SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నవంబర్ 25న కేతువు నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి బంపర్‌ జాక్‌పాట్!

Ketu Nakshatra Transit: కేతువు నవంబర్ 25న నక్షత్ర సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 28, 2026, 09:58 AM IST | Updated: Oct 28, 2026, 10:00 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Ketu Nakshatra Transit: జ్యోతిష్య శాస్త్రం పరంగా నవంబర్ చివరి వారానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా డిసెంబర్‌ ప్రారంభంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా కూడా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఈ మార్పుల కారణంగా వృత్తితో పాటు ఆర్థిక పరిస్థితులు చాలా వరకు మారిపోతాయి. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఊహించని మార్పులు వస్తాయి.

ఇదిలా ఉంటే హిందూ పురాణాల ప్రకారం.. నవంబర్ 8న కాళీ పూజ జరుపోవడం ఆనవాయితిగా వస్తోంది.. అయితే, నవంబర్ 25న కేతువు ఆశ్లేష నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది..  ఈ నక్షత్రం సాయంత్రం 4:34 గంటలకు జరుగుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. డిసెంబర్ 5న రాత్రి 10:32 గంటలకు కేతువు సింహరాశిని వదిలిపెట్టి.. కర్కాటక రాశిలోకి సంచారం చేస్తుంది. కేతువు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల 4 రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

ఈ రాశులవారికి బంపర్‌ ప్రయోజనాలు:
సింహరాశి: 
సింహ రాశివారికి వృత్తి జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి వ్యాపారాల పరంగా కూడా కలిసి రాబోతోంది. అంతేకాకుండా అన్నింట్లో బాధ్యతులు కూడా రెట్టింపు అవుతాయి.. అలాగే కొన్ని విషయాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. దీంతో పాటు అదనపు ఆదాయం కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది.

తులారాశి: 
తులా రాశివారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి కొత్త పరిచయాల నుంచి వ్యాపారాల పరంగా కూడా చాలా వరకు కలిసి రాబోతోంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి అద్భుతమైన పదోన్నతులు కూడా లభిస్తాయి. వీరికి ఆకస్మాత్తుగా డబ్బులు కూడా లభిస్తాయి. అలాగే పెట్టుబడుల నుంచి కూడా భారీ ప్రయోజనాలు సొంతం చేసుకుంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు.

కర్కాటక రాశి: 
కర్కాటక రాశివారికి ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల పరంగా వస్తున్న దీర్ఘకాలిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అలాగే ఉద్యోగాలు మారాలని చూస్తున్నవారికి కూడా దిమ్మతిరిగే లాభాలు కలుగుతాయి. చాలా కాలంగా నిలిపోయిన పనులు కూడా అద్భుతంగా ముందుకు సాగుతాయి.

వృశ్చిక రాశి: 
వృశ్చిక రాశివారికి కూడా బంపర్‌ లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అనుకుంటున్న పనుల్లో అద్భుతమైన ప్రయోజనాలు కూడా పొందుతారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి మంచి మంచి కాంట్రాక్టులు కూడా సులభంగా లభిస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా లబిస్తాయి. దీని కారణంగా అనుకున్న పనుల్లో సింపుల్‌గా భారీ మొత్తంలో లాభాలు కూడా పొందుతారు.
 

గమనిక..


 
Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES