• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Vijay Rashmika: ఫిబ్రవరి 26 కాదు.. అంతకముందే పెళ్లి చేసుకున్న విజయ్, రష్మిక.. అసలు సీక్రెట్ ఇదే!

Vijay Rashmika: ఫిబ్రవరి 26 కాదు.. అంతకముందే పెళ్లి చేసుకున్న విజయ్, రష్మిక.. అసలు సీక్రెట్ ఇదే!

Written ByVishnu Priya
Published: Oct 14, 2026, 09:24 AM IST|Updated: Oct 14, 2026, 09:29 AM IST
joinshare

Vijay Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషించారు. వీరిద్దరి ప్రేమ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇద్దరూ కలిసి కనిపించినప్పుడు, సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకున్నప్పుడు అభిమానులు ఎన్నో ఊహాగానాలు చేశారు. అయితే ఇప్పుడు వీరిద్దరి పెళ్లికి సంబంధించి దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. నిజ జీవితంలో పెళ్లికి ముందే సినిమాలో విజయ్, రష్మికలకు పెళ్లి చేశానని ఆయన చెప్పడం ఆసక్తిని పెంచుతోంది.
 

Ranabaali Movie1/5

రణబాలి సినిమా

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ చిత్రం ‘రణబాలి’. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన విజయ్, రష్మిక గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
Vijay Rashmika On-Screen Marriage2/5

రాహుల్ సంకృత్యన్

"రణబాలి సినిమా షూటింగ్ కొంత జరిగిన తర్వాత విజయ్, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారని నాకు తెలిసింది. అప్పటికే మా సినిమాలో వాళ్లిద్దరికీ పెళ్లి చేసిన సన్నివేశాన్ని రూపొందించాం. భార్యాభర్తలుగా ఉన్న వాళ్ల పోస్టర్‌ను కూడా విడుదల చేశాం. అంటే నిజ జీవితంలో వాళ్ల పెళ్లి గురించి నాకు తెలియకముందే సినిమాలో వాళ్లిద్దరికీ పెళ్లి చేశాను" అని రాహుల్ తెలిపారు. ఆ పోస్టర్ చూసినప్పుడు చిత్ర బృందంలోని వారంతా విజయ్, రష్మిక జంటను చూసి మురిసిపోయారని ఆయన గుర్తు చేసుకున్నారు. సినిమాలో వీరిద్దరూ భార్యాభర్తలుగా కనిపించనున్నారని, వారి నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు.
Rashmika Mandanna Wedding News3/5

విజయ్ రష్మిక ఆన్ స్క్రీన్ పెళ్లి

విజయ్ దేవరకొండను హీరోగా ఎంచుకోవడానికి గల కారణాన్ని కూడా రాహుల్ వివరించారు. ఈ కథలో ఒక వీరుడిలా కనిపించే హీరో అవసరమని, అందుకు విజయ్ సరైన ఎంపిక అని భావించినట్లు తెలిపారు.
 Vijay Deverakonda Latest News4/5

రష్మిక పెళ్లి వార్తలు

"ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నట విశ్వరూపాన్ని చూస్తారు. రాయలసీమ యాసలో డైలాగులు చెప్పడం అంత సులభం కాదు. కానీ రణబాలిగా విజయ్ చెప్పిన డైలాగులు చాలా బాగుంటాయి" అని ప్రశంసించారు. అలాగే జయమ్మ పాత్రలో రష్మిక అద్భుతంగా నటించిందని చెప్పారు. ఆమె నటన కూడా సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Ranabaali Movie Updates5/5

విజయ్ దేవరకొండ లేటెస్ట్ న్యూస్

చరిత్రలో మరుగునపడిన కొన్ని విషయాలను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో ‘రణబాలి’ కథను రూపొందించినట్లు రాహుల్ వెల్లడించారు. ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ లభించింది.
TAGS:
Tollywood
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
సర్కారు బడికి కళొచ్చింది.. అల్పాహారంతో 22శాతం పెరిగిన హాజరు.. బడి పిల్లలకు అత్యంత ఇష్టమైన టిఫిన్ ఏంటో తెలుసా?

సర్కారు బడికి కళొచ్చింది.. అల్పాహారంతో 22శాతం పెరిగిన హాజరు.. బడి పిల్లలకు అత్యంత ఇష్టమైన టిఫిన్ ఏంటో తెలుసా?

2

Robot Row in Germany: జర్మనీలో షాకింగ్ .. యువతి ప్రైవేటు పార్ట్‌లు టచ్ చేస్తు రోబోట్ పాడుపని.. వీడియో వైరల్..

3

Dussehra 2026: దసరా వేళ శుక్రమూఢమి, మంగళవారం గండం.. కొత్త వాహనాలు కొనకూడదా..?..

4

నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. గ్రూప్-2 సహా 1,466 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. డిపార్ట్‌మెంట్ల వారీగా ఖాళీలివే!

5

Russian Woman: ఇది కదా నిజమైన ప్రేమ... బీహర్ ప్రియుడి కోసం రష్యా నుంచి యువతి.. గుడిసెలోనే ఉంటానని రచ్చ..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.