• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /MS Dhoni Net Worth: ఐపీఎల్‌ నుంచి ఎంఎస్ ధోనీ ఎంత సంపాదించాడో తెలుసా..! మొత్తం నెట్‌వర్త్ ఎంతంటే..?

MS Dhoni Net Worth: ఐపీఎల్‌ నుంచి ఎంఎస్ ధోనీ ఎంత సంపాదించాడో తెలుసా..! మొత్తం నెట్‌వర్త్ ఎంతంటే..?

MS Dhoni IPL Earnings: హెలికాప్టర్ షాట్లతో ప్రత్యర్థులను హడలెత్తించి.. తన కెప్టెన్సీతో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించి.. కోట్లాది అభిమానుల గుండెల్లో 'తల'గా నిలిచిన ఎంఎస్ ధోనీ ఆటగాడిగా ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. 19 సీజన్ల సుదీర్ఘ ప్రయాణంలో ధోనీ ఎంత సంపాదించాడు..? ఒక్కో సీజన్‌లో అందుకున్న పారితోషికం ఎంత..? మొత్తం నెట్‌వర్త్ ఎన్ని వందల కోట్లు..? పూర్తి వివరాలు ఇలా..

Written ByAshok Krindinti
Published: Nov 17, 2026, 16:22 IST|Updated: Nov 17, 2026, 16:27 IST
joinshare
MS Dhoni Net Worth: ఐపీఎల్‌ నుంచి ఎంఎస్ ధోనీ ఎంత సంపాదించాడో తెలుసా..! మొత్తం నెట్‌వర్త్ ఎంతంటే..?
Image Credit: MS Dhoni IPL Earnings (Source: AI Generated)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

MS Dhoni IPL Earnings: క్రికెట్ ప్రపంచంలో రికార్డులు సృష్టించిన ఆటగాళ్లు ఎందరో ఉంటారు.. కానీ ఒక లీగ్ చరిత్రనే తన పేరుతో గుర్తుండిపోయేలా చేసుకున్నవారు కొందరే..! అలాంటి అరుదైన ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకరు. ఎంఎస్‌ ధోనీ గ్రౌండ్‌లోకి అడుగుపెడితే ప్రత్యర్థులకు వణుకు.. చివరి బంతి వరకు ఓటమికి తలవంచని పోరాటం.. కెప్టెన్‌గా వ్యూహాలు రచిస్తే జట్టుకు విజయంపై ధీమా.. ఇలా ఐపీఎల్‌కు కొత్త అర్థం చెప్పిన 'తల' ధోనీ ఆటగాడిగా తన ప్రయాణానికి ముగింపు పలికాడు. 2008లో మొదలైన ఐపీఎల్ ప్రస్థానానికి దాదాపు 19 సీజన్ల తర్వాత వీడ్కోలు చెప్పేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు టైటిళ్లు అందించిన ఈ దిగ్గజ కెప్టెన్.. ఇకపై మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో ధోనీ ఎంత సంపాదించాడు..? ఒక్కో సీజన్‌లో పారితోషికంగా ఎంత అందుకున్నాడు..? ప్రస్తుతం ధోనీ ఆస్తుల విలువ ఎంత..? ఇక్కడ తెలుసుకుందాం.

2008లో ఐపీఎల్ మొదటి సీజన్‌కు ముందు ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ రూ.6.03 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్లోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచిన ధోనీ.. తన అద్భుతమైన కెప్టెన్సీతో చెన్నై టీమ్‌ను సక్సెస్‌ఫుల్‌గా టీమ్‌గా తీర్చిదిద్దాు.2016, 2017 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌పై నిషేధం విధించడంతో ఆ రెండు సీజన్లు రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తరఫున ఆడాడు. ఆ తర్వాత తిరిగి సీఎస్‌కేలో టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. 2018 నుంచి 2021 వరకు ఒక్కో సీజన్‌కు రూ.15 కోట్ల చొప్పున పారితోషికం అందుకున్నాడు. 2022 నుంచి 2024 వరకు రూ.12 కోట్ల చొప్పున తీసుకున్నాడు. 2025, 2026 సీజన్లలో రూ.4 కోట్ల చొప్పున సీఎస్‌కే అతడిని రిటైన్ చేసుకుంది.

ధోనీ ఐపీఎల్ పారితోషికం వివరాలు ఇలా..

ఐపీఎల్ సీజన్జట్టుధోనీ పారితోషికం
2008CSK₹6.03 కోట్లు
2009CSK₹7.32 కోట్లు
2010CSK₹6.88 కోట్లు
2011CSK₹8.16 కోట్లు
2012CSK₹8.74 కోట్లు
2013CSK₹9.57 కోట్లు
2014CSK₹12.50 కోట్లు
2015CSK₹12.50 కోట్లు
2016RPS₹12.50 కోట్లు
2017RPS₹12.50 కోట్లు
2018CSK₹15 కోట్లు
2019CSK₹15 కోట్లు
2020CSK₹15 కోట్లు
2021CSK₹15 కోట్లు
2022CSK₹12 కోట్లు
2023CSK₹12 కోట్లు
2024CSK₹12 కోట్లు
2025CSK₹4 కోట్లు
2026CSK₹4 కోట్లు
మొత్తం₹200.70 కోట్లు


ఐపీఎల్ ద్వారా వచ్చిన ఆదాయమే కాకుండా ఇంటర్నేషనల్ క్రికెట్, యాడ్స్, వ్యాపారాలు, పెట్టుబడుల ద్వారా కూడా ధోనీ భారీగా సంపాదించాడు. వివిధ మీడియా నివేదికల ప్రకారం.. ధోనీ నికర ఆస్తుల విలువ సుమారు రూ.1,000 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ధోనీ కేవలం క్రికెటర్‌గానే కాకుండా వ్యాపారవేత్తగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. గరుడ ఏరోస్పేస్, ఖాతాబుక్, కార్స్24, ఈమోటోరాడ్ వంటి సంస్థల్లో ఆయన పెట్టుబడులు ఉన్నట్లు సమాచారం. వివిధ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ భారీ ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.

2008లో మొదలైన ధోనీ ఐపీఎల్ ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. సీఎస్‌కేకు ఐదు టైటిళ్లు అందించడంతో పాటు జట్టును అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆటగాడిగా మైదానానికి వీడ్కోలు పలికినా.. 2027 సీజన్ నుంచి మెంటార్‌గా సీఎస్‌కేతో తన అనుబంధాన్ని కొనసాగించనున్నాడు. ఒక ఆటగాడిగా మొదలై.. ఒక జట్టుకు గుర్తింపుగా మారి.. కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ధోనీ ఐపీఎల్ ప్రయాణం నిజంగా ప్రత్యేకం. స్కోర్‌బోర్డుపై పరుగులు, ట్రోఫీల్లో విజయాలు మాత్రమే కాదు.. అభిమానుల మనసుల్లో సంపాదించిన స్థానం ఆయన అసలైన సంపద.

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket
IPL