SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

డిసెంబర్ 5 నుంచి ఈ 4 రాశుల జీవితాల్లో మార్పులు? కేతువు సంచార ఫలితాలు ఇవే..

Ketu Transit Effect: డిసెంబర్ 5వ తేదీన కేతువు గ్రహం సంచారం చేయబోతోంది. దీని ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 17, 2026, 08:52 AM IST | Updated: Oct 17, 2026, 08:55 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Ketu Transit Effect On Zodiac: ఈ ఏడాది చివరి నెలలో అనేక గ్రహాల్లో పెద్దపెద్ద మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ నెల చాలా ప్రత్యేకమైనదిగా ఉండబోతుంది. చాయాగ్రహంగా పరిగణించే కేతువు డిసెంబర్ ఐదవ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది. అయితే, ఈ రాశికి అధిపతి చంద్రుడు.. దీని ఫలితంగా చంద్ర రాశిలో కేతువు చేసే సంచారం నాలుగు రాశుల వారికి జీవితాల్లో అనేక రకాల సమస్యలను తొలగించబోతోంది. ముఖ్యంగా ఉద్యోగాలతో పాటు వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయి. పాత ఇళ్లతో పాటు కార్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జీవితంలో ఒక అద్భుతమైన కల నెరవేరే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అయితే, కేతువు సంచారం ఏ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కేతు అనుగ్రహంతో ఈ రాశుల వారికి ఊహించని లాభాలు..
కర్కాటక రాశి 
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కేతువు అనుగ్రహం వల్ల జీవితాల్లో సానుకూలమైన మార్పులు వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో మానసిక ఉపశమనం కూడా లభించబోతోంది. పెట్టుబడులు పెట్టే వారికి అద్భుతమైన శుభవార్తలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. నీ పనుల్లో కష్టానికి తగిన గుర్తింపు కూడా లభించబోతోంది. అలాగే వీరు కొత్త బాధ్యతలు పొందే అవకాశాలు ఉండడం విశేషం..

మకర రాశి 
కేతు అనుగ్రహం వల్ల మకర రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలగబోతున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి సామర్థ్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే తప్పకుండా ఈ సమయంలో తిరిగి వస్తుంది. ఆర్థికపరమైన విషయంలో మంచి పురోగతి కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగాలు చేరాలని ఆలోచిస్తున్న వ్యక్తులకు.. ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆదాయపరంగా, వృత్తిపరంగా ముఖ్యమైన మార్పులు వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతూ వస్తున్నారు.

ధనస్సు రాశి 
కేతువు సంచారం వల్ల ధనస్సు రాశి వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో తప్పకుండా పెద్ద పనులు చేపట్టి అద్భుతమైన విజయాలు సాధించగలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓపికతో ఉండడం వల్ల కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభించబోతోంది. అలాగే ఆదాయం పెంచుకోవడానికి కొత్త కొత్త అవకాశాలు కూడా పొందగలుగుతారు. కోరుకుంటున్న కోరికలు కూడా చాలావరకు నెరవేరే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. దీర్ఘకాలిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కేతువు ప్రభావం వల్ల వీలు డిసెంబర్ నెల నుంచి ఎన్నో రకాల అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా క్రమంగా పూర్తయ్యే అవకాశాలు తప్పకుండా లభించబోతున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అలాగే వ్యాపార సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వ్యక్తులకు కూడా తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. కొత్త ఆదాయ మార్గాలు లభించడమే కాకుండా మంచి పురోగతి కూడా లభించబోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొంతమంది కుంటున్న కోరికలు కూడా నెరవేర్చుకోగలుగుతారు..

గమనిక..


 
Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES