SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

India vs New Zealand Playing 11: నాలుగో వన్డేకు టీమిండియాలో భారీ మార్పులు.. ముగ్గురు ప్లేయర్లు ఎంట్రీ..!

India vs New Zealand Playing 11: కివీస్‌తో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. నాలుగో వన్డేకు తుది జట్టులో మూడు మార్పులతో బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది.

Written By Ashok Krindinti
Published: Nov 12, 2026, 01:23 PM IST | Updated: Nov 12, 2026, 01:34 PM IST
Image Credit: India vs New Zealand Playing 11 (Source: X/BCCI)
Join

India vs New Zealand Playing 11: న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేకు టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు జరగనున్నాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ టెస్ట్ సిరీస్ సన్నద్ధం కోసం చివరి రెండు వన్డేలు ఆడడం లేదు. దీంతో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలిసారి వన్డే జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో.. రెండో వన్డేలో నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. హామిల్టన్‌లో జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. నాలుగో వన్డేలో గెలిచి సిరీస్‌ సొంతం చేసుకోవాలని టీమిండియా చూస్తోంది. మరోవైపు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని న్యూజిలాండ్ భావిస్తోంది.

నాలుగు, ఐదు వన్డేలకు శ్రేయస్ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెనీ బాధ్యతలు ఇషాన్ కిషన్‌కు అప్పగించారు. వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా అతడే చేపట్టనున్నాడు. తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర, యశ్ ఠాకూర్ చివరి రెండు వన్డేల కోసం జట్టుతో చేరారు. గిల్, కేఎల్ రాహుల్ లేకపోవడంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విభాగంలో కీలకంగా మారనున్నారు. ముఖ్యంగా తొలి వన్డేలో 51 బంతుల్లో 74 పరుగులు చేసిన కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. రోహిత్ మాత్రం గత రెండు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

రోహిత్ శర్మతో ఓపెనర్‌గా ఎవరు వస్తారనేది మ్యాచ్ సమయానికి తేలనుంది. కేఎల్ రాహుల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ తుది జట్టులో ఉండడం దాదాపు ఖాయం. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌లలో ఒకరు ఓపెనర్‌గా వస్తే.. మరొకరు ఐదో స్థానంలో ఆడాల్సి ఉంటుంది. అన్షుల్ కాంబోజ్ స్థానంలో మహ్మద్ సిరాజ్ కూడా తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

మరోవైపు న్యూజిలాండ్ జట్టులో కూడా కీలక మార్పులు జరగనున్నాయి. టెస్టు సిరీస్ సన్నాహాల కోసం టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్ జట్టుకు దూరమయ్యారు. డేవాన్ కాన్వే గాయం నుంచి కోలుకుంటుండగా.. లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్ కూడా అందుబాటులో లేరు. ఫిన్ అలెన్, మాట్ హెన్రీ, బ్రెట్ రాండెల్ జట్టులోకి చేరారు.

హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..

ఇప్పటివరకు రెండు జట్లు వన్డేల్లో మొత్తం 126 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 65 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. న్యూజిలాండ్ 52 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. మరో ఎనిమిది మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.  

తుది జట్లు ఇలా (అంచనా)..

భారత్: రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, మహమ్మద్ సిరాజ్, నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్.

న్యూజిలాండ్: విల్ యంగ్, టిమ్ సీఫెర్ట్, నిక్ కెల్లీ, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మిచ్ హే, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), కైల్ జేమీసన్, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, బ్రెట్ రాండెల్.

మ్యాచ్ వివరాలు ఇలా..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES