బీఆర్ఎస్ పార్టీ శాసన సభాపక్ష ఉప నాయకుడు తన్నీరు హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు సంవత్సరీక కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హాజరై నివాళులర్పించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
1/6
KCR Harish Rao

2/6
KCR Tributes To Harish Rao Father
హైదరాబాద్‌లోని కోకాపేటలో హరీశ్ రావు తన తండ్రి సత్యనారాయణ రావు సంవత్సరీకం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. సత్యనారాయణ రావు చిత్రపటానికి నివాళులర్పించారు.
3/6
KCR Harish Rao
సత్యనారాయణ రావు సంవత్సరీకం కార్యక్రమం అనంతరం హరీశ్ రావును, ఆయన కుటుంబసభ్యులను గులాబీ అధినేత కేసీఆర్ పరామర్శించారు. కొద్దిసేపు కుటుంబసభ్యులతో మాట్లాడారు. రెండు గంటల పాటు హరీశ్ రావు నివాసంలో కేసీఆర్ ఉన్నారు.
4/6
KCR Harish Rao Father
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు కూడా హాజరయ్యారు. సత్యనారాయణ రావు చిత్రపటానికి కేటీఆర్ నివాళులర్పించి హరీశ్ రావు కుటుంబసభ్యులను పరామర్శించారు.
5/6
kCR KTR Harish Rao
కోకాపేటలోని హరీశ్ రావు నివాసంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, గులాబీ పార్టీ నాయకులు పాల్గొని హరీశ్ రావు కుటుంబాన్ని పరామర్శించారు.
6/6
KCR Harish Rao KTR Family
ఈ సందర్భంగా హరీశ్ రావు తనయుడితో కేటీఆర్ సరదాగా గడిపారు. కేటీఆర్ తనయుడు హిమాన్షుతోపాటు ఇతర కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు.