లో ఆ లింక్ వస్తే బీ అలర్ట్..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Employees
Telugu News
Telangana News