Abhishek Sharma Celebrations: ఓపెనర్ అభిషేక్ శర్మ కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. తన ఫామ్‌పై విమర్శలు వస్తున్న వేళ.. న్యూజిలాండ్‌పై మూడో టీ20 మ్యాచ్‌లో బౌండరీల వర్షం కురిపించాడు. విధ్వంసకర సెంచరీతో విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చాడు. అభిషేక్‌తోపాటు వైభవ్ కూడా చెలరేగడంతో కివీస్ నిర్దేశించిన 199 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 13.2 ఓవర్లలోనే పూర్తి చేసి 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో సొంతం చేసుకుంది. మరో రెండు మ్యాచ్‌లు నామమాత్రం అయ్యాయి. ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఏకపక్షం చేసిన అభిషేక్ శర్మ.. శతకం బాదిన అనంతరం గ్రౌండ్‌లో చేసుకున్న సెలబ్రేషన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో భారత్ ముందు 199 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
అనంతరం కేవలం 35 బంతుల్లోనే శతక మైలురాయిని చేరుకున్నాడు. మొత్తంగా 38 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 113 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు వైభవ్ సూర్యవంశీ కూడా 19 బంతుల్లో 45 పరుగులతో రాణించాడు. ఇందులో 4 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. భారత్ కేవలం 5 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసుకుని అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఓపెనర్లు ఇద్దరు తొలి వికెట్‌కు తొలి వికెట్‌కు 133 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించ్ మ్యాచ్‌ను పూర్తిగా ఏకపక్షంగా మార్చేశారు. ఓపెనర్ల విధ్వంసంతో లక్ష్యం చిన్నబోవడంతో భారత్ 13.2 ఓవర్లలోనే విజయాన్ని ముద్దాడింది.
అయితే ఈ మ్యాచ్‌లో అన్నింటికంటే హైలైట్‌గా నిలిచింది అభిషేక్ శర్మ సెంచరీ సెలబ్రేషన్. మెరుపు సెంచరీ పూర్తయిన వెంటనే హెల్మెట్, బ్యాట్ పక్కన పెట్టి గ్రౌండ్‌లోనే పద్మాసనంలో కూర్చున్నాడు. కళ్లు మూసుకుని ధ్యాన ముద్ర వేసి ‘ఓం నమఃశివాయ’ మంత్రాన్ని జపిస్తూ కనిపించాడు. గతంలో ఎన్నడూ చూడని రీతిలో ప్రశాంతంగా.. ఆధ్యాత్మిక భావనతో అభిషేక్ చేసుకున్న ఈ సెలబ్రేషన్‌ను చూసి స్టేడియంలోని ప్రేక్షకులు, సహచర ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుండగా.. నెటిజన్లు "శివతాండవం ఆడి.. శివ ధ్యానంలో మునిగిపోయాడు" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ABHISHEK SHARMA CENTURY (100 ) FROM JUST 35 BALLS https://t.co/ZPLxNB4hc5
— CricDiaries (@abhi_9874) October 27, 2026