YS Bharathi reddy letter to ys Sharmila: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం మరోసారి పీక్స్ కు చేరింది. ఇటీవల వైఎస్ జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కూతురు పెళ్లి నిర్వహించడం ప్రస్తావనపై అభ్యంతరం వ్యక్తం చేస్తు లేఖను విడుదల చేయడం అగ్నికి ఆజ్యం పోసేదిగా మారింది. బెంగళూరు యలహంకలోని ఇల్లు తనదేనని ఇటీవల వైఎస్ జగన్ తెల్చి చెప్పారు. షర్మిల కుమార్తె అంజలిరెడ్డి పెళ్లి చేయడం వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కల్గుతుందని పేర్కొన్నారు.
యలహంకలో ఒకే ప్రాంగణంలో తనతో పాటు షర్మిలకు ఉన్న ఇల్లు కూడా తనదేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో షర్మిల ఇంట పెళ్లి వేళ జగన్ ఆస్తుల వివాదం కాస్త రచ్చగా మారింది. ఇక తాజాగా.. వైఎస్ జగన్ సతీమణి భారతీ రెడ్డి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు ఆస్తుల వివాదంపై మరోసారి ఘాటైన లేఖాస్త్రంను సంధించినట్లు ఒక వార్త వైరల్ గా మారింది.
దీనిలో.. ఇటీవల ఆస్తుల వివాదంపై వైఎస్ భారతీ రెడ్డి లేఖలో వైఎస్ షర్మిలకు తనదైన స్టైల్ లో కౌంటర్ లు వేశారు. ఈ నెల 24న షర్మిలకు లేఖ రాసిన భారతి రెడ్డిలేఖను రాశారు. దీనిలో.. మన కుటుంబంలో ఆస్తులపై చర్చలు, వివాదాలపై లేఖ ద్వారా నీకు స్పష్టత ఇవ్వదలచుకున్నానని పేర్కొన్నారు. బెంగళూరులో ఉన్న కొన్ని నిర్థిష్టమైన ఆస్తులతో నీకెలాంటి సంబంధం, హక్కు లేదని వైఎస్ భారతీ రెడ్డి తెల్చి చెప్పారు. ఆ ఆస్తులు నా పుట్టింటివారు నాకు బహుమతిగా ఇచ్చినవని.. నా స్వయంకృషితో, కష్టార్జితంతో సంపాదించుకున్నవని తెల్చి చెప్పారు.
దీని సంపాదనలో గానీ, నిర్మాణంలో గానీ వైఎస్ కుటుంబానికి ఎలాంటి భాగస్వామ్యం లేదని వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. నా పుట్టింటి వైపు నుంచి వచ్చిన, నా స్వార్జిత ఆస్తులపై నువ్వు హక్కులు కోరడం సరికాదని, దీన్ని వివాదంలోకి లాగడం కూడా సరైందని కాదని వైఎస్ షర్మిలకు, జగన్ సతీమణి వైఎస్ భారతీ రెడ్డి లేఖాస్త్రంను సంధించినట్లు లేఖ కాస్త వార్తలలో నిలిచింది. మరోవైపు ఇది ఫెక్ అని.. కొంత మంది అపోసిషన్ పార్టీ కార్యకర్తలు కావాలని ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు దీన్ని ఖండించారు.