• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /IND vs WI 1st ODI: భారత్ vs వెస్టిండీస్ వన్డే పోరు.. అందరి కళ్లూ ‘రో-కో’ పైనే.. తుది జట్లు ఇలా..!

IND vs WI 1st ODI: భారత్ vs వెస్టిండీస్ వన్డే పోరు.. అందరి కళ్లూ ‘రో-కో’ పైనే.. తుది జట్లు ఇలా..!

India vs West Indies Playing 11: వన్డే ప్రపంచకప్‌ 2027 సమరానికి సమయం దగ్గరపడుతున్న వేళ సరికొత్త వ్యూహాలతో టీమిండియా మెగా కసరత్తు మొదలుపెట్టింది. వెస్టిండీస్‌తో స్వదేశంలో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌తో భారత్ తమ మిషన్ వరల్డ్ కప్‌ రోడ్‌మ్యాప్‌ను ఆరంభించనుంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా జరిగే తొలి పోరులో గెలుపే లక్ష్యంగా శుభ్‌మన్ గిల్ సేన బరిలోకి దిగుతుండగా.. అందరి చూపు ప్రధానంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపైనే ఉంది.

Written ByAshok Krindinti
Published: Sep 27, 2026, 10:59 AM IST|Updated: Sep 27, 2026, 11:00 AM IST
joinshare
IND vs WI 1st ODI: భారత్ vs వెస్టిండీస్ వన్డే పోరు.. అందరి కళ్లూ ‘రో-కో’ పైనే.. తుది జట్లు ఇలా..!
Image Credit: India vs West Indies (Source: BCCI/X)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

India vs West Indies Playing 11: వన్డే వరల్డ్ కప్‌ 2027కు మరో ఏడాది మాత్రమే సమయం ఉండగా.. టీమిండియా ఈ మెగా టోర్నీకి పక్కాగా రెడీ అవుతోంది. వెస్టిండీస్‌తో స్వదేశంలో మొదలవుతున్న మూడు వన్డేల సిరీస్‌తో వన్డే ప్రపంచకప్‌కు ప్రయాణం మొదలుపెట్టనుంది. ఆదివారం విండీస్‌తో తొలి వన్డే ఆడనుంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ సిరీస్‌ను భారీ విజయంతో ప్రారంభించాలని భారత్ చూస్తోంది. 2026 ఆసియా క్రీడల కోసం శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని టీ20 టీమ్ జపాన్‌లో బరిలో దిగుతోంది. దీంతో వన్డే సిరీస్‌కు అయ్యర్, బుమ్రా వంటి స్టార్లు దూరమయ్యారు. ఈ మ్యాచ్‌లో అందరి చూపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే ఉంది.

కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మతో ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఇంగ్లాండ్‌పై గత వన్డేల్లో సెంచరీతో రాణించిన హిట్ మ్యాన్.. అదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక రన్‌ మెషీన్ విరాట్ కోహ్లీపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. 2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఇద్దరు సీనియర్లు.. మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో సుదీర్ఘంగా ప్రాక్టీస్‌ చేశారు. కరీబియన్ బౌలర్లపై రోహిత్, కోహ్లీలకు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది. కోహ్లీ విండీస్‌పై 66కి పైగా సగటుతో 2,200 పైచిలుకు పరుగులు (9 శతకాలు) సాధించగా.. రోహిత్ శర్మ కూడా 162 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో సహా మెరుగైన గణాంకాలు ఉన్నాయి. ఈ సిరీస్‌లోనూ వీరిద్దరు బ్యాట్ ఝళిపించి జట్టుకు భారీ స్కోర్లు అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో నాలుగో స్థానానికి రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురెల్, నమన్ ధీర్ పోటీలో ఉన్నారు. అయితే అంతర్జాతీయ, దేశవాళీ అనుభవం ఎక్కువగా ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌ వైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపనుంది. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 5వ స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. చాలా రోజుల తరువాత వన్డేల్లో రీఎంట్రీ ఇస్తున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకుతోడు తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి  ఆల్‌రౌండర్‌గా తుది జట్టులో ఉంటాడు. కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్‌గా ఉండనున్నాడు. బుమ్రా గైర్హాజరీలో మహమ్మద్ సిరాజ్ ప్రధాన పేసర్‌గా బాధ్యత తీసుకోనుండగా.. ప్రసిద్ధ్ కృష్ణ, గుర్‌నూర్ బ్రార్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

మరోవైపు షై హోప్ సారథ్యంలోని వెస్టిండీస్ టీమ్ కూడా ఈ సిరీస్‌లో భారత్‌కు షాకివ్వాలని చూస్తోంది. జట్టులో ఎక్కువమంది ఆల్‌రౌండర్లు ఉండడం విండీస్‌కు సానుకూలాంశం. అయితే బలమైన భారత్‌ టీమ్‌కు ఎంత వరకు పోటీనిస్తారో చూడాలి. తిరువనంతపురం పిచ్ బౌలింగ్, బ్యాటింగ్‌కు సమానంగా సహకరిస్తుండడంతో రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగనుంది.

తుది జట్లు ఇలా.. (అంచనా)

భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, గుర్‌నూర్ బ్రార్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.

విండీస్: జాన్ క్యాంప్‌బెల్, షై హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), కీసీ కార్టీ, రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, జస్టిన్ గ్రీవ్స్, మాథ్యూ ఫోర్డ్, గుడకేష్ మోతీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్, షమార్ జోసెఫ్.

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket
Team India
Sports News