SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Devdutt Padikkal: అంపైర్ తప్పిదానికి బలైన పడిక్కల్.. ఒక్క పరుగు దూరంలో డబుల్ సెంచరీ మిస్..!

Devdutt Padikkal Out Video: అంపైర్ తప్పుడు నిర్ణయంతో దేవదత్ పడిక్కల్ 199 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. న్యూజిలాండ్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్టులో పడిక్కల్ డబుల్ సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఉండగా.. అంపైర్ ఇచ్చిన ఔట్ వివాదాస్పదమైంది. వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Oct 26, 2026, 01:19 PM IST | Updated: Oct 26, 2026, 01:22 PM IST
Image Credit: Devdutt Padikkal (Source: X)
Join

Devdutt Padikkal Out Video:  న్యూజిలాండ్ 'ఎ' జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో అంపైర్ తప్పుడు నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలయ్యాడు. 199 పరుగుల వద్ద పడిక్కల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అంపైర్ అవుట్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఒక్క పరుగు దూరంలో డబుల్ సెంచరీ చేజారింది. అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పడిక్కల్ నిరాశగా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడో ఆట ముగిసే సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 488 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 284 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఏం జరిగింది..?

అది ఇండియా-‘ఎ’ రెండో ఇన్నింగ్స్ 89వ ఓవర్‌. అప్పటికి పడిక్కల్ 199 పరుగులతో డబుల్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. ఆ ఓవర్ ఐదో బంతి లెగ్ స్టంప్ లైన్‌లో షార్ట్ పిచ్‌గా రాగా.. పడిక్కల్ దాన్ని ఫ్లిక్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే బంతి నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. వెంటనే న్యూజిలాండ్-‘ఎ’ ఫీల్డర్లు ఔట్ కోసం గట్టిగా అప్పీల్ చేశారు. బంతి దూరంలో వెళ్లిపోవడంతో పడిక్కల్ కూల్‌గా పక్కకు వచ్చాడు. అయితే అంపైర్ ఏమాత్రం ఆలోచించకుండా ఔట్ అంటూ వేలు ఎత్తేశాడు. బంతి బ్యాట్‌కు అసలు తగలలేదని నమ్మకంతో ఉన్న పడిక్కల్.. అంపైర్ నిర్ణయాన్ని చూసి షాక్ అయ్యాడు. తాను నాటౌట్ అని అంపైర్‌కు చెబుతూ.. తీవ్ర నిరాశతో పెవిలియన్ వైపు అడుగులు వేశాడు.

 

నో డీఆర్ఎస్..

ఇలాంటి సమయంలో బ్యాటర్లు సాధారణంగా డీఆర్ఎస్ తీసుకుంటారు. కానీ ఇది అనధికారిక టెస్ట్ మ్యాచ్ కావడంతో నిబంధనల ప్రకారం డీఆర్‌ఎస్ అందుబాటులో లేదు. ఫీల్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్. దీంతో నాటౌట్ అయినా.. రివ్యూ తీసుకునే అవకాశం లేక అంపైర్ తప్పిదానికి పడిక్కల్ ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. కాగా.. ఇండియా-‘ఎ’ తరఫున పడిక్కల్‌కు ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఇండియా-‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 113 పరుగులకే ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్-‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులు చేసి ఏకంగా 204 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్-‘ఎ’ కేవలం 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో దేవ్‌దత్ పడిక్కల్, సాయి సుదర్శన్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ఆడారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు ఏకంగా 215 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఇన్నింగ్స్ ఓటమి ముప్పు నుంచి తప్పించారు. సాయి సుదర్శన్ 91 పరుగులు చేసి ఔటవ్వగా.. ఆ తర్వాత వచ్చిన యష్ రాథోడ్‌ (66)తో కలిసి పడిక్కల్ మరో 142 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. వాషింగ్టన్ సుందర్ (51 నాటౌట్), ఆకాశ్ దీప్ (0) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు.  

Also Read:Ishan Kishan: మూడో టీ20 మ్యాచ్‌కు ఇషాన్ కిషన్ దూరం.. వైభవ్ సూర్యవంశీకి మరో బంపర్ ఛాన్స్..!

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES