• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /YS Avinash Reddy: పులివెందులలో అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ భారీ కుట్ర?

YS Avinash Reddy: పులివెందులలో అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ భారీ కుట్ర?

YS Avinash Reddy Serious Allegations On Chandrababu: కూటమి ప్రభుత్వం అరాచకాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఆరోపించారు. పులివెందులలో పోలీస్‌ వ్యవస్థ టీడీపీకి అనుకూలంగా ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 30, 2026, 02:17 PM IST|Updated: Oct 30, 2026, 02:22 PM IST
joinshare
YS Avinash Reddy: పులివెందులలో అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ భారీ కుట్ర?
Image Credit: Source: YS Avinash Reddy Facebook

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Uttarakhand Chopper Crash:  ఉత్తరాఖండ్‌లో కుప్పకూలీన హెలికాప్టర్.. ఆరుగురి ఆచూకీ గల్లంతు.. వీడియో వైరల్..

Uttarakhand Chopper Crash: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలీన హెలికాప్టర్.. ఆరుగురి ఆచూకీ గల్లంతు.. వీడియో వైరల్..

2

పోలీస్ యూనిఫాంలో పెంపుడు కుక్క.. వైరలవుతున్న వీడియో..

3

Rangareddy: మరీ ఇలా ఉన్నారెంట్రా.. సెల్ ఫోన్‌కు బానిసైన కూతురు.. తల్లిచేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంక్.!.

4

YS Avinash Reddy: పులివెందులలో అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ భారీ కుట్ర?

5

మోడల్ స్కూల్స్ ఐకాస పోరుబాట.. నేటి నుంచి దశలవారీగా నిరసనలు.. నవంబర్ 17న హైదరాబాద్‎లో ధర్నా..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

YS Avinash Reddy Press Meet: స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలు జరుగుతున్నాయి.. పోలీస్‌ వ్యవస్థ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల నామినేషన్‌తోపాటు ప్రచారంలో దాడులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం.. పోలింగ్‌ రోజు కూడా అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ భారీ స్కెచ్‌ వేసిందని కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఆరోపించారు.

కడప జిల్లా పులివెందులలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ అవినాశ్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల్లో అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ భారీ స్కెచ్ వేసింది. ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా సీఎంఓ నుంచే ఆదేశాలు జారీ అవుతున్నాయి. చంద్రబాబు, సీఎంఓ, డీజీపీ కార్యాలయం నుంచి అందుతున్న ఆదేశాలతోనే పులివెందులలో పోలీసు వ్యవస్థ పనిచేస్తోంది. డీఐజీ కోయ ప్రవీణ్ కనుసన్నల్లో టీడీపీకి అనుకూలంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి' అని ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఆరోపించారు.

'పులివెందులలో టీడీపీకి ప్రజాదరణ లేకపోవడంతో జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, రాయచోటి నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలిస్తున్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారితో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియలో బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకున్నారు. నామినేషన్లు వేయడానికి వెళ్లిన మా అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడంతో పాటు 37 రౌండ్ల కాల్పులు, పొగ బాంబులు, లాఠీచార్జికి పాల్పడ్డారు' అని అవినాశ్ రెడ్డి వెల్లడించారు.

'మహిళా అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. నామినేషన్ల సమయంలో జరిగిన అరాచకాలను ప్రజలంతా గమనించారు. ఇప్పుడు అదే తరహాలో పోలింగ్ రోజున కూడా వ్యవహరించాలని చూస్తున్నారు. గతంలో 33 వార్డులు ఏకగ్రీవమయ్యాయని బీటెక్ రవి మాట్లాడుతున్నారు. అప్పట్లో టీడీపీ పోటీ చేయడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుని ఏకగ్రీవాల గురించి మాట్లాడటం విడ్డూరం' అని ఎంపీ అవినాశ్‌ రెడ్డి తెలిపారు.

'ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. నిందితులు పెట్రోల్ పోసి నిప్పంటించిన దృశ్యాలు వీడియో ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇన్ని ఘటనలకు పాల్పడిన నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీడియో ఆధారాలు ఇచ్చినా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. నిందితులను స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు' అని ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఆరోపించారు.

'2025 ఆగస్టులో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏ విధంగా బయట ప్రాంతాల నుంచి వేలాది మందిని తీసుకొచ్చి స్థానిక ఓటర్లను, పోలింగ్ ఏజెంట్లను అడ్డుకున్నారో ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చే టీడీపీ కార్యకర్తలకు పోలీసులే లాడ్జిలు, ఫంక్షన్ హాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ డీఐజీ కోయ ప్రవీణ్ కనుసన్నల్లో, సీఎంఓ రాజకీయ ఆదేశాలతోనే జరుగుతున్నాయి' అని ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ ఆరోపణలు చేశారు.

'పోలింగ్ రోజున పెద్ద ఎత్తున అరాచకాలు, దౌర్జన్యాలకు టీడీపీ ప్రణాళిక సిద్ధం చేసింది. దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించడం, నిజమైన ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి రాకుండా అడ్డుకోవడం వారి వ్యూహం. ఈ అక్రమాలను అడ్డుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. నిజమైన ఓటర్లే ఓటు వేసేలా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు అక్రమంగా ఓట్లు వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరాం' అని వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తెలిపారు.

'ప్రతి పోలింగ్ కేంద్రంలో పూర్తి వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలి. లైవ్ ఫుటేజ్ అందుబాటులో ఉంచాలి. నిజమైన ఓటర్లు మాత్రమే ఓటు వేసేలా, బయట ప్రాంతాల నుంచి వచ్చినవారు అక్రమంగా ఓట్లు వేయకుండా చర్యలు తీసుకోవాలి' అని ఎన్నికల సంఘానికి ఎంపీ అవినాశ్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 'మా కార్యకర్తలపై దాడులు చేసి.. మా వారిపైనే 307 సెక్షన్ కేసులు పెడుతున్నారు. ఇళ్లలో సోదాలు, అరెస్టులు, రిమాండ్లతో వేధిస్తున్నారు. మాపై దాడులు చేసిన వారిపై ఫిర్యాదులు ఇచ్చినా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం లేదు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం' అని ప్రకటించారు.

'వైఎస్సార్, వైఎస్‌ జగన్ కృషితో పులివెందుల ప్రాంతానికి కృష్ణా జలాలు వచ్చాయి. రైతులు అరటి, చీనీ పంటలు పండించుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. చంద్రబాబు, బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి రాజకీయాల కోసం ఈ ప్రాంతంలో మళ్లీ కక్షలు, హింస సృష్టిస్తున్నారు. బీటెక్ రవి ఆధ్వర్యంలో అక్రమ బెరైటీస్ మైనింగ్, ఇసుక అక్రమ తరలింపు జరుగుతోంది. ఇప్పటికే కోట్లాది రూపాయల విలువైన బెరైటీస్ అక్రమంగా తవ్వేశారు. లక్షలాది ట్రిప్పుల ఇసుకను బెంగళూరుకు తరలించారు' అని వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి ఆరోపించారు.

'వైఎస్‌ జగన్ రూ.500 కోట్లతో నిర్మించిన పులివెందుల మెడికల్ కాలేజీకి మంజూరైన 50 ఎంబీబీఎస్ సీట్లను వెనక్కి పంపిన ఘనత ఈ కూట‌మి ప్రభుత్వానిది. పేదలకు వైద్య విద్య, మెరుగైన వైద్యం అందించే అవకాశాన్ని ఎందుకు దెబ్బతీశారు?' అని అనినాశ్‌ రెడ్డి ప్రశ్నించారు. జగనన్న హయాంలో 8 వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చి, ఇళ్ల నిర్మాణం ప్రారంభించామని.. రూ.25 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ నిర్మించినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చి 30 నెలలైనా ఈ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లలేకపోయారని కూటమి ప్రభుత్వ వైఫల్యంపై మండిపడ్డారు.

Add Zee News as a Preferred Source
TAGS:
YCP
Elections
Politics
YS Jagan Mohan Reddy