TG TET Mock Test: రాష్ట్రంలో ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెక్ 2కు సిద్ధమవుతున్న ఇన్ సర్వీస్ టీచర్ల కోసం విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. కంప్యూటీర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంపై ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఆన్ లైన్ మాక్ టెస్టులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు టీజీటెట్ కన్వీనర్ గాజర్ల రమేశ్ అధికారంగా ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ఎక్కడినుంచి అయినా సరే తమ ల్యాప్ టాప్ లేదంటే డెస్క్ టాప్ కంప్యూటర్ల ద్వారా అధికారిక లింక్ https://tgtet.aptonline.inలో మాక్ టెస్ట్ రాసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
దీనికోసం అభ్యర్థులు తమ జర్నల్ నెంబర్, పుట్టిన తేదీ, పరీక్ష రాసే పేపర్ ను సెలక్ట్ చేసుకుని ఈజీగా లాగిన్ కావచ్చని వెల్లడించారు. కంప్యూటర్ ఆపరేటింగ్ విషయంలో ఐసీటీ ఇన్ స్ట్రక్టర్ల సాంకేతిక సహాయం అవసరమైన అభ్యర్థులు మాత్రమే నిర్దేశిత మాక్ టెస్ట్ సెంటర్ స్కూల్లకు నేరుగా వెళ్లాలని కన్వీనర్ తెలిపారు. అలాంటి అవసరం లేని ఉపాధ్యాయులు నేరుగా సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదన్నారు. ఇంట్లో నుంచే లింక్ ద్వారా ప్రాక్టీస్ చేసుకోవచ్చని సూచించారు.
ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో టీజీటెట్ ఇన్ సర్వీస్ టీచర్స్ 2026 పరీక్షలకు హాజరయ్యే టీచర్ల కోసం కంప్యూటర్ ఆధారిత మాక్ టెస్టులను నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిక రేణుకాదేవి తెలిపారు. నవంబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాక్టీస్ పరీక్షలు అందుబాటులో ఉంటాయని ఆమె తెలిపారు. జిల్లాలో 5 కేంద్రాలను ఇందుకోసం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉప్పల్ జెడ్పీహెచ్ఎస్, జవహర్ నగర్ జెడ్పీహెచ్ఎస్ , మల్కాజిగిరి జెడ్పీహెచ్ఎస్, కుత్బుల్లాపూర్ జెడ్పీహెచ్ఎస్, పోచారం జెడ్పీహెచ్ ఎస్ లలో ఈ మాక్ టెస్టులను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఉపాధ్యాయులు తమకు అనుకూలమైన ఏదైనా ఒక కేంద్రాని ఎంచుకుని ఈ పరీక్ష రాయవచ్చని తెలిపారు. సిబిటి విధానంపై అవగాహన పెంచుకునేందుకు, కంప్యూటర్ వినియోగంలో నైపుణ్యం సాధించడం, అసలు పరీక్షపై భయాందోళనలు తగ్గించుకుని మెరుగైన ఫలితాలు సాధించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు.
Also Read: