IND vs WI Highlights: హైదరాబాద్‌లో భారత్‌కు భారీ షాక్.. ఉప్పల్‌లో వెస్టిండీస్ అద్భుత విజయం
West Indies Beat India By 24 Runs At Uppal Stadium: వన్డే సిరీస్‌ను కోల్పోయిన వెస్టిండీస్ టీ20 సిరీస్‌ను ఏమాత్రం చేజారకుండా సమం చేసింది. ఉప్పల్ స్టేడియంలో భారత్‌పై బ్యాటింగ్, బౌలింగ్‌లో కట్టడి చేసి నాలుగో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ అద్భుత విజయం సాధించింది. చివరి బ్యాటర్ వరకు పోరాడినా కూడా హైదరాబాద్‌లో భారత్‌కు ఓటమి తప్పలేదు.
India vs West Indies 4th T20I Highlights: సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే భారత ఆశలకు వెస్టిండీస్ గండికొట్టింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కరీబియన్లు గొప్పగా పోరాడుతున్నారు. వన్డే సిరీస్‌ను కోల్పోయిన వేళ పొట్టి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే కసితో విండీస్ ఆటగాళ్లు గొప్పగా ఆడుతున్నారు. దాని ఫలితమే హైదరాబాద్‌లో జరిగిన నాలుగో మ్యాచ్ ఫలితం. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఉప్పల్ స్టేడియంలో శాయ్ హోప్ సెంచరీతో విధ్వంసం సృష్టించగా.. అటు బౌలింగ్‌తో కీమో పాల్ భారత బ్యాటింగ్ దళాన్ని కుప్పకూల్చాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన విండీస్ భారత్‌ను చిత్తు చేసి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. సిరీస్ సమం కావడంతో ఈనెల 17వ తేదీన బెంగళూరులో జరగనున్న ఆఖరి మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారనుంది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. శాయ్ హోప్ మరోసారి సెంచరీతో చెలరేగి ఆడాడు. ఆరంభం నుంచి బరిలోకి దిగిన హోప్ ఆఖరి బంతి వరకు ఆడుతూ అజేయ శతకం బాదాడు. 50 బంతుల్లో 102 పరుగులు చేశాడు. వాటిలో నాలుగు ఫోర్లు ఉండగా.. 9 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 204 స్ట్రైక్ రేటుతో ఆడిన హోప్ సిరీస్‌ను చేజారకుండా గొప్పగా ఆడాడు.
హోప్‌తో ఓపెనర్‌గా దిగిన జెవెల్ ఆండ్రే 21 పరుగులు చేయగా.. షిమ్రాన్ హెట్మెయిర్ 12 బంతుల్లో 33 స్కోర్‌తో రాణించగా.. రావ్‌మెన్ పావెల్ (24) పర్వాలేదనిపించాడు. ఆఖరులో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ హోప్‌తో కలిసి చక్కటి భాగస్వామ్యం ఏర్పరచుకుని అతడు 26 బంతుల్లో 49 పరుగులు రాబట్టాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో రాణించాడు. విండీస్ బ్యాటర్లను పడగొట్టడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు.
భారీ స్కోర్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టు ఆఖరు బ్యాటర్ గాయపడడంతో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఒక్క సంజూ శామ్సన్ మినహా మిగతా బ్యాటర్లు ఉప్పల్ స్టేడియంలో పోరాడలేకపోయారు. హైదరాబాద్‌లో ఆటపై పూర్తి అవగాహన ఉన్న భారత బ్యాటర్లు చేతులెత్తేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఓపెనర్‌గా దిగిన సంజూ 23 బంతుల్లో 56 స్కోర్ చేసి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అద్భుతంగా రాణించగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ 29 పరుగులకు పరిమితమయ్యాడు. ఇషాన్ కిషన్ (6) అలా వచ్చి ఇలా వెళ్లిపోగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16) తక్కువ స్కోర్ చేసి వెనుదిరిగిన వేళ నమన్ ధిర్ డకౌట్ అయ్యాడు. క్లిష్ట సమయంలో మైదానంలోకి వచ్చిన తెలంగాణ ఆటగాళ్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పి లక్ష్యంగా దిశగా అడుగులు వేశారు. తిలక్ 25 బంతుల్లో 43 స్కోర్ చేయగా.. నితీశ్ 20 బంతుల్లో 41 పరుగులు చేశాడు. వారిద్దరూ ఔటవడంతో జట్టు ఓటమి ఖరారైంది. ప్రిన్స్ యాదవ్ డకౌట్ కాగా.. అక్షర్ పటేల్ (3), అర్ష్‌దీప్ సింగ్ (5) కొన్ని పరుగులు జోడించి మ్యాచ్‌ను కోల్పోయారు.
చెప్పుకోవాల్సిందంతా విండీస్ బౌలింగ్. బ్యాటింగ్ పిచ్‌పై విండీస్ బౌలర్లు చెలరేగిపోయారు. కీమో పాల్ బౌలింగ్ దెబ్బకు భారత బ్యాటింగ్ దళం కుప్పకూలింది. 4 ఓవర్లు వేసిన కీమో 41 పరుగులు ఇచ్చాడు. ఎక్కువ పరుగులు ఇచ్చినా కూడా కీలకమైన ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇక గుడాకేశ్ మోతీ రెండు వికెట్లతో సత్తా చాటగా.. రొమారియో షెఫర్డ్, షామర్ స్ప్రింగర్ ఒక్కో వికెట్ తీశారు. బ్యాటింగ్‌లోనూ.. బౌలింగ్‌లోనూ అదరగొట్టి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన వెస్టిండీస్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌ను ఫైనల్‌గా మార్చేసింది. బెంగళూరు వేదికగా జరగనున్న ఆఖరి మ్యాచ్‌తో సిరీస్ ఎవరిదనేది తేలనుంది. వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్‌పై పొట్టి సిరీస్‌ను అయినా సొంతం చేసుకోవాలనే కసితో కరీబియన్లు పోరాడుతున్నారు. తొలి టీ20 మ్యాచ్‌ను ఓడి.. రెండో మ్యాచ్‌లో గెలిచి.. మూడో మ్యాచ్‌లో ఓటమిపాలై.. ఇప్పుడు నాలుగో మ్యాచ్‌ను సొంతం చేసుకుని విండీస్ గొప్ప పోరాటాన్ని చూపించింది.