• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Cricketer Baned: క్రికెట్‌లో కలకలం.. కొకైన్ తీసుకుని దొరికిపోయిన స్టార్ క్రికెటర్..!

Cricketer Baned: క్రికెట్‌లో కలకలం.. కొకైన్ తీసుకుని దొరికిపోయిన స్టార్ క్రికెటర్..!

Cricketer Baned News: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ క్రిస్ లిన్ కొకైన్ వినియోగించినట్లు డోపింగ్ పరీక్షల్లో వెల్లడైంది. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ రెగ్యులేటర్ అతడిపై నెల రోజుల నిషేధం విధించింది. అయితే పునరావాస కార్యక్రమం పూర్తి చేయడంతో ఆ శిక్షాకాలం ఇప్పటికే ముగిసింది.

Written ByAshok Krindinti
Published: Nov 06, 2026, 06:00 PM IST|Updated: Nov 06, 2026, 06:02 PM IST
joinshare
Cricketer Baned: క్రికెట్‌లో కలకలం.. కొకైన్ తీసుకుని దొరికిపోయిన స్టార్ క్రికెటర్..!
Image Credit: Cricketer Baned News (Source: AI Generated)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Jeevan Reddy: 'రేవంత్ రెడ్డి రూ.100 కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణలో కరువు మాయం': జీవన్‌ రెడ్డి

Jeevan Reddy: 'రేవంత్ రెడ్డి రూ.100 కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణలో కరువు మాయం': జీవన్‌ రెడ్డి

2

Vijayasai Reddy: పొమ్మనకుండా పొగ పెట్టారు.. వైఎస్ జగన్‌ టార్గెట్ గా విజయసాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్..

3

Palle Palleku Seethakka: ములుగులో సీతక్క సరికొత్త కార్యక్రమం.. పల్లె పల్లెకు వెళ్తున్న మంత్రి

4

ECI SIR Fresh Chance: SIRలో మీ ఓటు పోయిందా? ఏపీ, తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్!

5

Cricketer Baned: క్రికెట్‌లో కలకలం.. కొకైన్ తీసుకుని దొరికిపోయిన స్టార్ క్రికెటర్..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Chris Lynn Banned for One Month: ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ క్రిస్ లిన్ వివాదంలో చిక్కుకున్నాడు. కొకైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలిది. దీంతో అతడిపై ఇంగ్లండ్ క్రికెట్ రెగ్యులేటర్ నెల రోజుల నిషేధం విధించగా.. ఈ శిక్షాకాలం ఇప్పటికే పూర్తయింది. 36 ఏళ్ల క్రిస్ లిన్ ఇంగ్లాండ్‌లో జరిగిన టీ20 బ్లాస్ట్ టోర్నీలో నార్తాంప్టన్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జూలై 18న జరిగిన ఫైనల్స్ డే సందర్భంగా నిర్వహించిన సాధారణ యాంటీ డోపింగ్ పరీక్షలో లిన్ మూత్ర నమూనాలను సేకరించారు. ఫ్రాన్స్‌లోని ప్రయోగశాలలో పరీక్షించగా.. కొకైన్ వినియోగానికి సంబంధించిన బెంజాయిలెక్గోనైన్ అనే పదార్థం ఉన్నట్లు గుర్తించారు.

ఈ పరీక్ష ఫలితాలపై స్పందించిన లిన్.. జూలై 15వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ తెల్లవారుజాము వరకు కొకైన్ తీసుకున్నట్లు అంగీకరించాడు. అయితే ఈ కొకైన్ తీసుకున్నది మ్యాచ్‌ కోసమో.. తన ఆటతీరును మెరుగుపరుచుకునేందుకో ఆ పదార్థాన్ని వినియోగించలేదన్నాడు. జూలై 31న పరీక్ష ఫలితాలపై సమాచారం అందుకున్న క్రిస్ లిన్‌ను అధికారులు తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. మొదట 3 నెలల నిషేధం విధించాలని రెగ్యులేటర్ భావించినా.. లిన్ మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన చికిత్స, పునరావాస కార్యక్రమాన్ని పూర్తి చేయడంతో శిక్షను నెల రోజులకు తగ్గించారు.

"2026 వాడా నిషేధిత జాబితాలోని సెక్షన్ S.6A కింద కొకైన్‌ను ఒక ఉత్తేజపరిచే పదార్థంగా చేర్చారు. ఇది క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు తీసుకోవడం నిషేధించారు. 2026 వాడా నిషేధిత జాబితాలో కొకైన్‌ను దుర్వినియోగ పదార్థంగా కూడా ప్రత్యేకంగా గుర్తించారు.." అని ఇంగ్లాండ్ క్రికెట్ రెగ్యులేటర్ వెల్లడించింది.

ఆగస్టు 30 నాటికే సస్పెన్స్ పూర్తయినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. దీంతో జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు సస్పెన్షన్‌ అమలులో ఉందన్నారు. ఈ వ్యవహారంలో నార్తాంప్టన్‌షైర్ జట్టుపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కూడా క్రికెట్ రెగ్యులేటర్ స్పష్టం చేసింది. ఆసీస్ తరఫున క్రిస్ లిన్ నాలుగు వన్డేలు, 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ముఖ్యంగా ఫ్రాంచైజీ టీ20 క్రికెట్‌లో భారీ సిక్సర్లతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. బిగ్ బాష్ లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా అతడికి పేరుంది. ప్రొఫెషనల్ క్రికెట్‌లో కొంతకాలంగా కనిపించని లిన్.. రాబోయే బిగ్ బాష్ లీగ్ సీజన్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరఫున ఆడే అవకాశాలున్నట్లు ఆస్ట్రేలియా మీడియా కథనాలు వెల్లడించాయి. నిషేధం పూర్తికావడంతో లిన్ తదుపరి క్రికెట్ కెరీర్‌పై ఆసక్తి నెలకొంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket
Sports News
Telugu News