• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /IPL చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ గా తప్పుకున్న ధోనీ.. CSK మెంటార్‌గా కొత్త బాధ్యతలు..

IPL చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ గా తప్పుకున్న ధోనీ.. CSK మెంటార్‌గా కొత్త బాధ్యతలు..

MS Dhoni Retirment: ఐపీఎల్ (Indian Premier League) నుంచి మహేంద్రసింగ్ ధోనీ తప్పుకున్నారు. యువతరాన్ని ప్రోత్సహించి...అద్భుతాలను ఆవిష్కరించేందుకు కొత్త అవతార ఎత్తబోతున్నారు. ఇక నుంచి CSK మార్గదర్శకుడిగా జట్టును మరింత గొప్పగా తీర్చి దిద్దబోతున్నారు. టీ20 క్రికెట్ తో ఆటతీరునే మార్చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ధోనీది పాత్ర. ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ను ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిపారు. రైల్వే టిక్కెట్ ఎగ్జామినర్ క్రికెట్ ప్లేయర్ గా ఎలా మారారు? క్రికెట్లో ఎలా రాణించారు? ఐపీఎల్ లో ధోనీ పాత్ర ఏంటి? కెప్టన్ గా ఆయన ఏంసాధించారు? ఆయన ప్రస్థానం ఏ విధంగా సాగిందనేది అందరికీ ఆదర్శం.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 18, 2026, 00:06 IST|Updated: Nov 18, 2026, 16:10 IST
joinshare
IPL చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ గా తప్పుకున్న ధోనీ.. CSK మెంటార్‌గా కొత్త బాధ్యతలు..
Image Credit: MS Dhoni (Source/File)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

MS Dhoni Life Jouney: మహేంద్ర సింగ్ ధోనీ… పేరు.. క్రికెట్ చరిత్రలో రికార్డ్…ప్లేయర్ గా టీమిండియాకు వరం అనే చెప్పాలి. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మైలురాయిగా మారాడు. సుధీర్ఘకాలం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించి… ఐదు సీజన్లలో ఛాంపియన్ గా నిలిపాడు. టీమ్ విజయాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇపుడు  చెన్నై సూపర్ కింగ్స్ కు ప్లేయర్ గా తప్పుకుని, మెంటార్ గా టీమ్ ను రాటుదేల్చబోతున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైనప్పటినుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా  ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆటగాడిగా టీమ్ విజయాల్లో ధోనీ కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ గా జట్టును విజయపథంలో నడిపించి చారిత్రక రికార్డు సొంతం చేసుకున్నారు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఎప్పుడూ అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రయత్నించిన ధోనీ సారథ్యానికి మంచి గుర్తింపు దక్కింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్  తరఫున ఆడిన ధోనీ, ఓటమి అంచున చేరిన సమయంలో తన ఆటతీరుతో మలుపుతిప్పి అనూహ్య విజయాలను అందించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారధిగా తిరుగులేని విజయాలతో 5 సార్లు ఛాంపియన్ గా నిలిపాడు. 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో చెన్నైసూపర్ కింగ్స్ ప్రత్యర్థి జట్లను వణికించింది. ఛాంపియన్‌గా  ఐపీఎల్ ట్రోఫీలను కైవసం చేసుకుంది.

జార్ఖండ్ నుంచి అంతర్జాతీయ స్థాయికి.. 
మహేంద్రసింగ్ ధోనీ.. జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి వచ్చి క్రికెట్ ప్రపంచం సరికొత్త చరిత్ర సృష్టించాడు. దశాబ్దన్నర క్రితం పవర్ హిట్టర్లు అంటే.. వెస్టిండీస్, ఆస్ట్రేలియా క్రికెటర్లనే ఎక్కువగా చూపించేవారు. కానీ.. విదేశీ క్రికెటర్లకి ఏమాత్రం తీసిపోని విధంగా బంతిని భారతీయులు కూడా బలంగా బాదగలరని ధోనీ నిరూపించాడు. క్రికెట్లోకి అడుగుపెట్టక ముందు ధోనీ రైల్వే టిక్కెట్ ఎగ్జామినర్ గా పనిచేసేవారు.

ప్రారంభంలో తడబడ్డ ధోని.. 
జార్ఖండ్‌కు చెందిన మహేంద్ర సింగ్ ధోనీ, అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. పొడవాటి జులపాల జుట్టుతో, దృఢమైన శరీరంతో ఉన్న 22 ఏళ్ల ధోనీ భారత కెరీర్ ప్రారంభమైంది. క్రీజులో నిలబడి బ్యాటుతో బాల్ ను బౌండరీలకు తరలించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నాడు.

బంగ్లాదేశ్ మ్యాచ్ తో ధోనీ ఆరంగేట్రం..
డిసెంబరు 23, 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన ధోని తొలి మ్యాచ్‌లోనే డకౌటయ్యాడు.  ఆ తర్వాత వరుసగా తక్కువ స్కోర్లు చేశాడు. అయినప్పటికీ, సెలెక్టర్లు,  అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ అతనితోనే కొనసాగాలని నిర్ణయించుకుని, అతనికి సుదీర్ఘ అవకాశం ఇచ్చారు. పాకిస్థాన్‌తో జరిగిన తన ఐదవ వన్డేలో, ధోనీ  ఆకర్షణగా నిలిచాడు. సాహసోపేతమైన స్ట్రోక్-ప్లేతో వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. విశాఖపట్నం వేదికగా సెంచరీతో చెలరేగాడు. 148 పరుగులు చేసి విధ్వంసం సృష్టించడంతో, పాకిస్థాన్ జట్టు అతని ఈ విధ్వంసాన్ని అస్సలు ఊహించలేదు. ఆ తర్వాత 2005లో,  మరో అడుగు ముందుకు వేసి, జైపూర్‌లో 183 పరుగుల విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడి, 300 పరుగుల ఛేదనను శ్రీలంక బౌలింగ్ దాడిని చిత్తు చేశాడు.

మూడు ఐసీసీ టోర్నమెంట్‌లు గెలిచిన కెప్టెన్‌గా ధోని..

క్రికెట్ ప్రపంచంలోనే ధోనీ తరహాలో మ్యాచ్‌ని ఆఖరి ఓవర్లలో ఎవరూ ఫినిష్ చేయలేదు.. చేయలేరని క్రికెట్ దిగ్గజాలు సైతం అంగీకరించిన వాస్తవం. అంతలా మ్యాచ్‌ల్ని ముగించడంలో ధోనీ తన మార్క్ చూపించాడు.రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీ నుండి వైదొలగిన తర్వాత సచిన్ టెండూల్కర్ , రాహుల్ ద్రవిడ్ వంటి సీనియర్ ఆటగాళ్లు ధోనీ పేరును కెప్టెన్సీకి సిఫార్సు చేశారు. మహేంద్ర సింగ్ ధోనీ పరిణతి చెందిన ఆలోచనా విధానం, చురుకైన , తెలివైన క్రికెట్ మేధస్సుతో దిగ్గజాల అభినందనలు అందుకున్నాడు. టీమిండియా కెప్టన్ గా మహేంద్ర సింగ్ ధోనీ జట్టును విజయ పథంలో నడిపించి మంచి పేరు సంపాదించారు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2007లో భారత్‌కి టీ20 ప్రపంచకప్ అందించిన ధోని.. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ 2011లో వన్డే ప్రపంచకప్‌ని టీమిండియా గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత టెస్ట్ క్రికెట్లో ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్‌ని విజేతగా నిలిపి.. క్రికెట్ ప్రపంచంలోనే మూడు ఐసీసీ టోర్నమెంట్‌లు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా తిరుగులేని రికార్డును సొంతం చేసుకున్నాడు.

వికెట్ కీపర్‌గా కీలక విజయాలు అందించిన ఆటగాడు..

ఆటతీరులో చురుగ్గా వ్యవహరించడంలో ధోనీ ప్రత్యేకత. వికెట్ కీపర్‌గా ధోనీకి కెరీర్ ఆరంభం నుంచి తిరుగులేని వ్యక్తిగా రాణించాడు. క్షణాల వ్యవధిలో బెయిల్స్‌ను గీరాటేసే ధోనీ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కదలికలకి అనుగుణంగా బౌలర్లకి సూచనలు ఇవ్వగల జ్ఞాని. కెప్టెన్సీ బాధ్యతల నుంచి  తప్పుకున్నా..  ఆటగాడిగా కొనసాగుతూ మైదానంలో సూచనలు, సలహాలతో ధోనీ వ్యూహాలను అమలు చేసి అద్భుత ఫలితాలను టీమిండియా సొంతంచేయడంలో కీలక పాత్రపోషించారు.

2004లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ధోనీ ఎంట్రీ..

కెరీర్‌ ఆరంభంలో జులపాల జట్టుతో ప్రత్యేక ఆకర్షణగా కనిపించిన ధోనీ భారీ సిక్సర్లు బాదుతుంటే..? పాకిస్థాన్ ప్రధాని సైతం ఫిదా అయిపోయి ప్రశంసలు కురిపించాడు. 2004 నుంచి టీమిండియాలో వికెట్ కీపర్, ఫినిషర్, కెప్టెన్, బౌలర్లకి సూచనలు, కెప్టెన్‌కి సలహాలివ్వడం.. ఇలా బాధ్యత ఏదైనా..? ధోనీ ప్రత్యేక గుర్తింపు పొందారు. టీమిండియా తక్కువ పరుగులకే ఆలౌటైనా… ప్రత్యర్థి జట్టును బోల్తాకొట్టించి డిఫెండ్ చేసుకోవడంలో ధోనీ మంత్రాంగానికి తిరుగులేదని నిరూపించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న జట్లు అతని మెరుపు ఇన్నింగ్స్‌లను ఎదుర్కోవడానికి మార్గం వెతుకుతున్నప్పటికీ, పేస్, సీమ్, స్వింగ్ ,స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే టెక్నిక్‌తో ధోనీ టెస్టుల్లో కూడా ఒక నమ్మకమైన బ్యాట్స్‌మన్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. తన 5వ టెస్టులో, యాదృచ్ఛికంగా పాకిస్థాన్‌పై మ్యాచ్‌ను కాపాడటానికి అసాధారణమైన నిబ్బరంతో మరో 148 పరుగులు చేసి, ఒక బ్యాట్స్‌మన్‌గా తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాడు. జట్టులో వరుసగా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌లను ప్రయత్నించిన తర్వాత, ధోనీ చివరకు జట్టులో ఒక కీలక ఆటగాడిగా స్థిరపడ్డాడు - ఇన్నింగ్స్ చివర్లో కేవలం మెరుపు ఇన్నింగ్స్‌లకే పరిమితం కాకుండా, అంతకంటే ఎక్కువ చేయగల శక్తివంతమైన పిన్చ్-హిట్టర్‌గా, జట్టులో అత్యంత నమ్మకమైన వికెట్ కీపర్‌గా నిలిచాడు.

చెన్నై సూపర్ కింగ్స్ లో తిరుగులేని ఆటగాడిగా, వ్యూహకర్త..

మహేంద్రసింగ్ ధోనీ.. సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 90 టెస్టులాడిన ధోని.. 350 వన్డేలు, 98 టీ20లు, 278 ఐపీఎల్ మ్యాచులు ప్లేయర్ గా కీ రోల్ పోషించాడు. 350 వన్డేలాడినా.. సగటు 50.58గా నమోదు చేయడం ఆటతీరులో నిలకడకి నిదర్శనం. క్రికెట్‌లో ఇన్ని ఘనతలు సాధించినా.. ధోనీకీ విమర్శల బాధ తప్పలేదు. గత ఏడాది పేలవ ప్రదర్శన కారణంగా కనీసం ప్రపంచకప్ జట్టులో కూడా చోటు దక్కదంటూ కొంత మంది మాజీ క్రికెటర్లు వెటకారంగా మాట్లాడారు. కానీ.. విమర్శలకి నోటితో కాకుండా బ్యాట్‌తో బదులివ్వడం ధోనీకి అలవాటే. ఈ ఏడాది ఆరంభంలోనే ఆస్ట్రేలియాపై వన్డేల్లో హ్యాట్రిక్ అర్ధశతకాలతో మళ్లీ ఫామ్ అందుకున్న ధోనీ.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. మొత్తంగా.. టీమ్‌కి తాను అవసరం లేదు అనుకుంటే.. రిటైర్మెంట్ ప్రకటించడానికి క్షణం కూడా ధోనీ ఆలోచించలేదు.

టెస్ట్ క్రికెట్ లో 90 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 4,876 పరుగులు చేశారు. 6 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు చేసి 2014లో టెస్టు మ్యాచులకు దూరమయ్యాడు. 350 వన్డే మ్యాచ్‌లు ఆడిన ధోనీ 10వేల 773 పరుగులు పరుగులు చేశారు. 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలతో కీలక ప్లేయర్ గా రాణించాడు. 98 టీ20 మ్యాచుల్లో 1,617 పరుగులు చేశారు. ఎవ్వరూ ఊహించని విధంగా  2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ విషయానికి వస్తే 278 మ్యాచుల్లో 5439 పరుగులు చేశారు. టీమిండియా 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013 టెస్ట్ క్రికెట్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీల ధోనీ సారథ్యంలోనే సాధ్యమయ్యాయి. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్లో మూడు ప్రధాన ట్రోఫీలను సాధించిన ఏకైక భారతీయ కెప్టెన్‌గా మహేంద్ర ధోనీ చెక్కుచెదరని రికార్డు సొంతం చేసుకున్నారు.

2017లో టీ20 కెప్టెన్‌గా వైదొలిగిన ధోని..

2017 జనవరి 4న, ధోనీ భారత వన్డే మరియు టీ20 జట్ల కెప్టెన్సీ నుండి వైదొలిగాడు, దీంతో భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. తొమ్మిదేళ్లకు పైగా ఆట యొక్క అన్ని ఫార్మాట్లలో ఉత్సాహంతో  నైపుణ్యంతో జట్టుకు నాయకత్వం వహించిన ధోనీ, తన అంతర్జాతీయ క్రికెట్ చివరి అంకంలో కెప్టెన్సీ యొక్క భారీ భారం లేకుండా, ఒక స్వచ్ఛమైన బ్యాట్స్‌మన్‌గా స్వేచ్ఛగా ఆడాలని నిర్ణయించుకున్నాడు.

వికెట్ల వెనుక అతని చాకచక్యం, కొత్త నాయకులకు సహాయపడే వ్యూహాత్మక చతురత జట్టుకు అమూల్యమైనవి అయినప్పటికీ, పరుగుల కొరత, తగ్గుతున్న స్ట్రైక్-రేట్ స్పష్టంగా కనిపించడం ప్రారంభించాయి, దీంతో 2018 చివరలో ధోనీ టీ20ల వైదొలిగారు. 2018 ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించారు. 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో ఎదురైన తీవ్ర నిరాశ తర్వాత, ధోనీ భారతదేశం తరపున ఏ అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. 2020 ఆగస్టు 15న, తన గ్లోవ్‌వర్క్‌తో బ్యాట్స్‌మెన్‌లను ఎలాగైతే అప్రమత్తం చేస్తాడో, అలాగే ఎంఎస్ ధోనీ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తన అంతర్జాతీయ రిటైర్మెంట్‌ను ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ప్రతిభావంతుడైన  క్రికెట్ ప్లేయర్ ధోనీని 2008లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, 2009లో  పద్మశ్రీ, 2018లో పద్మ భూషణ్ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. తాజాగా 2027 ఐపీఎల్ సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్లేయర్ గా తప్పుకుంటున్నట్లు ధోనీ ప్రకటించారు. అదే టీమ్ కు ఇకనుంచి గురువుగా  వ్యవహరిస్తారని చైన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ప్రకటించి ధోనీ అభిమానులను సంతృప్తి పరిచింది.

(రచయత.. మునిరాజ్ జీ న్యూస్ డెస్క్ సౌజన్యంతో)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket
National News
Telugu News
Trending News