• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /2027లో రాహువు సంచారంతో ఈ 3 రాశులకు జాక్‌పాట్.. ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు!

2027లో రాహువు సంచారంతో ఈ 3 రాశులకు జాక్‌పాట్.. ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు!

Rahu Transit 2027 Effect: 2027 సంవత్సరంలో అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా రాహువు కూడా మార్పులు చేర్పులు చేయడంతో ఈ క్రమంలో కొన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ఆయా రాశులవారికి ఈ సమయంలో దిమ్మతిరిగే లాభాలు కలుగుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎక్కువగా మేలు జరుగుతుందో తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 05, 2026, 10:19 AM IST|Updated: Nov 05, 2026, 10:21 AM IST
joinshare
2027లో రాహువు సంచారంతో ఈ 3 రాశులకు జాక్‌పాట్.. ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

2

Kavitha: రేవంత్‌ రెడ్డి కుటుంబానికి కామధేనువులా హైదరాబాద్‌.. మొత్తం దోపిడే: కవిత

3

హైదరాబాద్ వాసులకు దీపావళి ధమాకా! భారీగా తగ్గనున్న మెట్రో-RTC కామన్ పాస్ రేట్లు.. కొత్త ధరలు ఇవే!

4

హైదరాబాద్ నడిబొడ్డున మరో ఐమాక్స్ స్క్రీన్.. వెంకీ, మహేష్‌ల AMB విక్టరీ..

5

దృష్టిలోపం ఉన్న భక్తులకు గుడ్‌న్యూస్.. అయోధ్య రాముడి దర్శనం మరింత సులభం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rahu Transit Effect: 2027వ సంవత్సరానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అతి త్వరలోనే 2026 సంవత్సరం కూడా ముగుస్తుంది. వచ్చే ఏడాదే గ్రహ సంచారాల పరంగా చాలా ప్రత్యేకమనదని భావించవచ్చు.. ముఖ్యంగా ఈ సంవత్సరంలో రాహువు కూడా మార్పులు చేర్పులు చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఆకస్మిక మార్పులు తప్పవని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో నాలుగు రాశులవారికి ఉద్యోగాలతో పాటు వ్యాపారాల పరంగా మంచి మెరుగుదల కూడా కనిపిస్తుంది. ప్రేమ జీవితంలో కూడా మార్పులు వస్తాయి. అదృష్టం కూడా విపరీతంగా లభించి.. అనుకున్న పనుల్లో అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి.. అద్భుతమైన ప్రయోజనాలు పొందే రాశులేవి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి రాహువు అనుగ్రహం..
వృషభ రాశి 
2027లో వృషభ రాశివారు తప్పకుండా రాహువు అనుగ్రహం పొందుతారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. వీరికి తప్పకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అంతేకాకుండా పెద్ద పెద్ద రుణాలు కూడా సులభంగా తీరిపోతాయి. వీరికి తప్పకుండా కొత్త ఆదాయ వనరులు కూడా సులభంగా లభిస్తాయి. అలాగే వీరికి పనుల్లో తప్పకుండా బాధ్యతలు కూడా పెరుగుతాయి. కృషికి తగ్గ నైపుణ్యం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా వీరికి జీవితంలో ఆనందంతో పాటు శాంతి విపరీతంగా నెలకొంటుంది. అలాగే అనేక సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

సింహ రాశి 
సింహ రాశివారికి కూడా రాహువు అనుగ్రహం లభిస్తుంది. దీని కారణంగా వీరికి చాలా కాలంగా నిలిపోయిన పనులు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. కొత్త ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. అనేక ప్రధాన సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు తప్పకుండా ఈ సమయంలో కొన్ని రకాల తప్పుడు నిర్ణయాలకు దూరంగా ఉంటారు. అనేక రకాల సమస్యలు కూడా సుభంగా దూరమవుతాయని జ్యోతిస్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

తులారాశి
2027లో తులారాశివారికి రాహువు అనుగ్రహంలో దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఒకరికొకరు మరింత దగ్గరవ్వడంతో అద్భుతమైన ఆనందం పొందుతారు. ఈ సమయంలో ప్రేమ వంటి అంశాల్లో వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. 
NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Astrology
Astrological Remedies
Ugadi Rasi Phalalu