• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /IND vs WI Highlights: హైదరాబాద్‌లో భారత్‌కు భారీ షాక్‌.. ఉప్పల్‌లో వెస్టిండీస్‌ అద్భుత విజయం

IND vs WI Highlights: హైదరాబాద్‌లో భారత్‌కు భారీ షాక్‌.. ఉప్పల్‌లో వెస్టిండీస్‌ అద్భుత విజయం

West Indies Beat India By 24 Runs At Uppal Stadium: వన్డే సిరీస్‌ను కోల్పోయిన వెస్టిండీస్‌ టీ20 సిరీస్‌ను ఏమాత్రం చేజారకుండా సమం చేసింది. ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌పై బ్యాటింగ్‌, బౌలింగ్‌లో కట్టడి చేసి నాలుగో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ అద్భుత విజయం సాధించింది. చివరి బ్యాటర్‌ వరకు పోరాడినా కూడా హైదరాబాద్‌లో భారత్‌కు ఓటమి తప్పలేదు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 14, 2026, 11:09 PM IST|Updated: Oct 14, 2026, 11:55 PM IST
joinshare
IND vs WI Highlights: హైదరాబాద్‌లో భారత్‌కు భారీ షాక్‌.. ఉప్పల్‌లో వెస్టిండీస్‌ అద్భుత విజయం
Image Credit: West Indies Beat India In 4th T20I

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
IND vs WI Highlights: హైదరాబాద్‌లో భారత్‌కు భారీ షాక్‌.. ఉప్పల్‌లో వెస్టిండీస్‌ అద్భుత విజయం

IND vs WI Highlights: హైదరాబాద్‌లో భారత్‌కు భారీ షాక్‌.. ఉప్పల్‌లో వెస్టిండీస్‌ అద్భుత విజయం

2

Vishnu Priya: విష్ణు ప్రియ గ్లామర్‌కు ఇంత డిమాండా.. ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు!

3

షుగర్ లెవెల్స్ అమాంతం తగ్గిపోవాలా? డయాబెటిస్ ఉన్నవారు ఈ కూర ఇలా తింటే చాలు!

4

చికెన్‌లో అత్యంత ప్రమాదకరమైన భాగం ఇదే.. ఇది తింటున్నారా? అయితే వెంటనే ఆపండి!

5

Boddemma Festival: తెలంగాణలోనే ప్రత్యేకం.. బొడ్డెమ్మ పండుగ విశిష్టత గురించి తెలుసా..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

India vs West Indies 4th T20I Highlights: సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే భారత ఆశలకు వెస్టిండీస్‌ గండికొట్టింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కరీబియన్లు గొప్పగా పోరాడుతున్నారు. వన్డే సిరీస్‌ను కోల్పోయిన వేళ పొట్టి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే కసితో విండీస్‌ ఆటగాళ్లు గొప్పగా ఆడుతున్నారు. దాని ఫలితమే హైదరాబాద్‌లో జరిగిన నాలుగో మ్యాచ్‌ ఫలితం. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఉప్పల్‌ స్టేడియంలో శాయ్‌ హోప్‌ సెంచరీతో విధ్వంసం సృష్టించగా.. అటు బౌలింగ్‌తో కీమో పాల్‌ భారత బ్యాటింగ్‌ దళాన్ని కుప్పకూల్చాడు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన విండీస్‌ భారత్‌ను చిత్తు చేసి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. సిరీస్‌ సమం కావడంతో ఈనెల 17వ తేదీన బెంగళూరులో జరగనున్న ఆఖరి మ్యాచ్‌ నిర్ణయాత్మకంగా మారనుంది.

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో బుధవారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. శాయ్‌ హోప్‌ మరోసారి సెంచరీతో చెలరేగి ఆడాడు. ఆరంభం నుంచి బరిలోకి దిగిన హోప్‌ ఆఖరి బంతి వరకు ఆడుతూ అజేయ శతకం బాదాడు. 50 బంతుల్లో 102 పరుగులు చేశాడు. వాటిలో నాలుగు ఫోర్లు ఉండగా.. 9 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 204 స్ట్రైక్‌ రేటుతో ఆడిన హోప్‌ సిరీస్‌ను చేజారకుండా గొప్పగా ఆడాడు.

హోప్‌తో ఓపెనర్‌గా దిగిన జెవెల్‌ ఆండ్రే 21 పరుగులు చేయగా.. షిమ్రాన్‌ హెట్‌మెయిర్‌ 12 బంతుల్లో 33 స్కోర్‌తో రాణించగా.. రావ్‌మెన్‌ పావెల్‌ (24) పర్వాలేదనిపించాడు. ఆఖరులో షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ హోప్‌తో కలిసి చక్కటి భాగస్వామ్యం ఏర్పరచుకుని అతడు 26 బంతుల్లో 49 పరుగులు రాబట్టాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో రాణించాడు. విండీస్‌ బ్యాటర్లను పడగొట్టడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Team India
Cricket
Sports News
Hyderabad
Trending News