• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Video: టిక్కెట్‌ లేకుండానే ఏసీ కోచ్‌లోకి ప్రవేశం.. చిర్రెత్తుకొచ్చి రిజర్వ్‌డ్‌ ప్యాసింజర్లు ఏం చేశారంటే?

Video: టిక్కెట్‌ లేకుండానే ఏసీ కోచ్‌లోకి ప్రవేశం.. చిర్రెత్తుకొచ్చి రిజర్వ్‌డ్‌ ప్యాసింజర్లు ఏం చేశారంటే?

టిక్కెట్‌ లేని ప్రయాణం నేరం. అంతేకాదు కొందరు వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నా కూడా రైల్వే ప్రయాణం చేస్తారు. అయితే, ఇదే విధంగా టికెట్‌ లేకుండానే తాజాగా కొంతమంది ఏసీ కోచ్‌లోకి ప్రవేశించారు. దీంతో అది జనరల్‌ కోచ్ మాదిరి తలపించింది. ఇక చిర్రెత్తుకొచ్చిన రిజర్వ్‌డ్‌ ఏసీ కోచ్‌ ప్రయాణీకులు ఏకంగా చైన్‌ లాగేశారు. ఆ తర్వాత ఏం జరిగింది వీడియో మీరే చూడండి.

Written ByRenuka Godugu
Published: Nov 06, 2026, 09:35 AM IST|Updated: Nov 06, 2026, 09:39 AM IST
joinshare
Video: టిక్కెట్‌ లేకుండానే ఏసీ కోచ్‌లోకి ప్రవేశం.. చిర్రెత్తుకొచ్చి రిజర్వ్‌డ్‌ ప్యాసింజర్లు ఏం చేశారంటే?
Image Credit: Ticketless Passengers In AC Coach

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
బెంగళూరులో ఘోరం.. భార్యతోపాటు ఏడుగురిని గ్రైండింగ్ రాయితో కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్! సహకరించిన కూతురు?

బెంగళూరులో ఘోరం.. భార్యతోపాటు ఏడుగురిని గ్రైండింగ్ రాయితో కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్! సహకరించిన కూతురు?

2

ధనత్రయోదశి రోజే శుక్రుడి సంచారం.. ఈ 4 రాశుల వారికి బంపర్‌ గుడ్‌న్యూస్‌!

3

దీపావళి ధమాకా.. కేవలం రూ.100కే 10 రకాల కూరగాయలు.. రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్..!!

4

నవంబర్ 12 వరకు ఈ 4 రాశులకు కుజుడి అనుగ్రహం.. ఉద్యోగం, వ్యాపారాల్లో భారీ లాభాలు!

5

Video: టిక్కెట్‌ లేకుండానే ఏసీ కోచ్‌లోకి ప్రవేశం.. చిర్రెత్తుకొచ్చి రిజర్వ్‌డ్‌ ప్యాసింజర్లు ఏం చేశారంటే?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ticketless Passengers In AC Coach: భారతీయ రైల్వే దేశానికే ఒక వెన్నుముఖ వంటిది. సుదీర్ఘ గమ్యస్థానానికి తక్కువ సమయంలోనే చేరవేస్తుంది. ఇందులో ప్రయాణం కూడా ఈజీ. కేవలం ప్రయాణీకులు మాత్రమే కాదు వస్తువులను కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తారు. అయితే, రైలులో ప్రయణించే సమయంలో కొందర చేస్తున్న పనులు ఇతరులకు చాలా చిరగ్గా అనిపిస్తుంది. అలాంటి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

సాధారణంగా రైలు ప్రయాణంలో రెండు నెలలు ముందుగానే టిక్కెట్‌ రిజర్వ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా కొన్ని తత్కాల్‌ టిక్కెట్లు ఒకరోజు ముందు ప్రతి రోజు ఉదయం 10 గంటలు, నాన్‌ ఏసీ అయితే, 11 గంటలకు బుక్‌ చేసుకోవచ్చు. కొన్ని టిక్కెట్లు మాత్రం రద్దీ దృష్ట్యా వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండిపోతాయి. అవి దాదాపు కేన్సల్ అయినట్లే. అయితే, టిక్కెట్‌ లేని వారు కూడా సులభంగా రైలు ఎక్కి ఏకంగా ఏసీ కోచ్‌లోకి ప్రవేశించి అందులోని ప్రయాణీకులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. సాధారణంగా ఏసీ టిక్కెట్‌ అంటేనే ఖర్చుతో కూడుకుంది. అందులో ప్రయాణం కాస్త సులభతరం  కాబట్టి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి మరీ ప్రయాణం చేస్తారు. అయితే, సోషల్‌ మీడియాలో ఉదయం నుంచి ఒక వీడియో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోలో టిక్కెట్‌ లేకుండానే రైలు ఏసీ కోచ్‌లోకి ప్రవేశించారు. దీంతో అది ఏకంగా జనరల్‌ కోచ్‌ను తలపించింది. ఇక ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కొందరు పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రిజర్వ్‌డ్‌ కోచ్‌  ప్రయాణీకులు ఏకంగా ఎమర్జెన్సీ చైన్‌ లాగి ట్రైన్‌నే ఆపేశారు. ఇక టిక్కెట్‌ లేకుండా ఇలా వారు కూడా ప్రయాణిస్తే తాము ముందుగా బుక్‌ చేసుకుని ఏం లాభమని ఫైరవుతున్నారు. అంతేకాదు ఏసీ కోచ్‌ అనేది ఫ్రీ ఎంట్రీ కోసం కాదని.. టిక్కెట్‌ చెక్‌ చేయాలని అధికారులను కోరారు. ఇంత డబ్బు పెట్టి ఏసీ టిక్కెట్‌ కొనుగోలు చేస్తే ఇలానే రైల్వే పట్టకుండానే చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో రకరకాలుగా కామెంట్లు కూడా వస్తున్నాయి.

సాధారణంగా టిక్కెట్‌ లేకుండా ప్రయాణం చేసినా.. వెయిటింగ్‌ లిస్ట్‌ ఉన్నప్పుడు ప్రయాణం చేసిన టీటీఈ భారీ జరిమానా విధిస్తారు. అంటేకాదు జనరల్‌ టిక్కట్‌తో ఏసీ కోచ్‌ ప్రయాణం కూడా చేయకూడదు. ఇలా చేయడం వల్ల కూడా ఫైన్‌ విధిస్తారు. అయితే, కొంతమంది టీటీలు పట్టనట్టుగా వ్యవహరిస్తారు. దీంతో టిక్కెట్‌ కొనుగోలు చేసి, ఏసీ కోచ్‌లో ప్రయాణం చేస్తున్నవారికి ఇలా ఇబ్బందులు ఎదురవుతాయి. కుంభమేళ సమయంలో కూడా ఇలాంటి ఘటనలు పెద్ద ఎత్తునే జరిగాయి. కొన్ని రైల్వే స్టేషన్‌లో అయితే, రైలు ఎక్కలేకపోతున్నామని ఏకంగా అద్దాలను కూడా ధ్వంసం చేశారు. కానీ, ఇలా చేయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి పనులు చేస్తే భారీ ఫైన్‌, శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

 

🚨 AC Coach Chaos! Paying Passengers Hit Back Against Ticketless Travelers! 🚆 The angry ticket-holding passengers reportedly pulled the emergency chain, bringing the train to a halt. 🚆 If you pay for an AC ticket, shouldn't you get the seat and comfort you deserve? How long will ticketless travel be tolerated? #IndianRailways

— Jharkhand Rail Users (@JharkhandRail) November 5, 2026

 

Add Zee News as a Preferred Source
TAGS:
Indian Railways
National News
Telugu News