SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

India vs West Indies: భారత్ vs విండీస్ ‘డూ ఆర్ డై’ పోరు.. భువీ రీఎంట్రీపైనే అందరి కళ్లు..!

India vs West Indies Playing 11: భారత్, వెస్టిండీస్ జట్లు ఐదో టీ20 పోరుకు సిద్ధమయ్యాయి. 2-2తో సమవుజ్జీలుగా నిలిచిన ఇరు జట్లు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో నేడు జరిగే ఆఖరి మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ హై-వోల్టేజ్ పోరులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి.

Written By Ashok Krindinti
Published: Oct 17, 2026, 01:15 PM IST | Updated: Oct 17, 2026, 01:17 PM IST
Image Credit: India vs West Indies Playing 11 (Source: BCCI/X)
Join

India vs West Indies Playing 11: ఉత్కంఠభరితంగా సాగుతున్న భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ క్లైమాక్స్‌కు చేరింది. రెండు జట్లు తలో రెండు మ్యాచ్‌లు గెలవడంతో సిరీస్ 2-2తో సమానంగా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. శనివారం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ పోరు జరగనుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే చిన్నస్వామి పిచ్‌పై మరోసారి పరుగుల సునామీ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండడంతో అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది. భారత బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తున్నా.. బౌలింగ్ విభాగం కలవరపెడుతోంది.

గత మ్యాచ్‌లో సంజూ శాంసన్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విఫలమవ్వడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో వీరిలో ఇద్దరు నిలబడినా భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. ఆఖర్లో తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఫినిషింగ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అక్షర్‌ పటేల్ బౌలింగ్‌లో పర్వాలేదనిపిస్తున్నా.. బ్యాటింగ్‌లో విఫలవ్వడం ఇబ్బందిగా మారింది. ఏటొచ్చి మేనేజ్‌మెంట్‌ను బౌలింగ్ విభాగం కలవరపెడుతోంది. నాలుగో మ్యాచ్‌లో బౌలింగ్ భుజానికి గాయం కావడంతో అర్ష్‌దీప్ సింగ్ ఆడేది అనుమానంగా మారింది. దీంతో సీనియర్ స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్ ఆడకపోతే భూవి తుది జట్టులో ఉండడం ఖాయం. కొత్త బంతితో స్వింగ్ రాబట్టడంలోనూ.. డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేయడంలో భువి అనుభవం జట్టుకు ఎంతో కీలకం కానుంది. యువ పేసర్లు మయాంక్, ప్రిన్స్ యాదవ్‌లతో కలిసి భువి పేస్ భారాన్ని మోయనున్నాడు.

విండీస్ ఊహించని రీతిలో..

ఇక ఈ సిరీస్‌లో కరేబియన్లు ఊహించని రీతిలో బ్యాటింగ్‌లో విరుచుకుపడుతున్నారు. నాలుగో టీ20 మ్యాచ్‌లో 247 పరుగుల భారీ స్కోరు సాధించిన తీరు టీమిండియా బౌలింగ్ బలహీనతలను బయటపెట్టింది. ఆ మ్యాచ్‌లో యువ పేసర్లు మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ చెరో 52 పరుగులు సమర్పించుకున్నారు. విండీస్ కెప్టెన్ షై హోప్, రూథర్‌ఫర్డ్ భీకర ఫామ్‌తో భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారారు. వీరికి తోడు హెట్‌మెయర్, పావెల్, రొమారియో షెఫర్డ్ వంటి విధ్వంసకర హిట్టర్లు ఉండటంతో వారిని కట్టడి చేయడం బౌలర్లకు సవాల్‌గా మారింది.

పిచ్ రిపోర్ట్ ఇలా..

చిన్నస్వామి పిచ్ ఎప్పట్లాగే బ్యాటర్లకు స్వర్గధామం. ఇక్కడ చిన్న బౌండరీలు కావడంతో సిక్సర్ల వర్షం కురవడం ఖాయం. అయితే బెంగళూరులో వర్షం ముప్పు పొంచి ఉండటం అభిమానులను కలవరపెడుతోంది. వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తుది జట్లు ఇలా (అంచనా)

భారత్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్/భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.

వెస్టిండీస్: షై హోప్ (కెప్టెన్/కీపర్), జ్యువెల్ ఆండ్రూ, షిమ్రాన్ హెట్‌మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెఫర్డ్, రోస్టన్ చేజ్, కీమో పాల్, షామర్ స్ప్రింగర్, గుడాకేష్ మోటీ, షామర్ జోసెఫ్.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES