Dussehra 2026: మంగళ వారం రోజు దుర్గమ్మతల్లి విగ్రహంను ఉద్వాసన చేయోచ్చా..?.. అసలు విషయం ఇదే.!.
Durgadevi Nimajjanam: మనం అక్టోబరు 20న మంగళవారం దసరా పండగను జరుపుకుంటాం. ఇదే రోజున పలు ప్రాంతాల్లో దుర్గమ్మతల్లి విగ్రహాలను నిమజ్జనం కూడా చేస్తారు. ఈ క్రమంలో కొన్ని భక్తులు మంగళవారం నిమజ్జనంపై పలు సందేహలు వ్యక్తం చేస్తున్నారు.
Navratri durga idol immersion tradition: దుర్గాదేవీ శరన్నవరాత్రులను భక్తులు ఎంతో కన్నుల పండగలా జరుపు కున్నారు. ఈ క్రమంలో మనం దసరా పండగను అక్టోబర్ 20 న జరుపుకుంటాం. ఈ రోజున మధ్యాహ్నం 1.30 నిముషాల నుంచి 2 గంటల 10 నిముషాల వరకు అమ్మవారిని ఆరాధించుకొవడానికి శుభమూహుర్తం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో దసారా రోజున శమీ పూజ పూజలు చేయడం అనాదీగా ఆచారంగా పాటిస్తు వస్తున్నారు. అంతే కాకుండా శమీ చెట్టుపై పాండవులు ఆయుధాలను దసరా రోజున తీసుకుని కౌరవులపైవిజయం సాధించారని చెప్తారు.
శ్రీ రాముడు రావణుడిపై ఇదే రొజున యుద్దం చేసి విజయం సాధించారనిఅనాదీగా చెప్పుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయంకు గుర్తుగా, అధర్మంపై ధర్మం సాధించినపై చేయికి చిహ్నంగా దసరా ను జరుపుకుంటాం. ఈ క్రమంలో దసరా రోజున పలు చోట్ల విగ్రహాలను నిమజ్జనం చేయడం ఆచారంగా పాటిస్తున్నారు.
ముఖ్యంగా దుర్గదేవీని కొంత మంది మంగళ వారం రోజున నిమజ్జనం చేయకూడదని చెప్పుకుంటున్నారు. అయితే.. ఉత్సవాలు, వివాహలు, వ్రతాలు,హోమాలు, దేవతల పూజలకు వార దోషాలు ఉండవని జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు. ఒక సారి మంచి రోజున కార్యక్రమం మొదలైన తర్వాత చివరి రోజులకు వారం దోషం ఉండదని చెప్తున్నారు.
ఈ క్రమంలో మంగళవారం రోజున దుర్గమ్మతల్లి విగ్రహాలను నిమజ్జనంపై ఎలాంటి అనుమానాలు అవసరంలేదని పండితులు సూచిస్తున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో దసరా పండగ తెల్లవారు జామున కూడా దుర్గమ్మ తల్లి విగ్రహలను నిమజ్జనంచేయడం ఆచారంగా పాటిస్తువస్తున్నారు.