Man dies after train hits on railway track in bollaram: ఇటీవల చాలా మంది యువతీ, యువకుల చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అన్ని పనులు చేస్తున్నారు. ఇంట్లో ఉన్నా లేదా రోడ్లమీదకు వచ్చిన చెవిలో ఇయర్ ఫోన్స్ ఉండాల్సిందే. కొన్నిసార్లు రద్దీగా ఉండే ప్రదేశాల్లో కూడా ఇయర్ ఫోన్స్ లను పెట్టుకుని తమ ప్రాణాలను సైతం డెంజర్ లో పడేసుకుంటున్నారు. ఈక్రమంలో రోడ్ల మీద, రైల్వే పట్టాల మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తరచుగా చెబుతుంటారు.
చెవుల్లో ఇయర్‌ఫోన్లు.. వెనుక నుంచి దూసుకొచ్చిన రైలు.. క్షణాల్లో ప్రమాదం హైదరాబాద్ బొల్లారం సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన ఫోన్ మాట్లాడుతూ నడుస్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన రైలు ఢీకొట్టినట్లు సమాచారం. ఇయర్‌ఫోన్ల కారణంగా చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించలేకపోతే ఎంతటి ప్రమాదం ఎదురవుతుందో ఈ ఘటన హెచ్చరిస్తోంది. రైల్వే ట్రాక్‌ల వద్దే కాదు.. రోడ్లపై నడుస్తున్నప్పుడు, బైక్‌లు, కార్లు నడిపేటప్పుడు ఇయర్‌ఫోన్లు వాడటం ప్రమాదకరం. రైలు హారన్‌లు, వాహనాల శబ్దాలు, అంబులెన్స్ సైరన్లు వినిపించకపోవడం వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఒక్క క్షణం నిర్లక్ష్యం కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చొచ్చు. నడుస్తున్నప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు, రైల్వే ట్రాక్‌ల సమీపంలో ఉన్నప్పుడు ఇయర్‌ఫోన్లకు దూరంగా ఉండాలని.. అప్రమత్తతే ప్రాణరక్షణ అని నిపుణులు సూచిస్తున్నారు. #SafetyFirst #RailwaySafety #RoadSafety
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) October 27, 2026
అయిన కూడా కొంత మంది మాత్రం తమతీరును మార్చుకొవడంలేదు. ఈ క్రమంలో బొల్లారంలోని రైల్వే ట్రాక్ సమీంలో ఒక యువకుడు ఫోన్ మాట్లాడుకుంటూ పట్టాల మీద నుంచి వెళ్తున్నాడు. ఇంతలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ బొల్లారం సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి చెవిలో ఇయర్ ఫోన్ లను పెట్టుకుని పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో వెనక నుంచి వచ్చిన ఒక రైలు సదరు వ్యక్తిని బలంగా వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో అతను స్పాట్ లోనే విగత జీవిగా మారిపోయాడు.
పట్టాల మీద వ్యక్తిని చూసి రైల్వే లోకొపైలెట్ అప్పటికే హరన్ మోగించిన కూడా చెవిలో పెట్టుకున్న ఇయర్ ఫోన్స్ కారణంగా అతనికి విన్పించలేదు. దీంతో అతను ఒక్కసారిగా రైలు ప్రమాదంకు గురైయ్యాడు. అప్పటికే బ్రేకులు వేసిన కూడా రైలు సదరు వ్యక్తిని ఢీకొని ఆగిపోయింది. అప్పటికే అతని శరీర భాగాలు పట్టాల మీదచెల్లాచెదురుగా పడ్డాయి.
ఈ క్రమంలో రైల్వే సిబ్బంది పోలీసులకు, అంబులెన్స్ వారికి సమాచారం అందించారు. ఈ ఘటన అక్కడున్న ఒక సీసీకెమెరాలో రికార్డుఅయ్యింది. అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. మరోవైపు రైల్వే ట్రాక్‌ల వద్దే కాదు.. రోడ్లపై నడుస్తున్నప్పుడు, బైక్‌లు, కార్లు నడిపేటప్పుడు ఇయర్‌ఫోన్లు వాడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిలిస్తుందని అలర్ట్ చేస్తున్నారు.