SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

November 2026 Horoscope: నవంబర్‌లో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..లిస్టులో మీ రాశి ఉందా? చెక్ చేసుకోండి!

November 2026 Horoscope Prediction: నవంబర్ నెలలో జరిగే కీలక గ్రహ సంచారాల వల్ల మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి విశేషమైన ఆర్థిక పురోగతి, లక్ష్మీదేవి అనుగ్రహం లభించనున్నాయి. గురువు, కుజుల మార్పులు, శని, బుధ, శుక్రుల వక్రత్యాగం కారణంగా ఈ రాశుల వారికి కెరీర్‌లో పదోన్నతులు, వ్యాపార లాభాలు, ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి.

Written By Harish Darla
Published: Oct 26, 2026, 05:09 PM IST | Updated: Oct 26, 2026, 05:12 PM IST
Join

November 2026 Horoscope Prediction: నవంబర్ 1 నుంచి సింహ రాశిలో గురు సంచారం ప్రారంభం కావడం, నవంబర్ 12, 13 తేదీలలో శని, బుధ, శుక్ర గ్రహాలు వక్రత్యాగం చేయడం, అలాగే కుజుడి రాశి మార్పు వల్ల జ్యోతిష్యపరంగా విశేష మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ శుభ పరిణామాల వల్ల ఆరు రాశుల వారికి విశేష ప్రయోజనాలు చేకూరనున్నాయి. అక్టోబర్ 31 తర్వాత శివార్చన చేయించడం లేదా శనికి దీపారాధన చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు, సంతృప్తికరమైన జీవనం లభిస్తాయి.

లబ్ధి పొందే రాశుల సమగ్ర వివరాలు
మేష రాశి: 
రాశ్యాధిపతి కుజుడు మిత్రక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నందున నెలంతా శుభ ఫలితాలు కనిపిస్తాయి. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరడంతో పాటు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత హోదాలు, నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు, వివాహ సంబంధాలు కుదురుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వృషభ రాశి: 
రాశ్యాధిపతి శుక్రుడితో పాటు మరో ఐదు గ్రహాలు అనుకూలంగా మారడంతో ఈ రాశివారి దశ తిరగనుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో ఊహించని లాభాలు వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలించడంతో పాటు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ఆఫర్లు వస్తాయి.

కర్కాటక రాశి:
ధన స్థానంలో గురు ప్రవేశం వల్ల కొద్దిపాటి ప్రయత్నంతోనే సంపన్నులయ్యే అవకాశాలున్నాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీలు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. శుక్ర, గురువుల ప్రభావంతో వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతాయి. ఉద్యోగంలో హోదా, జీతం గణనీయంగా పెరుగుతాయి.

సింహ రాశి:
గురు, కుజులు ఈ రాశిలోకి రావడం వల్ల ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. సమస్యలు, తీవ్రమైన ఒత్తిళ్ల నుంచి విముక్తి కలుగుతుంది. ఆస్తి వివాదాలు సమసిపోవడం, స్థిరాస్తుల విలువ పెరగడం, సొంత ఇల్లు సమకూరడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి ఉంటుంది.

వృశ్చిక రాశి:
దశమ స్థానంలో గురు, కుజుల సంచారం, ధన స్థానంపై గురు వీక్షణ వల్ల నెలంతా పదే పదే ధన యోగాలు కలుగుతాయి. ఆదాయ వృద్ధికి చేసే ప్రతి ప్రయత్నం నూరు శాతం విజయవంతమవుతుంది. ఉద్యోగంలో అదనపు ఆదాయం, వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

ధనుస్సు రాశి:
భాగ్య స్థానంలో రాశ్యాధిపతి గురువు, లాభ స్థానంలో శుక్ర, బుధుల సంచారం వల్ల నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు మార్కెట్లో డిమాండ్ పెరిగి ఇతర సంస్థల నుంచి ఆఫర్లు వస్తాయి. వ్యాపారాలు సరికొత్త పుంతలు తొక్కుతాయి. అదనపు ఆదాయ మార్గాలు, షేర్లు, స్పెక్యులేషన్లు విశేష లాభాలను చేకూరుస్తాయి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES