• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు ఎప్పటినుంచంటే? ఆ రోజంతా వారికి మాత్రమే చాన్స్‌!

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు ఎప్పటినుంచంటే? ఆ రోజంతా వారికి మాత్రమే చాన్స్‌!

Written ByRenuka Godugu
Published: Nov 06, 2026, 08:46 AM IST|Updated: Nov 06, 2026, 08:50 AM IST
joinshare

తిరుమలలో భక్తుల సంఖ్య కాస్త తగ్గింది.. నిన్న ఒక్కరోజే 65,218 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో 20,213 మంది తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం రూ.3.63 కోట్లు వచ్చింది. అయితే, తిరుమలలో వచ్చే నెల వైకుంఠ ద్వార దర్శనాలు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న టీటీడీ అదనపు ఈఓ సీహెచ్‌ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.
 

TTD1/5

టీటీడీ

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ప్రతి ఏడాది వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఉత్సవాలకు రెడీ అవుతోంది. దాదాపు పది రోజులపాటు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తుంది టీటీడీ.
Tirumala Vaikunta Dwara Darshanam2/5

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు

ఈ నేపథ్యంలో నిన్న తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో సుధర్మ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు.
టీటీడీ వైకుంఠ ఏకాదశి దర్శనం తేదీలు3/5

Tirumala Vaikunta Ekadashi Darshanam

అక్కడ పార్కింగ్‌ సమస్యలు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. చివరి ఏడు రోజులు పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో ఆ సమయంలో తగిన ఏర్పాట్లు చేయాలని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు.
SSD4/5

ఎస్‌ఎస్‌డీ

ఇక తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్‌ 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తారు. తొలి మూడు రోజులుపాటు ఎస్‌ఎస్‌డీ ఆన్‌లైన్‌ ఈ డిప్‌ ద్వారా టోకెన్లు కేటాయించిన వారికి శ్రీవారి దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత ఏడు రోజులు సర్వదర్శనం ఉండనుంది.
Tirumala5/5

తిరుమల

ప్రతి ఏడాది పది రోజులపాటు శ్రీవారి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తోంది. ఈ ఏడాది కూడా పది రోజులు ఉండనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలకు పగడ్భంది ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్‌ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.
TAGS:
Tirumala
Tirupathi
AP News
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
ధనత్రయోదశి రోజే శుక్రుడి సంచారం.. ఈ 4 రాశుల వారికి బంపర్‌ గుడ్‌న్యూస్‌!

ధనత్రయోదశి రోజే శుక్రుడి సంచారం.. ఈ 4 రాశుల వారికి బంపర్‌ గుడ్‌న్యూస్‌!

2

దీపావళి ధమాకా.. కేవలం రూ.100కే 10 రకాల కూరగాయలు.. రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్..!!

3

నవంబర్ 12 వరకు ఈ 4 రాశులకు కుజుడి అనుగ్రహం.. ఉద్యోగం, వ్యాపారాల్లో భారీ లాభాలు!

4

Video: టిక్కెట్‌ లేకుండానే ఏసీ కోచ్‌లోకి ప్రవేశం.. చిర్రెత్తుకొచ్చి రిజర్వ్‌డ్‌ ప్యాసింజర్లు ఏం చేశారంటే?

5

ఇన్‌సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్-2 మాక్ టెస్టులు.. ఆన్‌లైన్‌లో ప్రాక్టీస్‌కు లింక్ రిలీజ్..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.