Anushaka Shetty: నిన్న మొన్నటి వరకు టాలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్‌గా వెలిగిన హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అనుష్క హైదరాబాద్‌లోని తన ఇంటిని అమ్మేసి తన సొంతూరులో సెటిల్ అయినట్టు వార్తల సారాంశం. దీంతో స్వీటీ ఇక టాలీవుడ్‌కు పూర్తిగా దూరం కాబోతోందా? అనే చర్చ మొదలైంది.
1/5
Anushka Buy Buy to Tollywood
Anushka Buy Buy to Tollywood: అరుంధతి, బాహుబలి, భాగమతి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అనుష్క.ముఖ్యంగా అరుంధతి సినిమాలో జేజమ్మగా ఆమె చేసిన నటన ఇప్పటికీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
2/5
జేజెమ్మ
అయితే గత కొన్నేళ్లుగా అనుష్క సినిమాల సంఖ్య బాగా తగ్గించింది. ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతోంది. చివరగా ‘ఘాటీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్వీటీ.. ఇప్పుడు మలయాళంలో తన తొలి సినిమా 'కథనార్ – ది వైల్డ్ సోర్సరర్'తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా అనుష్కకు సంబంధించిన మరో వార్త ఇండస్ట్రీలో చర్చకు తావిస్తోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న తన ఇంటిని అనుష్క విక్రయించినట్లు పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి.
3/5
Sweety Shetty
ఈ ఇంటి వాల్యూ దాదాపు రూ. 12 కోట్ల వరకు ఉంటుందట. అయితే అనుష్క ఈ ఇంటిని ఎవరికీ అమ్మారు..? ఎంతకీ అమ్మారనే విషయం మాత్రం బయటకు వెల్లడి కాలేదు. ఒకప్పుడు సినిమాల కోసం హైదరాబాద్‌లోనే ఉండేది అనుష్క. ఇప్పుడు తన సొంత ప్రాంతమైన మంగళూరులో కుటుంబంతో ఎక్కువ సమయం గడుపడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అనుష్క తీసుకున్న ఈ నిర్ణయం కేవలం వ్యక్తిగతమా ? లేక తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు తీసుకున్న డెసిషనా అనేది తెలియాల్సి ఉంది.
4/5
ప్రభాస్‌తో పెళ్లి
ఇంకోవైపు అనుష్క పెళ్లిపై కూడా గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఆమె నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ప్రభాస్‌తో అనుష్క మ్యారేజ్ చేసుకున్నట్టు.. చేసుకోబోతున్నట్టు కొన్ని ఏఐ ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి కూడా. మరోవైపు అనుష్క శెట్టి.. యూవీ క్రియేషన్స్‌లో మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.
5/5
అనుష్క టాలీవుడ్ గుడ్ బై
అయితే హైదరాబాద్‌లో ఇల్లు అమ్మినంత మాత్రాన సినిమాలకు గుడ్‌బై చెప్పినట్లు కాదు. ప్రస్తుతం ‘కథనార్’ సినిమాలో నటిస్తోంది. మొత్తానికి అనుష్క హైదరాబాద్ ఇంటి అమ్మకం వార్తతో అభిమానుల మనుసుల్లో ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ జేజమ్మను తెలుగు తెరపై చూడగలమా? అనుష్క కొత్త సినిమాలతో తిరిగి బిజీ అవుతుందా? లేక తన వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందా?ఈ ప్రశ్నలకు స్వీటీ స్వయంగా క్లారిటీ ఇస్తే కానీ అసలు మ్యాటర్ తెలియదు.