• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /Balkampet Yellamma: బల్కంపేట ఎల్లమ్మకు నోట్లాభిషేకం.. రూ.2 కోట్లతో వాసవీ మాతకు అలంకరణ

Balkampet Yellamma: బల్కంపేట ఎల్లమ్మకు నోట్లాభిషేకం.. రూ.2 కోట్లతో వాసవీ మాతకు అలంకరణ

One Crore Currency Notes Decorated To Goddess Balkampet Yellamma: దేశీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవార్లు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, బాసర సరస్వతీ ఆలయం, వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకరణలో కనిపించారు. ఈ సందర్భంగా నోట్లతో అమ్మవార్లను అలంకరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 16, 2026, 02:55 PM IST|Updated: Oct 16, 2026, 02:58 PM IST
joinshare
Balkampet Yellamma: బల్కంపేట ఎల్లమ్మకు నోట్లాభిషేకం.. రూ.2 కోట్లతో వాసవీ మాతకు అలంకరణ
Image Credit: Balkampet Yellamma

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రొటిన్ వద్దు.. సీనియర్స్ నుంచి జూనియర్స్ దాకా సమ్‌థింగ్ స్పెషల్ కోరుకుంటున్న హీరోలు..

రొటిన్ వద్దు.. సీనియర్స్ నుంచి జూనియర్స్ దాకా సమ్‌థింగ్ స్పెషల్ కోరుకుంటున్న హీరోలు..

2

చార్ట్ ప్రిపేర్ అయ్యాక ఖాళీ బెర్త్ చూసుకోవడం ఇక మరింత ఈజీ! IRCTC యాప్‌లో ఈ కొత్త ఫీచర్ చూశారా?

3

Bhuvneshwar Kumar: వెస్టిండీస్‌తో ఐదో టీ20 మ్యాచ్‌.. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ జట్టులోకి ఎంట్రీ..!

4

‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్‌లో మరో స్టార్ హీరోయిన్..?

5

మాయమాటలను గుడ్డిగా నమ్మకూడని చెబుతున్న... తోడేలు తంత్రం - కుందేలు అమాయకత్వం నీతి కథ...!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Currency Notes Decoration: హైదరాబాద్‌ నడిగడ్డపై 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లి శ్రీ మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చారు. బల్కంపేట ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతుండగా.. శుక్రవారం ప్రత్యేక అలంకరణ చేశారు. ఎల్లమ్మను నోట్లతో అలంకరించారు. మొత్తం కోటి రూపాయల కరెన్సీతో అమ్మవారి అలంకరణ అద్భుతంగా అలంకరించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలవిరాట్‌ను రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్ల కరెన్సీతో ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి పూజలు చేశారు. కొత్త కరెన్సీ నోట్లు, విద్యుత్ దీపాల  దగధగలతో బల్కంపేట అమ్మవారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నవరాత్రి ఉత్సవాలతో బల్కంపేట ఆలయ ప్రాంగణం  భక్తిశ్రద్ధలతో సందడిగా మారింది.

జడ్చర్లలో..
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆరో రోజు శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి రూ.2 కోట్ల 22 లక్షల 22 వేల 222 కరెన్సీ నోట్లతో అలంకరణ చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నవరాత్రుల సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో భక్తిశ్రద్ధలతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ మొత్తంలో నగదుతో అమ్మవారిని అలంకరించడంతో ఆలయంలో పోలీసు బందోబస్తు భారీగా చేయగా.. సీసీ కెమెరా నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు.

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. నాలుగు కోట్ల 50 లక్షల రూపాయల నోట్లతో అమ్మవారి అందంగా అలంకరించడంతో పెద్ద ఎత్తున దర్శించుకునేందుకు భక్తులు వచ్చారు. అమలాపురం ప్రధాన రహదారిలో ఉన్న వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం మహాలక్ష్మి దేవిగా ప్రత్యేకంగా కనిపించారు. ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయంలో ఎటు చూసినా కొత్త కరెన్సీతో తోరణాలు, కరెన్సీ దండలు, కరెన్సీ కట్టలు, కరెన్సీ గోడలు దర్శనమిస్తున్నాయి. సాయుధ పోలీసులతో దేవాలయంలో రక్షణ చర్యలు చేపట్టారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా ఒక రూపాయి నాణెం అందించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Spirituality
Telugu News
Trending News
Hyderabad