SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కాళికాదేవి అనుగ్రహం పొందే 4 రాశులు ఇవే.. వీరికి కష్టాల నుంచి విముక్తి!

Goddess Kali 4 Lucky Zodiac Signs: రాహువు, కేతువులతో పాటు కుజుడు, శని పాలించే రాశుల వారు కాళికాదేవిని పూజించడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుందట. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరే అవకాశాలు ఉన్నాయని.. అనుకున్న పనుల్లో కూడా సులభంగా విజయాలు సాధిస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 08, 2026, 09:25 AM IST | Updated: Nov 08, 2026, 09:27 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Goddess Kali 4 Lucky Zodiac Signs: హిందూమతంలో కాళికాదేవి ఆరాధనకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. కాళికామాతను బలంతో పాటు ధైర్యం దుష్టశక్తుల సంహారానికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు. అందుకే ఈ అమ్మవారి ఆరాధనను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో చేస్తూ ఉంటారు. అయితే ఈ అమ్మవారికి కొన్ని కొన్ని రాశులకు మధ్య ప్రత్యేకమైన సంబంధం ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా కుజుడితోపాటు శని రాహు గ్రహాలు అధిపతిగా వ్యవహరించే రాశుల వారు అమ్మవారిని పూజించడం చాలా శుభప్రదమని ఆయన చెబుతున్నారు. వీరికి ఎల్లప్పుడు అమ్మవారి అనుగ్రహం లభించడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతూ ఉంటాయి.. అయితే, ఏ రాశుల వారు ఎప్పుడు ఎలా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మేష, వృశ్చిక రాశి వారు..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు రాశుల వారికి కుజుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కుజుడిని ధైర్యంతో పాటు బలం పోరాడే సామర్థ్యం ఆత్మవిశ్వాసానికి సూచికగా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రెండు రాశుల వారు కాళికాదేవిని పూజించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయట. అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల పరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి..

మకర, కుంభరాశులు..
ఈ రెండు రాశుల వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. క్రమశిక్షణ సంక్లిష్ట పరిస్థితులకు ప్రతీకగా భావించే శని కాళికామాతకు దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటాడని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. కాబట్టి ఈ రాశి వారు అమ్మవారిని పూజించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలుపుతున్నారు. అంతే కాకుండా ఎన్నో రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయట.. ముఖ్యంగా కోరుకుంటున్న కోరికల సులభంగా నెరవేరి అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి.

అమ్మవారు ఎలా పూజించాలి? 
కాళికాదేవిని శనివారం లేదా అమావాస్య రోజున పూజించడం చాలా శుభప్రదమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అద్భుతమైన నిర్మల మనసుతో అమ్మవారి ముందు దీపం వెలిగించి.. కాళికామాతకు సంబంధించిన మంత్రాలను జపించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయట. అంతేకాకుండా కాళికామాత పూజకు నిర్దిష్ట సమయం ఏది ఉండదు.. దేవుడికి.. రాశికి మధ్య ఉన్న సంబంధం అనేది జ్యోతిష్య శాస్త్రంతో పాటు మత విశ్వాసాలలో ఒక భాగమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు ఒక వ్యక్తి విధితో పాటు వారి స్వభావం, భవిష్యత్తు కేవలం వారి రాశి చక్రం మాత్రమే నిర్ణయిస్తుంది.. కష్టపడి పని చేసే వ్యక్తులకు విజయాలు తప్పకుండా లభిస్తాయని.. కాబట్టి కఠినమైన పరిస్థితులలో కూడా పనులు చేసి విజయాలు సాధించాల్సి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES