Kavya Maran Marriage: క్రీడా ప్రపంచంలో.. వ్యాపారంలో అందంతోపాటు తన సక్సెస్‌తో నిత్యం వార్తల్లో నిలిచే సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సీఈఓ కావ్య మారన్.. తన సంగీతంతో కుర్రకారుతోపాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించే స్టార్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఇద్దరూ ఒక్కటీ కాబోతున్నారు. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని.. డేటింగ్లో ఉన్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుండగా అది వాస్తవమేనని తేలింది. ఎట్టకేలకు వారిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు. కావ్య మారన్, అనిరుధ్ వివాహంపై అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే కావ్య, అనిరుధ్ కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా వారి వివాహానికి పెళ్లి పత్రికలు పంచుతుండగా ఈ విషయం బయటపడింది.
వివాహా ఆహ్వానంతో బహిర్గతం
తమ కుమార్తె కావ్య మారన్ వివాహానికి సంబంధించి పెళ్లి పత్రికలను పలువురు ప్రముఖులకు ఆమె కుటుంబసభ్యులు ఇస్తూ వివాహా వేడుకకు ఆహ్వానం పలుకుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రితోపాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వివాహా ఆహ్వానం అందించారు. కావ్య మారన్ తండ్రి, సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ దంపతులు హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసానికి వచ్చి.. తమ కుమార్తె కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని ఆహ్వానించారు. నవంబర్ 21వ తేదీన చెన్నైలో కావ్య మారన్–అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్ జరగనుందని కేటీఆర్, శైలిమ దంపతులకు చెప్పారు. ఈ సందర్భంగా వివాహా రిసెప్షన్ ఆహ్వాన పత్రిక అందజేశారు.
వివాహం ఎప్పుడూ?
అయితే వివాహ రిసెప్షన్‌కు మాత్రమే ఆహ్వానం రాగా మరి వివాహం ఎప్పుడు? ఎక్కడ జరుగుతుందనేది స్పష్టత రాలేదు. కాగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న ప్రకారం కావ్య మారన్, అనిరుధ్ వివాహం నవంబర్ 11వ తేదీన విదేశాల్లో జరగుతుందని తెలుస్తోంది. కొద్ది మంది బంధుమిత్రులు, పలువురు ప్రముఖుల సమక్షంలో అనిరుధ్, కావ్య మారన్ వివాహం గ్రీస్‌లో జరగనుందని సమాచారం. వివాహమైన మూడు రోజుల అనంతరం చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్లో రిసెప్షన్ ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. అయితే వివాహంపై మాత్రం ఇరు కుటుంబాలు ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో కావ్య మారన్‌తో ప్రేమ, పెళ్లి వ్యవహారంపై చర్చ జరగ్గా వాటిని అనిరుధ్ తేలికగా తీసిపారేశారు. అయితే వీరిద్దరికి ఎక్కడ పరిచయమైంది? ప్రేమించుకున్నారా? పెద్దలు కుదిర్చిన వివాహమా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శైలిమ దంపతులను కలిసిన సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ దంపతులు కుమార్తె కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం నవంబర్ 21న చెన్నైలో కావ్య మారన్–అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్ #KTR #KavyaMaran #Anirudh https://t.co/dOCMvDPs5e
— citizenspulse (@citizenspulse01) October 16, 2026
వీరిద్దరి పరిచయం ఎలా?
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.. కొన్నాళ్లుగా వారిద్దరి మధ్య జరిగిన పరిణామాలు పరిశీలిస్తే ఐపీఎల్ మ్యాచ్‌ల ద్వారా కావ్య మారన్, అనిరుధ్ రవిచంద్రన్ మధ్య పరిచయమైందని తెలుస్తోంది. అంతేకాకుండా కావ్య తండ్రి కళానిధి మారన్ సినీ నిర్మాతగా కొనసాగుతున్నారు. ఆ సినిమాలకు అనిరుధ్ సంగీతం అందించాడు. ఆ సినిమాలు భారీ హిట్ కావడంతో అనిరుధ్ తో కళానిధి మారన్ చక్కటి అనుబంధం ఏర్పడింది. ఇక ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సీఈఓగా కావ్య మారన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమ ఫ్రాంచైజ్‌కు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు.. సన్‌రైజర్స్‌కు సంబంధించి పాటలు రూపొందించడం.. ఐపీఎల్ మ్యాచ్‌లలో అనిరుధ్ ప్రదర్శనలు ఇచ్చిన సందర్భాల్లో కావ్య మారన్‌తో పరిచయమైందని.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని అర్థమవుతోంది. ఇద్దరూ తమిళనాడుకు చెందిన వారే కావడంతో వారిద్దరి మధ్య మరింత బంధం బలపడిందని సమాచారం. అనిరుధ్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండడంతో కావ్య మారన్ కుటుంబసభ్యులు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా కావ్య మారన్, అనిరుధ్ ఒక్కటవుతున్నారని చర్చ జరుగుతోంది.