SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

దుర్గా పూజ సమయంలో త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమేనా?

Trigrahi Yoga Effect: సప్తమి రోజు ఎంతో శక్తివంతమైన త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగానే ఈ సమయంలో కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి కాస్త ఉపశమనం కూడా లభిస్తుంది.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 09, 2026, 10:13 AM IST | Updated: Oct 09, 2026, 10:15 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Trigrahi Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని శక్తివంతమైన గ్రహంగా భావిస్తారు. అక్టోబర్ నెలలో ఈ గ్రహం అనేక మార్పులు చేయబోతోంది. సూర్యుడు కన్యా రాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించడంతో పాటు, అక్కడ ఇప్పటికే ఉన్న గ్రహాలతో కలయిక జరుపుతారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. దీని కారణంగానే ఎంతో శక్తివంతమైన త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోందని ఆయన తెలిపారు. ముఖ్యంగా సప్తమి రోజే, దుర్గా పూజ సమయంలోనే ఈ యోగం ఏర్పడడం వల్ల దీనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత సంతరించుకోబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ అరుదైన యోగం దాదాపు నవంబర్ 16 వరకు కొనసాగబోతోంది. దీంతో కొన్ని రాశులవారికి ఊహించని స్థాయిలో అదృష్టం లభించబోతోంది. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా దిమ్మతిరిగే ధన లాభాలు కూడా సొంతం చేసుకుంటారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. అయితే, ఈ సమయంలో అత్యధిక లాభాలు సొంతం చేసుకునే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

త్రిగ్రాహి యోగం ఎఫెక్ట్‌తో ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మిథున రాశి (Gemini):
త్రిగ్రాహి యోగం ప్రభావంతో మిథున రాశివారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఉద్యోగాల పరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా అద్భుతమైన పదోన్నతులు కూడా లభించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార రంగాల్లో ఉన్నవారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా భారీ లాభాలు సొంతం చేసుకుంటారు. కుటుంబంలో వస్తున్న మనస్పర్థాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా వీరికి దుర్గా పూజ సమయంలో బంపర్‌ లాభాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి.

ధనుస్సు రాశి (Sagittarius):
త్రిగ్రాహి యోగం ఎఫెక్ట్‌తో ధనుస్సు రాశివారికి విపరీతమైన ఆదాయ వనరులు కూడా లభించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. గతంలో ఆగిపోయిన పాత బాకీలు కూడా చేతికి అందుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు విస్తరించేవారికి కూడా బంపర్‌ లాభాలు చేకూరే ఛాన్స్‌లు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ పెద్దల నుంచి సహకారం కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు వీరు మీత్రుల నుంచి కూడా భారీ లాభాలు పొందుతారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. విద్యార్థులకు ఈ సమయంలో ఏకాగ్రత పెరుగుతుంది.

సింహ రాశి (Leo):
మోస్ట్ పవర్‌ఫుల్ త్రిగ్రాహి యోగం ఎఫెక్ట్‌తో సింహ రాశివారికి విశేషమైన లాభాలు కలిగే ఛాన్సులు ఉన్నాయి. ముఖ్యంగా వీరికి సమాజంలో కీర్తి, ప్రతిష్టలు కూడా రెట్టింపు అవుతాయి. అలాగే గౌరవ మర్యాదలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. ఉద్యోగంలో కొత్త కొత్త బాధ్యతలు కూడా లభించే ఛాన్స్‌లు కనిపిస్తాయి. నూతన ఆదాయ వనరులు కూడా పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది. పోటీ పరీక్షల్లో కూడా అద్బుతమైన ఫలితాలు కూడా సొంతం చేసుకుంటారు. ఆత్మవిశ్వాసంలో అద్బుతమైన ప్రయోజనాలు సొంతం చేసుకుంటారు. 

గమనిక..


 
Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES