Muslim women participated in saddula bathukamma in Hyderabad: తెలంగాణలో బతుకమ్మ పండగను అనాదీగా మన ఆచారం, సంస్కృతికి చిహ్నంగా చెప్తారు. చిన్న, పెద్దా తేడా లేకుండా మహిళలు బతుకమ్మ సంబరాల్ని ఎంతో వేడుకగా నిర్వహించుకుంటారు. తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చి .. దాని మధ్యలో గౌరమ్మని నిలిపుతారు. భక్తితో రోజుకో పేరుతో పూజలు చేస్తారు.
గంగా జమునా తెహజీబ్ సంస్కృతుల సమ్మేళనం నా తెలంగాణ! ♥️😍 సకల జనుల పండుగ అయిన బతుకమ్మను... బ్రాహ్మణీకరించి మిగతా వారికి చెందకుండా చేసిన చరిత్రను తిరగరాస్తూ, ఇది అందరి బతుకమ్మ అని చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే నిజమైన తెలంగాణ! ♥️✊ https://t.co/8eIOw3kI4z
— Kandula Tirupathi (@Kandula_19) October 19, 2026
పూలను అందంగా అలంకరించి బరువులెక్క చేయక నెత్తి మీద నిలిపి, చేతిలో చిన్న బతుకమ్మ ను, చెంగులో పంచడానికి పలారం బుట్టను పట్టుకుంటారు. ఈ విధంగా భక్తితో బతుకమ్మ సంబరాల్ని నిర్వహించుకుంటారు. నిన్న తెలంగాన వ్యాప్తంగా సద్దుల బతుకమ్మతో ఈ వేడుక ముగిసింది.అయితే.. ట్యాంక్ బండ్ వద్ద అరుదైన దృశ్యం చోటు చేసుకుంది.
మనం అనాదీగా భిన్నత్వంలో ఏకత్వంను పాటిస్తారు. గంగా జమునా తెహజీబ్ సంస్కృతుల సమ్మేళనం నా తెలంగాణ అంటూ గర్వంగా చెప్పుకుంటాం. భిన్న మతాలు, కులాల వారుఉన్న కూడా పండగలు రాగానే సంతోషాలతో వేడుకలను నిర్వహించుకుంటాం.
ఈ క్రమంలో ట్యాంక్ బండ్ వద్ద జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఇద్దరు ముస్లిం మహిళలకు పాల్గొనడమే కాకుండా తల మీద బతుకమ్మను ఎక్కి అందరిని ఆశ్చర్యపరిచారు. దీంతో అక్కడి వారంతా ముస్లిం మహిళలు చాటిన గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి ఫిదా అయ్యారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక నిన్న ట్యాంక్ బండ్ లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ కార్యక్రమంలో రష్మిక మందన్న, విజయ్ దేవర కొండ ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. తెలంగాణకు కొత్త కోడలిగా తన తొలి పండగ అంటూ రష్మిక మందన్న సద్దుల బతుకమ్మ ఆడుతూ అందరిలో జోష్ ను నింపారు. రష్మిక మందన్న,విజయ్ దంపతులు బతుకమ్మ చుట్టు తిరుగుతూ మన సంప్రదాయంను పాటిస్తు అభిమానుల్లో కొత్త ఆనందాన్ని నింపారు.