SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

MS Dhoni Retirement: చెన్నై ఫ్యాన్స్‌కు షాకింగ్‌ న్యూస్‌.. ఐపీఎల్‌కు ఎంఎస్‌ ధోనీ రిటైర్మెంట్‌

MS Dhoni Retired From IPL He Will Take Up New Role With CSK: ఐపీఎల్‌ పుట్టుక నుంచి కొనసాగుతున్న భారత క్రికెట్‌ దిగ్గజం మహేంద్ర సింగ్‌ ధోనీ ఎట్టకేలకు ఐపీఎల్‌ను వీడాడు. ఇకపై ఐపీఎల్‌లో ఎల్లో జెర్సీ వేసుకుని ధోని కనిపించడు. దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ముగిసిపోయింది. ఇకపై ధోనీ ఐపీఎల్‌లో ఎలాంటి పాత్రలో ఉండబోతున్నారనేది తెలుసా?

Written By Ravi Kumar Sargam
Published: Nov 17, 2026, 15:10 IST | Updated: Nov 17, 2026, 16:29 IST
Image Credit: Source: Twitter (X)
Join

MS Dhoni Retirement: ఐపీఎల్‌లో అతడు ఎల్లో జెర్సీతో ఇక కనిపించడు. మైదానంలో బ్యాట్‌తో అతడి మెరుపులు ఉండబోవు. ఇకపై గ్రౌండ్‌లో ఉండి ప్లేయర్లకు దిశానిర్దేశం చేయడు. భారత జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన క్రికెట్‌ దిగ్గజం మహేంద్ర సింగ్‌ ధోనీ ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్‌కు కూడా దూరమయ్యాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ఐదు ట్రోఫీలు అందించిన ధోనీ ఇకపై ఆ జట్టు తరఫున ఆటగాడిగా కనిపించడు. ధోనీ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని చెన్నై జట్టు ప్రకటించింది.

ధోనీ ఐపీఎల్‌ నుంచి రిటైర్మెంట్‌ పొందారని.. ఇకపై అతడికి మెంటర్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెన్నై సూపర్‌ కింగ్స్ ప్రకటన చేసింది. 'సీఎస్‌కే ఎన్నో విజయాలు సాధించడంలో ధోనీ కీలక పాత్ర పోషించారు. కష్టకాలాల్లోనూ జట్టుకు అండగా నిలిచారు. ధోనీతో సీఎస్‌కేకి ఉన్న అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుంది' అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ తెలిపింది. జట్టు ప్రారంభమైనప్పటి నుంచి ధోనీ సీఎస్‌కే ప్రయాణంలో కీలక భాగంగా ఉన్నారు. ఇకపై ఆయన యువ ఆటగాళ్లకు మార్గదర్శకత్వం చేయనున్నట్లు సీఎస్‌కే ప్రకటించింది. కొత్త తరం సూపర్ కింగ్స్ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో తన అనుభవాన్ని పంచుకోనున్నారని తెలిపింది. ధోనీ ఎప్పటికీ సీఎస్‌కే గుర్తింపులో భాగంగానే ఉంటారని.. చెన్నై ఎప్పటికీ ధోనీకి సొంత ఇల్లులాంటిది అని సీఎస్కే యాజమాన్యం తెలిపింది.

చెన్నై జట్టు తరఫున ఆడిన ధోని అపూర్వ విజయాలు అందించాడు. కెప్టెన్‌గా ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలు సాధించాడు. భారత జాతీయ జట్టుకు విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచిన ధోని ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా అద్భుత విజయం సాధించాడు. టీమిండియాకు రెండు ఐసీసీ ప్రపంచకప్‌లు అందించిన ధోని 2008లో ప్రారంభమైన ఐపీఎల్‌లో తొలి సీజన్‌ నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కొనసాగుతున్నాడు. చెన్నై జట్టుపై నిషేధం పడడంతో మధ్యలో రెండు సీజన్లు రైజింగ్‌ పూణె సూపర్‌జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత మళ్లీ చెన్నై జట్టుతో కొనసాగాడు.

ఐపీఎల్‌లో 18 ఏళ్ల పాటు ధోనీ ఆడాడు. దాదాపు రెండు దశాబ్దాల ఐపీఎల్‌ కెరీర్‌లో ధోని 278 మ్యాచ్‌లు ఆడాడు. 137.4 స్ట్రైక్‌రేట్‌తో ధోనీ 5,439 పరుగులు సాధించగా.. వాటిలో 24 అర్థ సెంచరీలు ఉన్నాయి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES