• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌కు యశస్వి జైస్వాల్ గుడ్‌ బై..? పోటీలోకి రేసులోకి మరో రెండు జట్లు..!

IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌కు యశస్వి జైస్వాల్ గుడ్‌ బై..? పోటీలోకి రేసులోకి మరో రెండు జట్లు..!

Yashasvi Jaiswal Trade: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గురించి కొత్త ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకున్నా.. జైస్వాల్ మాత్రం జట్టు మారాలని భావిస్తున్నట్లు సమాచారం. లక్నో, ఢిల్లీతో ఇప్పటికే ట్రేడ్ చర్చలు జరిగినా ఒప్పందం కుదరలేదు. ఇప్పుడు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వివరాలు ఇలా..

Written ByAshok Krindinti
Published: Nov 19, 2026, 19:03 IST|Updated: Nov 19, 2026, 19:06 IST
joinshare
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌కు యశస్వి జైస్వాల్ గుడ్‌ బై..? పోటీలోకి రేసులోకి మరో రెండు జట్లు..!
Image Credit: IPL 2027 Mini Auction (Source: File)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Yashasvi Jaiswal Trade: ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి రిటెన్షన్ గడువు ముగిసింది. అన్ని జట్లు తమకు వద్దనుకున్న ప్లేయర్లను రిలీజ్ చేసి.. రిటెన్షన్ జాబితాను ప్రకటించాయి. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు విషయంలో మాత్రం ఇంట్రెస్టింగ్ విషయం తెరపైకి వచ్చింది. స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ఫ్రాంచైజీ రిటైన్ చేసినా.. అతడు జట్టును వీడే అవకాశాలు ఇంకా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో ట్రేడ్ గురించి చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు. జైస్వాల్ స్థానంలో మరో ఆటగాడి కోసం కూడా రాజస్థాన్ అన్వేషణ సాగిస్తున్నట్లు సమాచారం.

రిటెన్షన్ జాబితాలో యశస్వి జైస్వాల్ పేరును రాజస్థాన్ రాయల్స్ ప్రకటించడంతో అతడు వచ్చే సీజన్‌లోనూ ఇదే జట్టు తరఫున ఆడతాడని అందరూ అనుకుంటున్నారు. కానీ రిటెన్షన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా జైస్వాల్ భవిష్యత్‌పై చర్చలు కొనసాగుతున్నాయి. ఫ్రాంచైజీ నుంచి బయటకు వెళ్లేందుకు జైస్వాల్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. గత రెండు నెలలుగా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం జైస్వాల్‌ను ట్రేడ్ చేసే అంశంపై కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఏ ఒక్క ప్రతిపాదన కూడా ఇప్పటివరకు ఖరారు కాలేదు.

జైస్వాల్‌ను తమ జట్టులోకి తీసుకోవడానికి లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తి చూపింది. రిటెన్షన్ గడువు ముగిసే వరకు ఇరు ఫ్రాంచైజీల మధ్య చర్చలు కొనసాగాయి. అయితే జైస్వాల్‌కు బదులుగా ఇద్దరు ఆటగాళ్లను ఇవ్వాలని రాజస్థాన్ కోరగా.. లక్నో ఆ ప్రతిపాదనకు అంగీకరించకపోవడంతో డీల్ ముందుకు సాగలేదు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా జైస్వాల్‌పై ఆసక్తి చూపినట్లు సమాచారం. కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు మంచి ఓపెనర్ కావాలనే ఉద్దేశంతో ఢిల్లీ యాజమాన్యం రాజస్థాన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన ఆటగాళ్ల ప్రతిపాదనలు రాజస్థాన్‌కు నచ్చకపోవడంతో ఈ చర్చలు కూడా ఫలించలేదు.

జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్‌ జట్టుతో 2020 నుంచి కొనసాగుతున్నాడు. ఆ ఫ్రాంచైజీ జైస్వాల్‌లోని టాలెంట్‌ను గుర్తించి ఎంతోగానో ప్రోత్సహించింది. వైభవ్ సూర్యవంశీతో కలిసి గత రెండు సీజన్లలో జైస్వాల్ అదిరిపోయే ఆరంభాలను అందించాడు. అయితే గత సీజన్‌లో రియాన్ పరాగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో జైస్వాల్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో పరాగ్ నాయకత్వంలో రాజస్థాన్ మూడో స్థానంలో నిలిచింది. కొత్త మేనేజ్‌మెంట్ కూడా పరాగ్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే జైస్వాల్ మరో ఫ్రాంచైజీకి వెళ్లాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముంబై ఇండియన్స్ కూడా జైస్వాల్ కూడా ఆసక్తి చూపినట్లు ప్రచారం జరిగింది. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ పేరు కూడా తెరపైకి వస్తోంది. ప్రస్తుతం జట్టును పునర్నిర్మించుకునే పనిలో ఉన్న కేకేఆర్.. జైస్వాల్ కోసం ప్రయత్నించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఫ్రాంచైజీలతో ఎలాంటి ఒప్పందం ఖరారు కాలేదు. సరైన ట్రేడ్ ప్రతిపాదన వస్తేనే ఈ విషయంలో ముందడుగు వేసే అవకాశం ఉంది.

రిటెన్షన్ పూర్తయినా జైస్వాల్ జట్టు మారొచ్చా..?

ఐపీఎల్ 2027 రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా యశస్వి జైస్వాల్ మరో జట్టుకు మారే అవకాశం ఉందా..? అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. సాధారణంగా రిటెన్షన్ జాబితా ప్రకటించిన తర్వాత ఆటగాళ్ల మార్పులకు అవకాశం ఉండదని భావిస్తారు. కానీ ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. రిటెన్షన్ గడువు ముగిసినా ట్రేడింగ్ విండో తెరిచి ఉన్నంతవరకు ఆటగాళ్లను బదిలీ చేసుకోవచ్చు. అంటే రాజస్థాన్ రాయల్స్ జైస్వాల్‌ను రిటైన్ చేసినా.. మరో ఫ్రాంచైజీతో ఒప్పందం కుదిరితే ట్రేడ్ చేయవచ్చు. ఇందుకు రెండు జట్ల మధ్య అంగీకారం కుదరాలి. ఆటగాడి సమ్మతి.. బీసీసీఐ నిర్దేశించిన ప్రక్రియ కూడా పూర్తవ్వాలి. డిసెంబర్ 16న గోవాలో ఐపీఎల్ 2027 మినీ వేలం జరగనుంది. 

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket
IPL