Cricket Team Selection Committee: భారత పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ప్రజ్ఞాన్ ఓజాను నియమితులయ్యారు. ఇప్పటిదాకా కొనసాగిన సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ స్థానంలో ప్రజ్ఞాన్ ఓజాను నియమిస్తూ బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేశారు. తాత్కాలిక సెలెక్టర్‌గా పనిచేసిన ప్రజ్ఞాన్ ఓజాకే బీసీసీఐ అవకాశం కల్పించింది. ఇక అతడితోపాటు ప్యానెల్ కమిటీలోకి మరో క్రికెటర్‌కు బీసీసీఐ అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజాను సోమవారం ఎంపిక చేశారు. అజిత్ అగార్కర్ సేవలు అక్టోబర్ 4వ తేదీతో ముగిసిపోయిన విషయం తెలిసిందే. బీసీసీఐ ప్యానల్‌లోకి రమేశ్ పవార్‌కు చోటు కల్పించింది. భారత జాతీయ పురుషుల జట్టుకు సెలక్షన్ కమిటీలో చీఫ్ సెలెక్టర్‌గా మాజీ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజాను నియమిస్తూ బీసీసీఐ ప్రకటన చేసింది. తాత్కాలిక సెలెక్టర్‌కు బీసీసీఐ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ .. పురుషుల సెలెక్షన్ కమిటీ సభ్యులను నియమించే ప్రక్రియను చేపట్టింది.
🚨 Announcement 🚨 Mr Ramesh Powar @imrameshpowar appointed to Men’s Selection Committee. Based on seniority (most Tests), Mr Pragyan Ojha @pragyanojha will chair the Committee. BCCI appreciates Mr Ajit Agarkar @imAagarkar for his commitment, conviction and contribution during his tenure as Chairman of the Committee. Details ▶️ https://t.co/z0jcyPWkr0 #TeamIndia
— BCCI (@BCCI) October 19, 2026
మెన్స్ సెలెక్షన్ కమిటీ సమావేశాలకు 40 ఏళ్ల ప్రజ్ఞాన్ ఓజా నేతృత్వం వహిస్తారని బీసీసీఐ తెలిపింది. ప్రజ్ఞాన్ ఓజా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీలో శివ సుందర్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, రమేశ్ పవార్ ఉన్నారు. భారత పురుషుల క్రికెట్ జట్టును ఎంపిక చేసే బాధ్యత ఈ ఐదుగురి సభ్యులపై ఉంది.
ప్రజ్ఞాన్ ఓజా ప్రస్థానం
క్రికెట్‌లో ఔలర్‌గా కొనసాగిన ప్రజ్ఞాన్ ఓజా భారత జట్టుకు 2008 నుంచి 2013 వరకు భారత క్రికెటర్‌గా కొనసాగారు. భారత్ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20లు ఆడిన ప్రజ్ఞాన్ ఓజా సౌత్ జోన్ నుంచి ప్రాతినిథ్యం వహించాడు.
రమేశ్ పవార్ గణాంకాలు
రమేశ్ పవార్ 2004 నుంచి 2007 మధ్య ప్రాతినిధ్యం వహించిగా.. అంతర్జాతీయంగా మొత్తం రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడాడు. ఇక అంతేకాకుండా భారత మహిళ క్రికెట్ జట్టుకు రెండు సార్లు హెడ్ కోచ్‌గా కూడా పొవార్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయన హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలోనే మహిళల జట్టు ఆసియాకప్ చాంపియన్‌గా నిలిచింది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో రజత పతకం గెలుచుకుంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనూ అతడు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా చేశాడు.
చీఫ్ సెలెక్టర్‌గా కొనసాగిన అజిత్ అగార్కర్ సేవలను బీసీసీఐ ప్రశంసించింది. అగర్కార్ పదవీ కాలంలో భారత జట్టు 3 ఐసీసీ ట్రోఫీలు, రెండు ఆసియాకప్ టైటిళ్లతోపాటు ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ గెలుచుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకా తెలిపారు.