ఈ 3 రాశులవారికి ఆర్థిక ఇబ్బందులు? సూర్య, చంద్రుల షడాష్టక యోగం ప్రభావం ఇదే!
Shadashtak Yoga 2026: సూర్యుడు, చంద్రుడు 180 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల కొన్ని రాశులవారిపై షడాష్టక యోగం ప్రభావం పడింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Shadashtak Yoga 2026 Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని ముఖ్యమైన గ్రహాలు సంచారం చేస్తే మొత్తం అన్ని రాశులు చాలా వరకు ప్రభావితమవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక, వృత్తిపరమైన జీవితంలో కూడా దిమ్మతిరిగే మార్పులు వస్తాయి. అయితే, కొన్ని రాశుల కలయిక కారణంగా కూడా ఊహించని ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుంది. కొన్ని గ్రహాలు సంయోగం అన్ని రాశులవారికి బాగుంటే.. మరికొన్ని గ్రహాల కలయిక కీడు ప్రభావాన్ని అందిస్తుంది. ఇదిలా ఉంటే నవంబర్ 22న ఎంతో శక్తివంతమైన గ్రహంగా చెప్పుకునే సూర్యుడు, చంద్రుడు 180 డిగ్రీల కోణంలో సంయోగం జరిగింది. దీంతో కొన్ని రాశులవారికిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆయా రాశులవారికి ఊహించనని సమస్యలు వస్తాయి. అయితే, ఈ సమయంలో షడాష్టక యోగం ఏర్పడుతుంది. దీంతో ఈ కింది రాశులవారికి సమస్యలు తప్పవని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఈ రాశులవారిపై షడాష్టక యోగం ఎఫెక్ట్:
వృశ్చిక రాశి:
షడాష్టక యోగం ఎఫెక్ట్‌తో వృశ్చిక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి అవసరం ఎంతగానో ఉందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇతరులకు పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం చాలా మంచిది.. లేదంటే ఆ డబ్బులు తిరిగి రావడం కష్టమవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. రిస్క్ ఎక్కువగా ఉండే వ్యాపారాలతో పాటు పెట్టుబడులకు దూరంగా ఉండటం చాలా మంచిది.. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో తమ అప్పగించిన పనులు చాలా వరకు చేయాల్సి ఉంటుంది. ఆదరాబాదరాగా చేసే చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యలకు దారి చేసే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. ఇతరులతో మాట అదుపు తప్పకుండా చూసుకోవాల్సి ఉంటుంది. లేదంటే బంధాల్లో సమస్యలు వస్తాయి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడాదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ధనుస్సు రాశి:
సూర్య, చంద్ర గ్రహాల కలయికతో ధనుస్సు రాశివారికి ఆర్థిక రంగాల్లో ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది. లేకపోతే తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాడు. ఈ సమయంలో ఎంత శ్రమించిన ఫలితాలు రాకపోయే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా తగిన గుర్తింపు లేదా ఫలితాలు పొందడానికి కొంత సమయం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి నిరాశ చెందకుండా ఓర్పుతో మీ పని మీరు చేసుకోవడం మంచిది.. అంతేకాకుండా ఎలాంటి సమస్యలు వచ్చిన చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
వృషభ రాశి:
షష్టక యోగ ఎఫెక్ట్‌తో వృషభ రాశి వారు ఆర్థిక లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అనుకోకుండా ఎదురయ్యే ఖర్చులు అనేక ఆర్థిక సమస్యలను దారి తీసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి అనవసరమైన విలాసాలకు, తొందరపాటు పెట్టుబడులకు దూరంగా ఉండి పొదుపుపై దృష్టి సారించడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. వృత్తి జీవితంలో సహోద్యోగులతో సమన్వయం లోపించడం వల్ల అనేక రకాల సమస్యలు కూడా వస్తాయి. చిన్నపాటి విభేదాలు కూడా మీ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీనికి తోడు స్థిరాస్తి లేదా భూమికి సంబంధించిన కుటుంబ వివాదాలు ఆందోళన వంటి సమస్యలు కూడా వస్తాయి..
NOTE: