• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Asian Games 2026: ఫైనల్‌ పోరులో భారత్ చేతిలో శ్రీలంక విలవిల.. 147 పరుగులతో రికార్డు విజయం..!

Asian Games 2026: ఫైనల్‌ పోరులో భారత్ చేతిలో శ్రీలంక విలవిల.. 147 పరుగులతో రికార్డు విజయం..!

Indian Women Cricket Team: ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. ఫైనల్ పోరులో శ్రీలంకపై 147 పరుగుల భారీ తేడాతో ఏకపక్ష విజయం సాధించి.. దేశానికి గర్వకారణంగా నిలుస్తూ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి ఆసియా క్రీడల ఛాంపియన్‌గా అవతరించింది.

Written ByAshok Krindinti
Published: Sep 22, 2026, 05:25 PM IST|Updated: Sep 22, 2026, 05:28 PM IST
joinshare
Asian Games 2026: ఫైనల్‌ పోరులో భారత్ చేతిలో శ్రీలంక విలవిల.. 147 పరుగులతో రికార్డు విజయం..!
Image Credit: Indian Women Cricket Team (Source: X)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Indian Women Cricket Team: 2026 ఆసియా గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో చిత్తు చేసి దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. షఫాలీ వర్మ (48), స్మృతి మంధాన (79), రిచా ఘోష్ (49) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారత్ 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. 69 పరుగులకే కుప్పకూలింది. భారత్‌కు ఇది టీ20 ఫార్మాట్‌లో అతిపెద్ద గెలుపు. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి ఆసియా గేమ్స్‌ ఛాంపియన్‌గా నిలిచింది.

217 టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక ఆరంభం నుంచే తడపడింది. కెప్టెన్ చమరి అటపట్టు, ఇమేషా దులానీ ఇన్నింగ్స్‌ను ఆరంభించగా.. తొలి వికెట్‌కు 18 పరుగులు జోడించారు. బ్యాటింగ్‌లో అదరగొట్టిన షెఫాలీ వర్మ.. బంతితోనూ చెలరేగింది. పవర్‌ప్లేలో దులానీ (3), హసిని పెరీరా (0)లను అవుట్ చేసి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత దీప్తి శర్మ, శ్రీ చరణీ వరుసగా వికెట్లు తీయడంతో శ్రీలంక ప్లేయర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. ఏ దశలోనూ లంక బ్యాటర్లు భారత బౌలింగ్ దాడికి ఎదురు నిలవలేకపోయారు. దీంతో చివరికి 15.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే ఆలౌట్ అయి శ్రీలంక జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా.. షఫాలీ వర్మ, శ్రేయాంక పటేల్, శ్రీచరణి తలో రెండు వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 10 ఓవర్లలోనే 99 పరుగులు జోడించారు. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన షఫాలీ వర్మ (48) ఈ మ్యాచ్‌లో తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది. మరో ఎండ్‌లో స్మృతి మంధాన మాత్రం సిక్సర్ల వర్షం కురిపించింది. 45     బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 పరుగులు చేసి ఔట్ అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 19 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకుంది. ఆ తరువాత వికెట్ కీపర్ రిచా ఘోష్ పవర్ హిట్టింగ్‌తో అలరించింది. కేవలం 22 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. రిచా బాదుడుతో టీమ్ ఇండియా శ్రీలంకకు 20 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికి 217 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
 
ఆసియా క్రీడల్లో ఇది ఒక చారిత్రాత్మక విజయంగా చెప్పవచ్చు. గత రెండు రోజులుగా ఆసియా క్రీడల్లో భారత్‌కు ఒక్క స్వర్ణం కూడా రాలేదు. క్రికెట్ విభాగంలో భారత మహిళల జట్టు స్వర్ణ పతకం గెలుచుకోగా.. రన్నరప్‌గా నిలిచిన శ్రీలంక జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. మరోవైపు పాకిస్థాన్ మహిళల జట్టు మూడవ స్థానంతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket
Team India