• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /స్త్రీలు చెడు అలవాట్లున్న మగవాళ్లనే ఎందుకు ఇష్టపడుతారు.. చాణక్య నీతి చెబుతున్న కఠోర వాస్తవాలు ఇదే..

స్త్రీలు చెడు అలవాట్లున్న మగవాళ్లనే ఎందుకు ఇష్టపడుతారు.. చాణక్య నీతి చెబుతున్న కఠోర వాస్తవాలు ఇదే..

Chanakya Niti For Women: మంచి అలవాట్లు ఉంటేనే అమ్మాయిలు పురుషులను ఇష్టపడతారని అంటారు. కానీ చాణక్య నీతిలో ప్రస్తావించబడిన దాంట్లో పురుషులకు మంచి అలవాట్లు ఉంటేనే కాదు.. కొన్ని చెడు అలవాట్లను కూడా స్త్రీలు పురుషుల వైపు ఆకర్షితులయ్యేలా చేస్తాయనే కఠోర వాస్తవాన్ని వెల్లడించారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 06, 2026, 05:39 AM IST|Updated: Nov 06, 2026, 05:40 AM IST
joinshare
స్త్రీలు చెడు అలవాట్లున్న మగవాళ్లనే ఎందుకు  ఇష్టపడుతారు.. చాణక్య నీతి చెబుతున్న కఠోర వాస్తవాలు ఇదే..
Image Credit: Chanakya Niti (Source/AI)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
బస్సు కదలాలంటే డోరు మూయాల్సిందే.. కండక్టర్ ప్రవళిక మృతితో TGSRTC కొత్త రూల్..

బస్సు కదలాలంటే డోరు మూయాల్సిందే.. కండక్టర్ ప్రవళిక మృతితో TGSRTC కొత్త రూల్..

2

ఏపీ లోకల్ బాడీ ఎలక్షన్‌లో జనసేన మరో అసాధారణ విజయం..

3

మొన్న అర్నబ్.. నిన్న మురసు .. ఏపీని నిండా ముంచి తుపానులు..

4

స్త్రీలు చెడు అలవాట్లున్న మగవాళ్లనే ఎందుకు ఇష్టపడుతారు.. చాణక్య నీతి చెబుతున్న కఠోర వాస్తవాలు ఇదే..

5

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు.. ఖంగుతిన్న ట్రంప్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Chanakya Niti For Women: ఒక స్త్రీ సాధారణంగా పురుషుడిపై మనుసు పారేసుకోవడం అనేది వరూధుని, ప్రవరాఖ్యుడు కాలం నుంచే ఉంది.  మగవారిలోని కొన్ని మంచి లక్షణాల కారణంగా ఇతరులను ఆకర్షిస్తుంటారు. కానీ చాణక్య నీతి దీని గురించి భిన్నంగా కొన్ని విషయాలను ప్రస్తావించింది.  చాణక్య నీతి ప్రకారం, స్త్రీలు ఎక్కువగా పురుషులలో కొన్ని అలవాట్లకు ఆకర్షితులవుతారని చెబుతుంది.అది కూడా చెడు అలవాట్లకు ఆకర్షితులవుతారట.  

పనిలో నిత్యం సతమతమయ్యే పురుషులు తమను ఇష్టపడతారని స్త్రీలు భావిస్తుంటారు. ఎందుకంటే ఆనందకర జీవితానికి కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యం. కానీ కొంతమంది స్త్రీలు అలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవడానికి  ఇష్టపడరు. ఎందుకంటే పనిని గౌరవించే పురుషుడు డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత  ఇస్తాడు. కాబట్టి అతను తన భాగస్వామికి చాలా తక్కువ సమయం కేటాయిస్తాడనే అపోహ స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది.

పురుషులు అనవసరంగా కొన్ని విషయాల్లో చాలా ఎక్కువగా  డబ్బు ఖర్చు చేస్తారు. చాలా మంది మహిళలు దీనిని మంచి విషయంగా భావిస్తుంటారు. తమ కోసం ఖర్చు పెట్టడాన్ని ఆనందంగా స్వీకరిస్తారు. కానీ అది మంచి విషయం  కాదని గుర్తుంచుకోండి. భవిష్యత్తులో ఇది మీకు చాలా కష్ట తరంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి.

మహిళల ఆలోచనల ప్రకారం.. భర్త ఎల్లప్పుడూ తన భార్య గురించి ఆలోచించడం మంచిది. కానీ ప్రతి దాని గురించి ఎక్కువగా చింతించడం కూడా పెద్ద  ప్రమాదం అని చెప్పొచ్చు. అలాగే, ఈ ఆందోళన కాలక్రమేణా పెద్ద సమస్యగా మారవచ్చు. ఇది సంబంధంలో చీలికకు కారణమవుతుందని చాణక్య నీతి చెబుతోంది.

పురుషులు పెళ్లి  తర్వాత తమ కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. మహిళలు ఈ అలవాట్లను ముందు చాలా మంచిగా భావిస్తారు. కానీ చాణక్య నీతి ప్రకారం, ఇటువంటి పరిస్థితులు మహిళలకు ముందు మంచివిగా అనిపించవచ్చు. కానీ భవిష్యత్తులో అది మీకు చెడుగా మారే అవకాశాలున్నాయి.

గమనిక: పై సమాచారం చాణక్యుడు చెప్పిన నీతి శాస్త్రం చెప్పిన విషయాలనే మేము ఇక్కడ ప్రస్తావించాము. జీ  న్యూస్ ఈ వార్తను ధృవీకరించడం లేదు. దీనిని స్వీకరించే ముందు ఒకటికి రెండు సార్లు  దీనికి సంబంధించిన అంశాలకు సంబంధించిన నిపుణులను సంప్రదిస్తే బెటర్. 

Add Zee News as a Preferred Source
TAGS:
Spirituality
Daily Horoscope
Telugu Astrology
Astrological Remedies