• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘కిల్లర్’ సినిమా టాలీవుడ్ ఒడిస్సీ.. మూవీపై దర్శక, నిర్మాత, నటుడు పూర్వజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

‘కిల్లర్’ సినిమా టాలీవుడ్ ఒడిస్సీ.. మూవీపై దర్శక, నిర్మాత, నటుడు పూర్వజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Killer: జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, ముఖ్యపాత్రల్లో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘కిల్లర్’. సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ ఇతర ముఖ్యపాత్రల్లో యాక్ట్ చేశారు. ఈ నెల 30న విడుదల కానున్న ఈ సినిమాపై చిత్ర నిర్మాత, దర్శకుడు పూర్వజ్ మీడియాతో ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 27, 2026, 06:20 PM IST|Updated: Oct 27, 2026, 06:27 PM IST
joinshare
‘కిల్లర్’ సినిమా టాలీవుడ్ ఒడిస్సీ.. మూవీపై దర్శక, నిర్మాత, నటుడు పూర్వజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Image Credit: Killer Movie (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
KTR: కరువు పరిస్థితులకు రేవంత్ రెడ్డిదే బాధ్యత.. సీఎంపై కేటీఆర్ సెన్సెషనల్ కామెంట్స్..

KTR: కరువు పరిస్థితులకు రేవంత్ రెడ్డిదే బాధ్యత.. సీఎంపై కేటీఆర్ సెన్సెషనల్ కామెంట్స్..

2

Abhishek Sharma Century: ‘ఓం నమః శివాయ’ మంత్రం.. సెంచరీ తరువాత అభిషేక్ శర్మ సెలబ్రేషన్స్ చూశారా..!

3

‘కిల్లర్’ సినిమా టాలీవుడ్ ఒడిస్సీ.. మూవీపై దర్శక, నిర్మాత, నటుడు పూర్వజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

4

Karimnagar: నా భార్య ఫ్రీ బస్సు ఉందని వెళ్లిపోయింది.. పథకంపై కరీంనగర్ వ్యక్తి ఆవేదన.. వీడియో వైరల్..

5

చలికాలంలో చర్మం పగులుతోందా? బామ్మల కాలం నాటి ఈ 5 రహస్య చిట్కాలతో మృదువైన మెరుపు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Killer Director: ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘కిల్లర్’.  ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ డైరెక్ట్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.  ఓవర్సీస్ లో "కిల్లర్" చిత్రాన్ని ఓఎంజి పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన హైలెట్ విశేషాలను మీడియాతో పంచుకున్నాు.

"కిల్లర్" రిచ్ కంటెంట్ ఉన్న సినిమా. సెన్సార్ వాళ్లు యు సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చూశాక సెన్సార్ వాళ్లు ఈ సినిమా చూసి ఆనందం వ్యక్తం చేసినట్టు చెప్పుకొచ్చారు.  మా చిత్రంలో బ్లడ్ షెడ్ లేదు. రక్తం చూస్తే నాకే కళ్లు తిరుగుతాయి.. కథలో హింస ఉన్నా, అది పాత్రలు ఎదుర్కొనే దాంట్లో కనిపించాలి గానీ పాత్రలను చిత్రహింసలు పెట్టినట్లు చూపించడం నాకు నచ్చలేదు. వాంపైర్ పాత్రను కూడా అలాగే అందరు చూసేలా ట్రీట్ చేశామన్నారు. చిత్రంలో  టెర్రరిస్ట్ పాత్ర పది నిమిషాలు కనిపిస్తుంది మళ్లీ కనిపించదు. స్పై, వాంపైర్ పాత్రలు కూడా అలాగే ఉంటాయి. మళ్లీ ఆ పాత్రలు ఎక్కడా కనిపించవన్నారు.  

మా సినిమా టీమ్ లోని వారు మా కిల్లర్ మూవీని క్రిస్టోఫర్ నొలన్ ఒడిస్సీ సినిమాతో పోల్చారు. అది కొంచెం అతి అనిపించవచ్చు కానీ మా మూవీ చూసి బయటకు వచ్చాక ఒడిస్సీతో మీరే పోల్చుకుంటారు. మా సినిమాను ఒడిస్సీతో పోల్చడం ఒక స్పాయిలర్ కూడా. కొన్నేళ్ల కిందట నేను స్క్రూడ్ అనే కాన్సెప్ట్ తో స్టోరీ  రాసుకున్నాను. అదే స్టోరీతో ‘కిల్లర్’ మూవీని తెరకెక్కించినట్టు చెపపారు. ఇది ఫీమేల్ సెంట్రిక్ మూవీ.

మా చిత్రంలో ప్రతి పాత్ర ‘R’ అక్షరంతో స్టార్ట్ అవుతాయి..
కిల్లర్ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఆర్ లెటర్ తోనే స్టార్ట్ అవుతాయి. ప్రాజెక్ట్ రూట్ అనే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కించాము. హీరోయన్ జ్యోతి చేసిన రక్తిక, రనైన, రియా..ఇలా పేర్లు ఆర్ తో ఉంటాయి. ఈ సినిమాకు దర్శకత్వం, నిర్మాత, నటుడిగా మూడు బాధ్యతలు నిర్వహించాను. సినీ ఇండస్ట్రీలో నాకున్న అనుభవం ఈ మూడు రోల్స్ ప్లే చేసేలా ఉపయోగపడ్డాయి. ఇంకో ఆరేడు క్రాఫ్ట్స్ డీల్ చేయాలన్నా చేస్తాను. 
నేను రూపొందించిన మాస్టర్ పీస్, మాటరాని మౌనమిది, శుక్ర సినిమాల్లో కొత్తవాళ్లకే ఛాన్స్ ఇచ్చాను.

సెకండాఫ్ ట్విస్ట్ చెబితే కోటి రూపాయల నజరాన..

మా సినిమా సెకండాఫ్ లో ట్విస్ట్ చెప్పినవారికి కోటి రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించాము. ఇది ప్రమోషనల్ స్టంట్ అనుకుంటారు. ఒక మనిషిని నమ్మడానికి కొన్నేళ్లు పడుతుంది. దీని మీద ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాము. హైకోర్టు లాయర్స్ కూడా అందులో పాల్గొంటారు. ఈ నెల 29న రాత్రి 10 గంటలకు మా మూవీ ప్రీమియర్స్ పడతాయి. 11 గంటలకు ఆ ట్విస్ట్ ఏంటనేది వాట్సాప్ చేయాలి. ఎవరు త్వరగా ఆన్సర్ పంపిస్తే వారి పేరు మా మూవీ సక్సెస్ మీట్ లో ఎల్ ఈడీ స్క్రీన్ మీద డిస్ ప్లే చేస్తాము.  మా సినిమాకు ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని చెప్పాను. కానీ పదీ పదిహేను కోట్లు అని కూడా చెప్పొచ్చు. విజువల్స్, వీఎఫ్ఎక్స్ అంత రిచ్ గా వచ్చాయి. మేము చెప్పినదానికంటే ఇంకా కొన్ని లక్షలు ఎక్కువే బడ్జెట్ అయ్యింది. మేము కోటి రూపాయల గిఫ్ట్ అనౌన్స్ చేయడం జనాల్లోకి విపరీతంగా వెళ్లిపోయింది. మా సినిమా స్టోరీ చెబుతూ నాకు ఇన్ స్టాలో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే అంత ఈజీగా క్లూ అందదు. ఈ నెల 30న రిలీజ్ అవుతున్న సినిమాల్లో రిచ్ కంటెంట్ ఉన్న సినిమా మాది అని చెబుతున్నాము. .

నా ప్రతి సినిమాకు బౌండెడ్ స్క్రిప్ట్ చేసుకుంటా. ఒక సీన్ రాస్తే, ఆ సీన్ ఎన్ని నిమిషాలు ఉంటుందనేది రాసుకుంటా. సినిమా ఎంటైర్ స్క్రీన్ ప్లే కట్ నేను చేసిందే. మరో ఇద్దరు ఎడిటర్స్ కూడా వర్క్ చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్ మీద నేను రాసింది 2 గంటల 10 నిమిషాలు. ఔట్ పుట్ వచ్చింది 2 గంటలు. ప్రతి సీన్ ప్రేక్షకులకు సులువుగా అర్థమవుతుంది. ఈ సినిమాను ఇరవై ఐదు రోజుల్లో చిత్రీకరించాను.


ప్రకృతి ప్రకోపం.. 
నా సినిమాలు రిలీజైనప్పుడు ఏదో ఒక ప్రకృతి విపత్తు వస్తూనే ఉంది. శుక్ర టైమ్ కు థియేటర్స్ క్లోజ్ చేశారు. ఓటీటీలో బాగా పే చేసింది. మాటరాని మౌనమిది కూడా బాగా ఆదరణ పొందింది. ఇప్పుడు కిల్లర్ రిలీజ్ అవుతున్నప్పుడు అర్నాబ్ అని తుఫాన్ లు వస్తున్నాయి. ఏది అయితే అది అయ్యింది అని ఈ నెల 30న రిలీజ్ చేస్తున్నాము. భారీ బడ్జెట్ చిత్రాలకు టికెట్ రేట్స్ పెంచడం ఓకే కానీ అన్ని సినిమాలకు టికెట్ రేట్స్ పెంచడం సబబు కాదు. అది ప్రేక్షకులు ఆలోచించుకోవాలి. సుకుమార్ గారు గొప్ప డైరెక్టర్. ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లర్ లాంటి సినిమాలు ఆయన నుంచి వచ్చేవి. కానీ కమర్షియల్ దారిలోకి వెళ్లడం వల్ల ఆ ఛాన్స్ మనకు మిస్ అయ్యింది.

థ్రిల్లర్ సినిమాలంటే ప్రీ క్లైమాక్స్ వరకు మిమ్మల్ని హుక్ చేసి ఉంచే కంటెంట్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి అన్ని ట్విస్ట్ లు రివీల్ అవుతూ సర్ ప్రైజ్ చేస్తాయి. మా కిల్లర్ కూడా అదే తరహా మూవీ. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ అనే పాయింట్ ను మాస్ ఎలిమెంట్స్ తో కలిపిన కథతో మీకు కన్విన్సింగ్ గా ఉంటుంది.  జ్యోతి పూర్వజ్ కిల్లర్ సినిమాలో పూర్తిగా కొత్తగా చూస్తారు. ఆమె డిఫరెంట్ రోల్స్ లో ఆకట్టుకుంటారు. సింగిల్ టేక్ లో యాక్షన్ సీక్వెన్సులు చేశారు జ్యోతి. ఆమె ప్రతి పాత్రకు తగినట్లు మేకోవర్ అయ్యారు. ఆడియెన్స్ ఆమెను తెరపై చూస్తూ థ్రిల్ అవుతారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News