• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /అమెరికా మధ్యంతర ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు.. ఖంగుతిన్న ట్రంప్..

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు.. ఖంగుతిన్న ట్రంప్..

US President Big Shock: నిన్న మొన్నటిదాకా అధికార అహంకారంతో విర్రవీగిన ట్రంప్ ఇపుడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలతో ఆయనకు దిమ్మతిరిగింది. అగ్రరాజ్యానికి అధినేతగా హెచ్చరికలు చేసినా ప్రజలు పట్టించుకోలేదు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులను ప్రజలు తిరస్కరించారు. డెమోక్రాట్లకు అండగా నిలిచి ట్రంప్ అహంకారాన్ని అణచివేస్తామనే సంకేతాలిచ్చారు. దీంతో ట్రంప్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. మధ్యంతర ఎన్నికల ఫలితాలతో ఆలోచనలో పడిన డొనాల్డ్ ట్రంప్ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. ఇంతకీ ట్రంప్ రాజీనామా చేస్తారా? నైతికంగా తప్పుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచనను ట్రంప్ పాటిస్తారా? ట్రంప్ రాజకీయ భవిష్యత్తు ఏంటి?

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 06, 2026, 05:00 AM IST|Updated: Nov 06, 2026, 05:01 AM IST
joinshare
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు.. ఖంగుతిన్న ట్రంప్..
Image Credit: donald trump (Source/AI Image)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
బస్సు కదలాలంటే డోరు మూయాల్సిందే.. కండక్టర్ ప్రవళిక మృతితో TGSRTC కొత్త రూల్..

బస్సు కదలాలంటే డోరు మూయాల్సిందే.. కండక్టర్ ప్రవళిక మృతితో TGSRTC కొత్త రూల్..

2

ఏపీ లోకల్ బాడీ ఎలక్షన్‌లో జనసేన మరో అసాధారణ విజయం..

3

మొన్న అర్నబ్.. నిన్న మురసు .. ఏపీని నిండా ముంచి తుపానులు..

4

స్త్రీలు చెడు అలవాట్లున్న మగవాళ్లనే ఎందుకు ఇష్టపడుతారు.. చాణక్య నీతి చెబుతున్న కఠోర వాస్తవాలు ఇదే..

5

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు.. ఖంగుతిన్న ట్రంప్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

America Midterm Election Results: అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలు డొనాల్డ్ ట్రంప్ చెంపపెట్టులా మారాయి. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ మొత్తం 435 స్థానాలకు, సెనేట్‌లో 35 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌పై పట్టు సాధించేందుకు ఇరు పార్టీలు తీవ్రంగా పోటీపడ్డాయి. ఎన్నికల ముందు అమెరికా సేనేట్ లో 53 మంది రిపబ్లికన్లు, 47 మంది డెమోక్రాట్లు ఉండే వారు. మధ్యంతర ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. ఇపుడు డెమోక్రాట్లదే పైచేయిగా మారింది. 54 స్థానాలతో డెమోక్రాట్ అభ్యర్థులు తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. రిపబ్లికన్లు 44 స్థానాలతో సరిపెట్టుకున్నారు. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు 7 స్థానాలను కోల్పోవడంతో డొనాల్డ్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ట్రంప్ సారథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎదురైంది. పోటీ చేసిన డెమోక్రాట్ అభ్యర్థులు విజయ సాధించడం రాజకీయ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.  అమెరికా మధ్యంతర ఎన్నికల   ఫలితాల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ భవిష్యత్తు ఇబ్బందికరంగా మారింది. మరో రెండేళ్ల పదవీకాలంలో డొనాల్డ్ ట్రంప్ తీవ్ర సవాళ్లను ఎదుర్కోబోతున్నారు.

ఉభయ సభల్లో డెమొక్రాట్ల ఆధిపత్యం..

అమెరికాలో ప్రతినిధుల సభ , సెనేట్ రెండింటిలోనూ డెమోక్రాట్లు ఆధిక్యం సాధించడంతో ట్రంప్ రాజకీయంగా బలహీనపడ్డారు. ఎన్నికలకు ముందుగా బెదిరింపు ధోరణి అవలంభించినప్పటికీ.. ప్రజలు పెద్దగా పట్టించుకోకుండా ఎన్నికల్లో వ్యతిరేక తీర్పునిచ్చారు.

ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు మెజారిటీ రావడంతో ట్రంప్ పరిపాలన, ఆయన కుటుంబ వ్యాపారాలు, ప్రభుత్వ నిర్ణయాలపై సబ్‌పోనా  అధికారాలతో తీవ్రమైన దర్యాప్తులు, విచారణలు జరిగే అవకాశం ఉంది. అవసరమైతే డెమోక్రాట్లు డొనాల్డ్ ట్రంప్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని అభిశంసన ప్రక్రియను కూడా తెరపైకి తెచ్చే యోచనలో ఉన్నారు. కానీ అంత ఈజీ పనికాదు.

కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల నియంత్రణ వల్ల ట్రంప్ తన విదేశీ, ఆర్థిక విధానాలకు సంబంధించిన బిల్లులను, బడ్జెట్ కేటాయింపులను సులభంగా ఆమోదింపజేసుకునే పరిస్థితి కరువైంది. సెనేట్ కూడా డెమోక్రాట్ల వశమవడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లేదా ఇతర కీలక ప్రభుత్వ పదవులకు ట్రంప్ చేసే నామినేషన్లను వారు బ్లాక్ చేసే అవకాశం ఉంది.

ట్రంప్‌కు అడుగడున ఇబ్బందులే..

అమెరికా అధ్యక్షుడిగా ఏక చత్రాధి పత్యాన్ని కొనసాగించేందుకు డొనాల్డ్ ట్రంప్ అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.   ఎన్నికల ఓటమి తర్వాత వైట్ హౌస్‌లో అంతర్గత పోరు మొదలైంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం ట్రంప్ అనుసరించిన ద్రవ్యోల్బణం, ఇమ్మిగ్రేషన్, ఇజ్రాయెల్ విధానాలపై భిన్నమైన సంకేతాలు ఇస్తూ 2028 అధ్యక్ష రేసుపై దృష్టి పెట్టడం ట్రంప్ నాయకత్వానికి సొంత పార్టీలోనే సవాలుగా మారింది.

ప్రజామద్ధతుతో  డెమోక్రాట్లకు అమెరికాలో పెద్దపీట.. 
అమెరికాలో మధ్యంతర ఎన్నికల తీర్పు ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలకు ప్రజలు ఇచ్చిన చెక్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన రెండవ విడత అధ్యక్ష పదవీ కాలంలోని మిగిలిన రెండేళ్లు తీవ్ర ప్రతిఘటనలు,  రాజకీయ ఒత్తిళ్ల మధ్య సాగనున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ కీర్తి.. 

ప్రఖ్యాత న్యూయార్క్ రియల్ ఎస్టేట్ డెవలపర్ ఫ్రెడ్ ట్రంప్ కుమారుడైన డొనాల్డ్, కీర్తి సాధించడంలోనూ, సంపదలోనూ  తండ్రిని మించిన కొడుకుగా పేరు తెచ్చుకున్నారు. 1980లలో న్యూయార్క్ ఉన్నత సామాజిక వర్గాలలో తిరుగుతూ, 2000లలో అమెరికన్ టీవీలో కీర్తిని సంపాదించి డొనాల్డ్ ట్రంప్  ప్రభావశీలిగా ఎదిగారు. 21వ శతాబ్దం ప్రారంభంలో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరిగా రాణించారు. అమెరికాకు రెండు సార్లు అధ్యక్షుడిగా కంటిన్యూ కాకుండా మూడు సార్లు పోటీ రెండు సార్లు విజయం సాధించారు. ఈ రకంగా ఒక టర్న్ విడిచి మరొక టర్న్ అధ్యక్షుడిగా   ప్రాతినిధ్యం వహించి చరిత్రలో నిలిచిపోయారు.

ఎన్నికల ఓటమి తర్వాత వైట్ హౌస్‌లో అంతర్గత పోరు..
అమెరికాకు రెండోసారి అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలను ట్యాక్సులు పెంచి భయపెట్టారు. అమెరికాకు పొరుగు దేశస్తుల వలసలను అడ్డుకునేందు కఠిన నియమాలను అమల్లోకి తెచ్చారు. వీసా ఫీజులను లక్ష డాలర్లు చేసి ప్రపంచ దేశాల ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. అంతేగాకుండా ఇరాన్ పై కక్షసాధింపులు చేపట్టడం, యుద్ధ భయాలను సృష్టించి లక్షల కోట్ల ఆస్థతి నష్టానికి, వేల మంది చావుకు ట్రంప్ కారకుడయ్యారు. 

శాంతి దూత.. 

శాంతి దూతనని తనకు తాను ప్రకటించుకుంటూ పొరుగు దేశాలపై కక్ష, కార్పణ్యాలతో రగిలి పోవడంతో డొనాల్డ్ ట్రంప పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. పరిస్థితులకు తగ్గట్టుగా మధ్యంతర ఎన్నికలు రావడంతో ప్రజలు ట్రంప్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సంకేతాలిచ్చారు. దీంతో ట్రంప్ సారథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. డెమోక్రాట్లు విజేతలుగా నిలిచారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే సంకేతాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.అటు వైట్ హౌస్‌లోను లుకలుకలు ప్రారంభమైనట్టు సమాచారం. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
America
Donald Trump
World News